ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..


ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..

ఇప్పటికి

ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
భీమా కొరేగావ్ కుట్ర కేసుకు వ్యతిరేకంగా పోరాడుదాం
---------------------------
నేరమయ రాజ్యం అల్లిన కుట్ర కేసుల్లో భీమా కొరేగావ్ కు సాటి రాగలది ఉన్నదా? అనుమానమే. బహుశా ప్రపంచంలోనే ఇలాంటి ఉదాహరణలు కొన్నే ఉంటాయి. సంక్షోభంలో చిక్కుకొని ఫాసిస్టు తీరం చేరిన భారత రాజకీయార్థిక వ్యవస్థకు ఇలాంటి కుట్ర కేసు అత్యవసరం అయింది. అందుకే ఈ కేసు కింద మొదట తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ రెండేళ్లలో జాబితా పెరిగిపోయింది. సుప్రసిద్ధ మేధావులు ఆనంద్ తేలుంబ్లే, గౌతం నవల్కాలను అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రొ. హనీబాబును అరెస్టు చేశారు. విరసం సభ్యుడు క్రాంతిని ఇంకా వేధిస్తూనే ఉన్నారు. ప్రొ. ప్రేమ్ కుమార్ విజయన్, ప్రొ. రాకేష్ రంజన్ లకు, ఆనంద్‌ తేల్‌తుంబ్డే కుటుంబ సభ్యులకు, మరి కొందరు న్యాయవాదులకు ఇదే కేసు కింద సమన్లు ఇచ్చారు. ఇలా ఈ కేసు దేశవ్యాప్తంగా కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులను చుట్టుముడుతోంది.
ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక దుర్మార్గాలకు పాల్పడింది. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఇరవై వేల కోట్లు కార్పొరేట్లకు ధారాదత్తం చేసింది. కార్మిక చట్టాలను రద్దు చేసింది. ఉపా చట్టం విషపు కోరలకు పదును పెట్టింది. 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తోంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని దారుణమైన నిర్బంధంలోకి తోసేసింది. కరోనాను కూడా అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టింది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తోంది. అత్యంత దుర్మార్గమైన జాతీయ విద్యా, వ్యవసాయ, పర్యావరణ విధానాలను తీసుకొచ్చింది. మృతప్రాయంగానైనా ఉన్న 370 ఆర్టికల్ ను శాశ్వతంగా తుడిచేసి కశ్మీర్‌ను ఖైదు చేసి ఏడాది దాటిపోయింది. రామజన్మభూమి విషయంలో సుప్రీంకోర్టుతో అత్యంత దుర్మార్గమైన తీర్పు ఇప్పించింది. దేశమంతా కరోనా కల్లోలంలో చిక్కుకొని ఉంటే నిస్సిగ్గుగా అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసింది... ఇలా ఒకటా.. రెండా.. భీమా కొరేగావ్ కుట్ర కేసు మొదలైన ఈ రెండేళ్లలోనే దేశాన్నంతా ఫాసిజం అనేక వైపుల నుంచి ఆక్రమించింది. జైల్లో దుర్భర స్థితిలో ఉన్న ప్రజా మేధావులకు మాట్లాడే అవకాశమే ఉంటే ఈ దుర్మార్గాలను నిశితంగా విమర్శించి ఉండేవారు. ఏదో ఒక మేరకైనా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేవారు. ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ప్రత్యామ్నాయాలను ముందుకు తీసుకొచ్చేవాళ్లు. అందుకే వాళ్లను ఫాసిస్టు రాజ్యం చీకటి ఖైదులోకి తోసేశారు. ఈ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది.
ఈ రెండేళ్లలో అరెస్టులు పెరిగిపోయాయేగాని ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదు. బెయిలు పిటీషన్లను పదే పదే తిరస్కరించడం తప్ప న్యాయ ప్రక్రియ జరిగిందంటూ లేదు. ఈ రెండేళ్లలో వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్‌ తేల్‌తుంబ్డే, గౌతం నవల్కా తదితరుల ఆరోగ్యాలు పాడైపోయాయి. జైలులోకి కరోనా వ్యాపించింది. అయినా బెయిలు ఇవ్వలేదు. వరవరరావుకు వైద్యం చేయించాలని ప్రపంచమంతా ఒక్క గొంతుతో ఆందోళన చేయాల్సి వచ్చింది. అలాగే సాయిబాబాకు పెరోల్ ను అనేక సార్లు తిరస్కరించారు. ఆయన తల్లి మరణించాక కూడా కోర్టు పెరోలను తిరస్కరించి తన ఫాసిస్టు స్వభావాన్ని చాటుకున్నది. అనారోగ్యం ఆయనను ప్రమాదపు అంచులకు తీసికెళ్లింది.
మేధావులను చూసి భయపడుతున్న ఈ రాజ్య దుర్మార్గాన్ని సమాజం అంగీకరించలేదు. దేశదేశాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దాన్ని ఇంకా తీవ్రం చేయాల్సి ఉంది. అందులో భాగమే ఈ సభ. తప్పక విజయవంతం చేయండి.
- విప్లవ రచయితల సంఘం

Keywords : virasam, bhimakoregaon, varavararao, anand teltumbde, sudha bharadvaj, nia, hani babu
(2020-09-20 18:20:32)No. of visitors : 237

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


ఇప్పటికి