ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు


ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు

ఎల్గార్

ఎల్గార్ పరిషత్ కేసులో ముగ్గురు న్యాయవాదులకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 28 న ఏజెన్సీ ముంబై కార్యాలయానికి హాజరుకావాలని పిలిచిన ముగ్గురు న్యాయవాదులు- నిహాల్‌ సింగ్ రాథోడ్, విప్లవ్ తేల్తుంబ్డే, నాగ్‌పూర్‌కు చెందిన మరొక న్యాయవాది, (తన గుర్తింపును బహిర్గతం చేయదలచుకోలేదు).
ఈ కేసులో అరెస్టయిన పలువురు నిందితులకు డిఫెన్స్ లాయర్‌గా ఉన్న నాగ్‌పూర్‌కు చెందిన 33 ఏళ్ల న్యాయవాది రాథోడ్, మొదట ఫోన్ చేసి తరువాత ఇమెయిల్ ద్వారా నోటీసు పంపినట్లు చెప్పారు. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా వున్న నాగ్‌పూర్‌లోని ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు 2018 వరకు జూనియర్‌ గా పనిచేశారు. జూన్ 6, 2018 న గాడ్లింగ్‌ను అరెస్టు చేసిన తరువాత, అతనితో పాటు ఇతర అరెస్టు చేసిన నిందితులను రాథోడ్ ప్రాతినిధ్యం వహించారు.
డిఫెన్స్ న్యాయవాదులకు, తమ క్లయింట్ల కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారం, వ్యూహాలు తెలిసి వుంటాయి. ఈ పరిస్థితిలో, రాథోడ్‌ను ప్రశ్నించడం కోసం ఎన్ ఏ పిలవడం వల్ల అతనికి మాత్రమే కాకుండా అతని క్లయింట్‌లకు కూడా హాని కలిగే అవకాశం వుంది.

రాథోడ్ మానవ హక్కుల రంగంలో చేసిన కృషికి పేరుగాంచాడు. "అంబేద్కరైట్ కార్యకర్త" గా గుర్తింపు వుంది. అతను షెడ్యూల్డ్ తెగకు చెందినవాడు. అతని రచనలు ఎక్కువగా మహారాష్ట్రలోని సంచార, షెడ్యూల్డ్ తెగల సమస్యలపై దృష్టి సారించాయి. అనేక పౌర హక్కుల సంస్థలతో సంబంధం కలిగి ఉండటంతో పాటు, సంచార, షెడ్యూల్డ్ తెగల సామాజిక-రాజకీయ హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ ʹసంఘర్ష్ వాహిని భట్కే విముక్త్ సంఘర్ష్ పరిషత్ʹ సహ-స్థాపకుడు.
దర్యాప్తు సంస్థలు రాథోడ్‌పై తమ దృష్టిని సారించడం ఇదే మొదటిసారి కాదు. ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన సంస్థ, పూణే పోలీసులు, ఈ కేసులో మరొక నిందితురాలు, న్యాయవాది కూడా అయిన సుధా భరద్వాజ్ దగ్గర దొరికినట్లు చెప్తున్న ఒక లేఖలో అతని పేరు మొదటగా బయటపడింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం, "కామ్రేడ్ ప్రకాష్" కు "కామ్రేడ్ సుధా" రాసిన ఈ లేఖలో, "బాధ్యత, రిస్క్" తీసుకోవటానికీ, నక్సలిజం కేసులలో చిక్కుకున్న వారి కేసులతో పోరాడటానికీ అనేక మంది న్యాయవాదులు సంసిద్ధంగా వున్నారనీ, రాథోడ్‌తో సహా న్యాయవాదులు "కొరియర్"గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారని, "కోర్టు కేసులకు హాజరయ్యే కామ్రేడ్ల" నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారనిʹ పేర్కొన్నారు. ఈ లేఖలో విప్లవ్ తేల్తుంబ్డే గురించి కూడా ప్రస్తావించారు.

అయితే, ఈ కేసులో డిఫెన్స్ న్యాయవాదులు పోలీసుల ఆరోపణలను ఖండించారు సుధా భరద్వాజ్. మరొక నిందితుడు, ఖైదీల హక్కుల కార్యకర్త రోనా విల్సన్ నుండి దొరికినట్లు చెబుతున్న లేఖల్లోని అనేక పదాలు మరాఠీలో ఉన్నాయి. వీరిద్దరికీ మరాఠీ మాట్లాడటం లేదా వ్రాయడం రాదు.
గత సంవత్సరం, ఇజ్రాయెల్ సంస్థ NSO స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించి నిఘా కోసం లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశంలో 100 మందికి పైగా జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలలో రాథోడ్ ఒకరు. రాథోడ్ ఇమెయిల్ ఖాతా కూడా మాల్వేర్ ద్వారా దాడికి గురైంది. బెర్లిన్ కేంద్రంగా ఉన్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిజిటల్ బృందం, టొరంటో విశ్వవిద్యాలయం నుండి పనిచేసే ది సిటిజెన్ ల్యాబ్ అనే పరిశోధనా సంస్థ నిర్వహించిన వివరణాత్మక ఉమ్మడి దర్యాప్తులో, " స్పైవేర్ పెగాసస్‌ జర్నలిస్టులు లేదా కార్యకర్తలను ఎరవేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిందనీ, పెద్ద నిఘా కుట్రలో భాగమని" కనుగొన్నారు.
న్యాయవాది విప్లవ్ తేల్తుంబ్డేకు సమన్లు పంపడానికీ, తరచూ దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకోవడానికి తన ఇంటి పేరు మాత్రమే కారణమనీ. అంతకుముందు, మామ మిలింద్ తేల్తుంబ్డే వల్ల, మరొక మామ ఆనంద్ తేల్తుంబ్డే కారణంగా అని విప్లవ్ అంటున్నారు. తాను చివరిసారిగా మిలింద్ కాకాని 1996 లో కలిశాననీ, ఆ సంవత్సరం అతను కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాక అప్పటి నుండి ఎప్పుడూ చూడనేలేదనీ విప్లవ్ అంటున్నారు. మిలింద్ తేల్తుంబ్డే నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) సంస్థ అగ్రశ్రేణి నాయకుడనీ, 1996 నుండి అనేక అజ్ఞాత ఉద్యమాలలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆనంద్ తేల్తుంబ్డే ఒక సీనియర్ విద్యావేత్త, పౌర హక్కుల కార్యకర్త, ఇటీవల ఎల్గార్‌ పరిషత్ కేసులో అరెస్టయ్యారు.
కుటుంబ వారసత్వంగా వచ్చిన వానిలో వున్న ఇంట్లో నివసిస్తున్నాడు. మిలింద్, ఆనంద్ తేల్తుంబ్డేల తల్లి కూడా అతనితోనే వుంటున్నారు.

2006 నుండి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది విప్లవ్ 2004 లో ఈశాన్య మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో చివరి సంవత్సరం న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడు"నక్సల్ ఉద్యమంలో" పాల్గొన్నారనే ఆరోపణలతో అరెస్టు అయ్యారు. యవత్మల్ జిల్లాలోని వాని, చంద్రపూర్, భండారా జిల్లాల్లో ఐదు వేర్వేరు కేసులు నమోదు చేశారు. మూడు నెలలు నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అతని కేసులను న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ చేసారు. అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడడానికి మూడు సంవత్సరాలు పట్టింది.

2007 నుండి కొత్త కేసులేవీ నమోదు కాలేదు కానీ, రాష్ట్ర పోలీసుల వేధింపులు మాత్రం ఆగిపోలేదు. "గత రెండు సంవత్సరాలలో, ముఖ్యంగా ఎల్గర్ పరిషత్ దర్యాప్తు ప్రారంభమైన తరువాత, పోలీసులు నా క్లయింట్లను లక్ష్యంగా చేసుకున్నారు, నా గురించి సమాచారం ఇవ్వమని వారిని బలవంతం చేశారు. వారిలో కొందర్ని హింసించారు కూడాʹ అని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా వున్న పౌర హక్కుల కార్యకర్త, న్యాయవాది అరుణ్ ఫెర్రెరా కేసు 2011 లో వాదించారు. దేశభక్త్ యువ మంచ్ (ఫోరమ్ ఫర్ పేట్రియాటిక్ యూత్) సభ్యుడైన ఫెర్రెరా, నక్సల్ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని 2006 లో అరెస్టు అయినప్పుడు అతని కేసును వాదించిన డిఫెన్స్ న్యాయవాదుల బృందంలో విప్లవ్ ఉన్నారు.

ʹఎల్గర్ పరిషత్ కార్యక్రమంలో లేదా కార్యకర్తలు, న్యాయవాదుల అరెస్టుల తరువాత ఏర్పడిన డిఫెన్స్ కమిటీలో లేకున్నా కూడా నాకు ఎన్ఐఏ సమన్లు ఎందుకు పంపిందో అర్థం కావడం లేదు. నేను ఇంతవరకూ వరకు భీమా కోరెగావ్‌కు వెళ్ళనేలేదు. ఆ స్థలం ఏమిటో తెలుసుకోవడానికి కుతూహలంతో 2019లో భీమా కోరెగావ్‌ వెళ్దామను కున్నాను ʹఅని ఆయన చెప్పారు.

Keywords : elgar parishad, bhima koregaon, NIA, Lawyers
(2021-06-24 04:37:21)No. of visitors : 395

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

Search Engine

పోరాటం నుండి నేను వెనక్కి వచ్చాను... హరిభూషణ్ ప్రజల కోసం నిలబడ్డాడు -ఎమ్మెల్యే సీతక్క‌
Addaguduru custodial death: దళిత మహిళ లాకప్ డెత్ పై న్యాయ విచారణకు ఆదేశించిన హైకోర్టు
హరిభూషణ్ తో ఒకరోజు....
హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై ఐదేళ్లు...
ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం
ʹనాన్నకు న్యాయం దొరుకుతుందనే ఆశ అడుగంటుతోందిʹ
ʹమన్‌రేగాʹ లో కులపర, మనువాద సలహాలు
అడ్డగూడూరు లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి - POW
కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌
సిల్గర్ పోలీసు క్యాంపు ముందు వేల మందితో కొనసాగుతున్న నిరసన - జూన్ 27-29న‌ భారీ ర్యాలీకి ప్రణాళిక‌
ఈ హత్యలను మీరెందుకు ప్రశ్నించడం లేదు? - పద్మకుమారి
ఒకవైపు ʹసిల్గరిʹ పోరాటం...మరో వైపు ʹనహరిʹ పోలీసు క్యాంపు ఎత్తివేయాలంటూ దంతెవాడలో భారీ ర్యాలీ
Chattisgarh: కాల్పులకు నిరసనగా ఆదివాసుల భారీ ర్యాలీ... ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి - పోలీసులపై చర్యలకు డిమాండ్
అభయ్ పేరిట విడుదలైన ప్రకటనకు జంపన్న జవాబు
సందె గంగన్న అమర్ రహే ‍- పోరుదారిలో నేలకొరిగిన కన్న బిడ్డను గుండెకద్దుకొని కన్నీటి సంద్రమైన గుంపుల ‍
బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం
శనివార‍ం సందె గంగయ్య అంత్య క్రియలు: మా అన్నది బూటకపు ఎన్ కౌంటర్... సందె గంగయ్య సోదరుడు
మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌
Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పౌరహక్కుల సంఘం నేతలు... ప్రజా సంఘాల‌పై నిషేధం ఎత్తివేయాలని విఙప్తి
Etala Rajendar :ఈటల రాజేందర్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ - సందె గంగయ్యతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి !
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు బ్రాహ్మణిజం వ్యతిరేకం అన్నందుకు నటుడిపై కేసు
more..


ఎల్గార్