గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌


గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

గణపతి

(సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగిపోబోతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం)

తేదీ : 3 సెప్టెంబర్, 2020

గణపతి "సరెండర్ ఒక హై టెంక్షన్ కల్పిత కథʹ.
మోదీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర, తెలంగాణ మరియు ఛత్తీస్ గడ్ ఇంటలిజెన్సీసంస్థలు కలిసి తయారు చేసిన కట్టుకథను తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఫాసిస్టు మోడీ, అమిత్ షా, చంద్రశేఖర్ రావు, విజయ్ కుమార్, కేంద్ర ఇంటలిజెన్సీ సంస్థ, తెలంగాణ ఎఎబి మరియు ఛత్తీస్ గడ్ ఇంటలిజెన్సీ ఎజెన్సీలు కలిసి ఈ హై టెంక్షన్ కట్టుకథను తయారు చేసి, అమ్ముడు పోయిన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నీచమైన, దుర్మార్గమైన చౌకబారు ఎత్తుగడల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం.నరహంతక మోడీ పరిపాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. నిరుద్యోగం తారా స్థాయికి చేరింది. ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. హిందూత్వ ఎజెండాలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలోకి దిగారు. జనవరి నెలలో కోవిడ్-19 గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించినా మోడీ ప్రభుత్వం ప్రపంచ టెరరిస్టు ట్రంపు సేవలో మునిగిపోయింది. మార్చి నెలలో అకస్మాత్తుగా విధించిన లా డౌన్ల వలన దేశ ఆర్థిక వ్యవస్థ పతనపు అంచులకు చేరింది. లాక్ డౌన్ అంటేనే ఫాసిస్టు నిర్భందమని ప్రజలకు అర్థమైంది. ఈ లాక్ డౌన్ కాలంలోనే దేశ వనరులను, సంపదను దేశ, విదేశీ కార్పోరేట్లకు అప్పజెప్పె అనేక చర్యలను మోడీ ప్రభుత్వం చేపట్టింది. దీనికి ముందే ప్రశ్నించే గొంతులను, సామాజిక కార్యకర్తల వంటి వందల మంది మీద కల్పిత కేసులు పెట్టి, జైళ్ళలో నిర్బంధించింది.మరో వైపున కాశ్మీర్ లో సైనిక బలగాలను దించి దానిని మరొక పాలస్థీనాగా మార్చింది. నాగా మరియు ఇతర ఈశాన్య జాతుల సమస్యల మీద కూడా సైనిక పరిష్కారాన్ని ఎంచుకుంటున్నది. కాశ్మీర్ విషయంలోనూ ఇంకా ఇతర సమస్యల విషయంలోనూ మోడీ ప్రభుత్వానికి అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణను పరిష్కరించటంలో ఘోరంగా వైఫల్యం చెందింది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించినట్లయితే, అంతర్జాతీయ వేదికల మీద తగిన ఆధారాలు చూపించి ఇతర దేశాల మద్దతును కూడగట్టాలి. అది చేయకుండా దేశంలో మీడియాలో యుద్ధ ప్రేలాపనలు, దేశ భక్తి నాటకాలు ఆడి చైనా యాప్ను నిషేధించి గూగుల్, రిలయన్స్ లకు దేశ మార్కెట్ ను అప్పజెప్పింది. మరోవైపున అమెరికా చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొటే ప్రకటనలు చేస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఫాసిస్టు మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాల కోసం ఇటువంటి నాటకాలు అడుతున్నారని, తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను అసలు సమస్యల నుండి పక్క దారి పట్టిస్తున్నారని అర్థమవుతున్నది. అమెరికా-చైనాల మధ్య 2018 నుండి వ్యాపార, వాణిజ్య యుద్దాల రూపంలో ఘర్షణ మొదలైంది. దీనిలో దళారీ మోడీ అమెరికా తరుపున ఒక పావుగా పనిచేస్తున్నాడు. దేశ ప్రజల ప్రయోజనం దీనిలో శూన్యం. దళారీ మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్, రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్, అజిత్ దోవల్, విజయ్ కుమార్ వంటి వారు నెంబర్ వన్ దేశ ద్రోహులు. వీరిని తరిమి కొట్టవలసిన సమయం అసన్నమైంది. అంబానీ, అదానీ ప్రయోజనాలే వీరికి ముఖ్యం.దేశంలో రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పోలీస్, మిలటరీ యంత్రాంగాలు మరియు ప్రచార అంగాలన్నీ ఫాసిస్టు కాషాయ భావజాలంతో కూడిన వ్యక్తులతో నిండిపోయాయి. దేశంలో నేడు ఉన్నది భయానక, దుర్మార్గ పచ్చి ఫాసిస్టు పాలన. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు అన్నీ దేశ, విదేశీ కార్పోరేట్ల సేవలో మునిగి తేలుతున్నాయి. మరో పక్క దేశ భక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రోజుకొక్క పథకం, పూటకొక్క నినాదంతో మోడీ ప్రచార దాడిని కొనసాగిస్తున్నాడు. కార్పోరేట్ కళ్యాణ్ యోజన అనేదే అసలైన మోడీ పథకం. వరవరరావు, సాయిబాబా, అనంద్ తేల్ తుంబ్లే, సుధా భరద్వాజ్, అరుణ్ పెరీరా, వెర్నెస్ గొంజాల్వేస్,రోనా విల్సన్, సురేంద్రర్ గాడ్లింగ్, షోమా సేన్, గౌతమ్ నవలఖా, సుధీర్ దాన్లే, మహేష్ రావుత్ వంటి ఇతర ప్రముఖులను జైళ్ళలో నిర్భందించినందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ ప్రభుత్వానికి ముయు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి. .మరోక వైపున 2022 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని, కేవలం కార్పోరేట్ల ప్రయోజనాలను నెరవేర్చే న్యూ ఇండియానునిర్మిస్తామని పెట్టుకున్న లక్ష్యం కూడా నెరవేరటం లేదు. సమాధాన్ దాడిని తట్టుకొని, నిలబడి తెలంగాణ మరియు ఇతర ప్రాంతాలల్లో మా శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి కార్యదర్శి దేశాల మధ్య మరియు సాయుధ పోరాట సంస్థలతో కాల్పుల విరమణను ప్రకటించి, అందరూ ఐక్యంగా కొవిడ్-19ను ఎదుర్కోవాలని చేసిన విజ్ఞప్తిని కూడా మోడీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కొవిడ్-19 ప్రబలుతున్న కాలంలో కూడా అత్యంత రాక్షసంగా మోడీ ప్రభుత్వం మరియు అయా రాష్ట్ర ప్రభుత్వాలు మా పై చేపట్టిన మిలటరీ క్యాంపెయిన్లు విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో మావోయిస్టు పార్టీ ఒక్కటే ప్రత్యమ్నాయమని ప్రజలు ఎదురు చూస్తున్నారు.సంక్షిప్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనమై, ప్రజల సమస్యలు పెరిగిపోయి, పార్లమెంటరీ వ్యవస్థలన్నీ ఫాసిస్టు సంస్థలుగా మారిపోయి, రాజ్యాంగ కోవిదులు, ప్రముఖులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మరియు పీడిత ప్రజలు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించటానికి తయారవుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం ఇంటా, బయట అన్నీ రంగాలల్లో పూర్తిగా బ్రష్టు పట్టింది. మోడీ ప్రతిష్ఠ ఘోరంగా దిగజారింది. ఈ పరిస్థితుల్లో కార్పోరేట్లలో విశ్వాసాన్ని పెంచటానికి మరియు ప్రజల్లో మా పట్ల ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీయటానికి ఇటువంటి హై టెంక్షన్ కట్టుకథలను మోడీ ప్రభుత్వం అల్లింది.కామ్రేడ్ గణపతి వయసు, చిన్న చిన్న అనారోగ్య సమస్యల రీత్యా స్వచ్ఛందంగా కార్యదర్శి బాధ్యత నుండి తప్పుకొని ఇతరులకు అప్పగించాడు. ప్రపంచ చరిత్రలోని పోరాట సంస్థలలో ఇటువంటి మార్పులు సహజమే. సిద్ధాంత పరంగా, రాజకీయంగా మా నాయకత్వం దృఢంగా, పటిష్టంగా ఉండి పాలక వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా పార్టీ నాయకత్వపు ప్రతిష్ఠను అంతర్జాతీయంగా కూడా దెబ్బ తీయడానికి ఇటువంటి కట్టుకథలను ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వాల విశ్వసనీయత ఏనాడో మట్టికొట్టుకుపోయింది. ప్రభుత్వాలు, ఇంటలిజెన్సీ సంస్థలు తయారు చేసిన ఇటువంటి కట్టుకథలను మీడియా ప్రచారం చేయటం ద్వారా దీని విశ్వసనీయత మరింత దిగజారింది. కార్మికులు, రైతాంగం, పెట్టిబూర్జువా సెక్షన్లు సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు, ప్రజాస్వామిక వాదులు, దేశ భక్తులు, ప్రగతిశీల శక్తులు ఇంకా ఇతర పీడిత సెక్షన్లు ఈ ప్రభుత్వాల దుర్మార్గ కుట్రలను అర్థం చేసుకొని తిప్పికొట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడవలసిందిగా కోరుతున్నాము.చివరిగా, మరొక సారి మోడీ మరియు ఇంటలిజెన్సీ సంస్థల అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫాసిస్టు పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఇనుమడించిన ఉత్సాహంతో, దృఢ దీక్షతో, అమరుల ప్రేరణతో తీవ్రంగా పోరాడుతూ పాలక వర్గాల దుర్గాలను ధ్వంసం చేస్తూ ముందుకు పోతామని ప్రకటిస్తున్నాం. ఎంతో అనుభవం కలిగి, నిస్వార్ధ, సిద్ధాంత, రాజకీయ పటుత్వం కలిగిన మా కేంద్ర కమిటీ నాయకత్వంలో ఉద్యమాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు తీసుకుపోతామని, అంతిమ విజయం సాధిస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నాం.
విప్లవాభినందనలతో,
అభయ్
అధికార ప్రతినిధి, కేంద్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : maoists, ganapathi,
(2020-09-20 18:20:46)No. of visitors : 2341

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
more..


గణపతి