వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం


వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం

వరవరరావు


భీమా కోరేగావ్ కేసులో తలోజా జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు ఇద్దరు అల్లుళ్ళు కె. సత్యనారాయణ, కె.వి.కుమార్నాథ్ లను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు రావాలని ఆదేశించింది. వీరితోపాటు కలకత్తాకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ పార్థ సారథి రేను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. సత్య నారాయణ దళిత కార్యకర్త, ఇఫ్లూలో ప్రొఫెసర్ కాగా కూర్మనాథ్ సీనియర్ జర్నలిస్టు. ఈ ముగ్గురిని NIA ముంబై కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.

"నా మామ, విప్లవ కవి వరవరరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించే నెపంతో నా ఫ్లాట్‌ను 2018 ఆగస్టులో పూణే పోలీసులు దాడి చేశారని మీకు తెలుసు" అని సత్యనారాయణ ఆ ప్రకటనలో తెలిపారు. ʹʹ నాకు భీమా కోరేగావ్ కేసుతో ఎలాంటి సంబందం లేదని ఆ రోజే చెప్పాను. వరవర రావు నా మామ‌ కావడం వల్లనే నా ఇంటిపై దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేశారు.ʹʹ

"ఒక వైపు వరవర రావు ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగా లేదు, మరో వైపు ముంబైలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సమయంలో NIA నన్ను విచారణకు ముంబై పిలవడం మా కుటుంబాన్ని మరింతగా బాధకు గురి చేస్తుంది" అని సత్యనారాయణ‌ చెప్పారు. "నేను ఈ భయంకరమైన కాలంలో ముంబైకి ప్రయాణిస్తున్నాను." అన్నారు
ʹʹనా ఇంటిపై NIA దాడి చేసినప్పుడు ఎలాగైతే మీరంతా నాకు మద్దతుగా నిల్చి, NIA చర్యను ఖండించారో ఇప్పుడు కూడా నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నానుʹʹ అని సత్యనారయణ తన ప్రకటన‌లో పేర్కొన్నారు

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పార్థసారథి రే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇతర మేధావుల మాదిరిగానే తనను వేధించడానికి NIA ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. "సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఈ కేసులో ఏజెన్సీ నన్ను సాక్షిగా పిలిచింది" అని పిటిఐకి చెప్పారు. ʹʹ నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. నేను భీమా కోరెగావ్‌కు ఎన్నడూ వెళ్ళలేదు. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. వార్తాపత్రికలలో దాని గురించి చదివే వరకు నాకు ఈ సంఘటన గురించి కూడా తెలియదు.ʹʹ అన్నారు పార్థ సారథి.

భీమా కోరేగావ్/ఎల్గర్ పరిషథ్ కేసులో అనేక మంది విద్యావేత్తలు, న్యాయవాదులు, కార్యకర్తలను NIA ప్రశ్నించింది. ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేసింది. జూలై 28 న ఢిల్లీ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల వచ్చే అసమ్మతిని అరికట్టడానికి, భారతదేశంలో మేధావుల గొంతు నొక్కడానికి, వారిని మాట్లాడకుండా చేయడానికే ఈ అరెస్టు విచారణ్ అపేరుతో బెధిరింపులు జరుగుతున్నాయని పలు హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.

భీమా కోరేగావ్ కేసులో హానీ బాబుతో పాటు వరవరరావు, సుధీర్ ధవాలే, షోమా సేన్, మహేష్ రౌత్, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెర్రెరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, ఆనంద్ తెల్తుంబే, గౌతమ్ నవలఖలను అరెస్టు చేశారు.
ఈ కేసులో జైల్లో ఉన్న వరవరరావుతో సహా పలువురు తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు. వరవరరావుకు ఇతర అనారోగ్య సమస్యలే కాక కరోనా కూడా సోకి కదలలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్నప్పటికీ... ఎవ్వరికీ బెయిల్ రాకుండా NIA అడుగడుగునా అడ్డుపడుతోంది.
(scroll.in సౌజన్యంతో)

Keywords : varavararao, bhimakoregaon, elgar parishath, NIA, Talija jail, Mumbai
(2020-09-20 18:20:56)No. of visitors : 384

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
more..


వరవరరావు