భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...

భీమా

భీమా కోరేగావ్ / ఎల్గర్ పరిషథ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసింది ఎన్ ఐ ఏ. కళా కారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే రమేష్ గైచోర్ల ను నిన్న(సెప్టంబర్7, 2020) అరెస్టు చేయగా కళాకారిని, రచయిత, దళిత కార్యకర్త జ్యోతీ జగతాప్ ను ఈ రోజు (సెప్టంబర్ 8, 2020)అరెస్టు చేశారు. దీంతో భీమా కోరేగావ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టయినవాళ్ళ సంఖ్య 15కు చేరుకుంది. వీరిలో ఎక్కువమంది, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, లాయర్లు, పౌరహక్కుల కార్యకర్తలు.

నిన్న అరెస్టు కాబడిన‌ సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్ లు పూణేకు చెందిన సాంస్కృతిక సంస్థ‌ కబీర్ కళా మంచ్ (కెకెఎం) కళాకారులు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, వారు డిసెంబర్ 31, 2017 న పూణేలోని శనివార్ వాడాలో ఎల్గార్ పరిషత్ నిర్వహించిన ʹభీమా కోరేగావ్ శౌర్య దిన్ ప్రేర్నా అభియాన్ʹ లో సభ్యులు. భీమా కోరెగావ్ యుద్ధం 200 వ వార్షికోత్సవం సందర్భంగా సభ నిర్వహించిన వాళ్ళలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు.

గోర్ఖే, గైచోర్లను ప్రశ్నించడానికి కొద్ది రోజులు క్రితమే ముంబైకి ఎన్ఐఏ పిలిచింది. సోమవారం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. సిపిఐ-మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని పూణే సిటీ పోలీసులు ఎల్గార్ పరిషత్ కేసులో బుక్ చేసిన 23 మందిలో గోర్ఖే , గైచోర్ కూడా ఉన్నారు. వీరిపై యుఎపిఎ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదైంది.

కబీర్ కళా మంచ్ కు చెందిన ఒక కళాకారుడిని ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇలా రాసింది. ʹఈ (ఎల్గార్ పరిషత్) కేసు పూర్తిగా అబద్ధం. కోరెగావ్ భీమా హింస వెనుక నిజమైన నిందితులు సాంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటేళూ. వారిపై అసలు దర్యాప్తే జరగలేదు. ప్రభుత్వ ఏజెన్సీలు ప్రగతిశీల శక్తులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ʹʹ

చాలా కాలంగా అంబేద్కరిస్ట్ ఉద్యమంలో పని చేస్తున్న కళాకారిణి, రచయిత, కబీర్ కళా మంచ్ కార్యకర్త జ్యోతి జగ్తాప్ ను ఈ రోజు అరెస్టు చేశారు. ఆమె భీమా కోరేగావ్ షౌర్యదిన్ ప్రేర్నా అభియాన్ సభ్యురాలు. భీమా కోరెగావ్ యుద్ధం 200 వ వార్షికోత్సవం సందర్భంగా సభ నిర్వహించిన వాళ్ళలో ఈమె కూడా ఉన్నారు.

ఈ ముగ్గురి అరెస్టుపై మహారాష్ట్ర కు చెందిన‌ ʹభీమా కోరేగావ్ షౌర్యదిన్ ప్రేరానా అభియాన్ʹ ఓ ప్రకటన విడుదల చేసింది.

పూణే ఎటిఎస్ ఈ రోజు భీమా కోరేగావ్ శౌర్యదిన్ ప్రేరానా అభియాన్ మరియు కబీర్ కలా మంచ్ సభ్యురాలు జ్యోతి జగ్తాప్ ను అరెస్ట్ చేసింది. ఆమెను ఎన్‌ఐఏకు బదిలీ చేస్తారు. నిన్న, సెప్టెంబర్ 7 న, సాగర్ గోర్ఖే మరియు రమేష్ గైచోర్లను అరెస్టు చేశారు.ఈ రోజు జ్యోతి జగ్తాప్ అరెస్టయ్యారు. జూన్ 2018 నుండి, భీమా కోరెగావ్ - ఎల్గర్ పరిషత్ కేసులో 15 మంది మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, రచయితలు మరియు కళాకారులను అరెస్టు చేశారు.

కళాకారిణిగా, కార్యకర్తగా, రచయితగా జ్యోతి జగ్తాప్ చాలా సంవత్సరాలుగా అంబేద్కారియేట్ ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి అరెస్టులను హెచ్చరికగా పరిగణించాలి. దేశంలో భయం వాతావరణాన్ని సృష్టించడానికి మోడీ ప్రభుత్వం మరోసారి అరెస్టుల సిరీస్‌ను ప్రారంభిస్తోంది. పోలీసుల వద్ద‌ ఎటువంటి ఆధారాలు లేకుండానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. మొత్తం భీమా కోరేగావ్ కేసు కల్పిత మరియు పూర్తిగా నకిలీ కథల ఆధారంగా అల్లబడింది. ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మళ్లీ మళ్లీ విఫలమవుతోన్న కారణంగా ప్రజల దృష్టి మళ్ళించడం కోసం అర్బన్ నక్సల్ వంటి అబద్దపు శత్రువులను సృష్టిస్తోంది.

భీమా కోరేగావ్ - ఎల్గర్ పరిషత్ కేసు బ్రాహ్మణ పురాణాలలో వివరించిన విధంగా మరిగే నూనె కుండలా మారింది. బ్రాహ్మణ పాలనను సవాలు చేసే ఎవరైనా, ఆ నూనె కుండ‌లోకి విసిరివేయబడతారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల కోపం తీవ్రమవుతోందని మేము మోడీ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాము.

భీమా కోరేగావ్ షౌర్యదిన్ ప్రేరానా అభియాన్ గా, జ్యోతి జగ్తాప్ విడుదల కోసం మరింతగా స్వరం పెంచాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.

8 సెప్టెంబర్ 2020
భీమా కోరేగావ్ షౌర్యదిన్ ప్రేరానా అభియాన్, మహారాష్ట్ర

Keywords : bhima koregaov case, mia, pune, mumbai, Sagar Gorkhe, Ramesh Gaichor,Jyoti Jagtap
(2024-04-21 18:05:12)



No. of visitors : 1024

Suggested Posts


Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee

We would like to extend our appreciation of the directions made by you on 12.05.2020, liberalizing the conditions for the release of undertrial prisoners in Maharashtra jails, and also clarifying that those undertrials who are otherwise excluded from this category (including those who are charged under Special Acts such as UAPA, NDPS etc) are eligible to

భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు

దళితుల ఐక్యత కు, పోరాటానికి చిహ్నమైన భీమా కోరేగావ్.. పాలకులను ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన భీమా కోరేగావ్ లో దళితులు నిర్వహించిన‌ విజయోత్సవాలపై దుర్మార్గమైన దాడులు చేసి దళితుల మరణానికి, వందలాది మంది గాయాలపాలవ్వడానికి కారణమైన హిందూ మతోన్మాద ఉగ్రవాదులను వదిలేసిన పోలీసులు దళితులకు మద్దతుగా నిలబడ్డవారిపై విరుచుకపడుతున్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు డాక్టర్ పికె విజయన్, రాకేశ్ రంజన్‌లకు ఎన్ఐఏ సమన్లు పంపడాన్ని ఖండించండి!

హిందూ కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు డాక్టర్ పి.కె. విజయన్, శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌ లో ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాకేశ్ రంజన్‌లు ఇద్దరూ విశ్వవిద్యాలయ సముదాయానికి దశాబ్దాల జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్తలు. వారు ప్రజాస్వామిక హక్కులు, ఉన్నత విద్య అందుబాటు మరియు కుల, వర్గ, సముదాయ ప్రాతిపదికన వివక్ష వంటి సమస్యలపై పని చేశారు.

ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ

భీమా కోరే గావ్ కేసులో నిన్న అరెస్టు కాబడిన కబీర్ కళా మంచ్ కళాకారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే , షాహిర్ రమేష్ గైచోర్ లను ఎన్ ఐ ఏ కొంత కాలంగా విచారణ పేరుతో వేధిస్తోంది. ప్రధాని హత్యకు కుట్ర కేసులో సాక్షులుగా మారాలని

కరోనా కాలంలో...ఆనంద్ తేల్తుంబ్డే కు తాత్కాలిక బెయిల్ తిరస్కరించిన కోర్టు

ఎల్గర్ పరిషత్ - భీమా కోరెగావ్ కేసులో నిందితుడు విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే వైద్య కారణాలపై దాఖలు చేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టు అతన్ని తలోజా జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా

హానీ బాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా అన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. మిరాండా హౌస్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా

స్టాన్ స్వామి మృతికి నిర‌స‌న‌గా జైల్లో నిరాహార దీక్ష‌

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో నిందితులుగా తలోజా జైల్లో ఉన్న పది మంది హక్కుల కార్యకర్తలు నిరాహార దీక్ష‌కు దిగారు. త‌మ‌తో పాటు స‌హ నిందితుడిగా ఉన్న‌ ఫాదర్ స్టాన్ స్వామి అనారోగ్యంతో మృతి చెంద‌డానికి ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ వీరు ఒక రోజు నిరాహార దీక్ష‌ను చేప‌ట్టారు.

ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc

వరవరరావు, ప్రొఫెసర్‌ షోమాసేన్‌, ప్రొఫెసర్‌ ఆనంద్‌ టెల్టుంట్లే, గౌతమ్‌ నవలాఖా లాంటి మేధావులను,సుధా భరద్వాజ్‌ లాంటి న్యాయవాదులను, మరికొద్దిమంది బుద్ధిజీవులను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి జైళ్ళలో నిర్పంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన గురిని మరికొద్దిమందిపైకి ఎక్కుపెట్టింది. మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలతో పాటు ప్రజాస్వామిక ఉద్యమకారు

అరెస్టవబోయే ముందు గౌతమ్ నవ్లాఖా రాసిన ʹస్వేచ్ఛా గీతంʹ

ఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధాన కార్యాలయంలో సరెండర్ అవడానికి వెళ్లబోతూ, ఈ వారం బైట గడపడానికి, నాకొక వారం స్వేచ్ఛ ఇవ్వడానికి ఏప్రిల్ 8న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇచ్చిన తీర్పుకు సంతోషపడుతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, ఈ లాక్ డౌన్ సమయంలో కూడ, ఒక వారం రోజుల స్వేచ్ఛ అంటే చాల విలువైనది.

Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR

The Campaign Against State Repression (CASR) condemns the arrest of Professor Hany Babu MT at Mumbai by the National Investigation Agency (NIA) in connection with the Bhima Koregaon-Elgaar Parishad case.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భీమా