ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం


ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం

ప్రజాస్వామిక

స్వామి అగ్నివేశ్ మృతితో దేశంలో ఒక విలక్షణమైన ప్రజాస్వామిక ఆలోచనా ధార ఆగిపోయినట్లే. పేరులో, తీరులో సంప్రదాయం, ఆధ్యాత్మికత ఉట్టిపడే వ్యక్తిలో అద్భుతమైన ఆధునిక ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి. ఆయన ఆలోచనలకు, వ్యక్తిత్వానికి, ఆచరణకు అవే కేంద్రం. ఆర్య సమాజ్ ప్రతినిధిగా దశాబ్దాలపాటు ఆయన వ్యవహరించారు. ఆ పరిమితులు అగ్నివేశ్ లో ఉన్నాయి. కానీ జీవితమంతా ఆయన పీడన, దోపిడీ, అసమానత, హిందూ మతోన్మాదాలపై రాజీ లేకుండా పోరాడారు. హిందుత్వను పాఖండ్ అనేవారు. వ్యవస్థ దుర్మార్గాలకు బలైపోతున్న దాదాపు అన్ని సెక్షన్ల ప్రజల గురించి ఆయన పట్టించుకున్నారు. సమాజంలోని వేర్వేరు భావజాల శక్తులతో ఆయన స్నేహానికి, ఘర్షణకు ప్రజాతంత్ర విలువలే పునాది. వీధి బాలల వెట్టి చాకిరీ విముక్తి పోరాటం దగ్గరి నుంచి వ్యవస్థను సమూలంగా మార్చే సాయుధ విప్లవాల దాకా ఆయన కార్యరంగంలో భాగం. పౌర ప్రజాస్వామిక హక్కులను, పీడన లేని మానవ జీవితాన్ని ఆయన ప్రగతిశీల విలువల గీటురాయి మీద చూశారు. ఆ విలువలు మన సమాజం అనేక వైపుల ప్రోది చేసుకున్న సంపద. అట్టడుగు ప్రజల ఆరాటాలు, పోరాటాలు, ఆకాంక్షలు ఈ విలువలను, ఆదర్శాలను ముందుకు తీసుకొచ్చాయి. ఆర్యసమాజ్ లో ఉంటూనే అగ్నివేశ్ వీటన్నిటినీ స్వీకరించారు. వాటిని తన జీవితాచరణకు మార్గదర్శకం చేసుకున్నారు. పోరాటాల ద్వారానే విలువల ఉ న్నతీకరణ జరుగుతుందనే భావన ఆయనకు ఉండేది. అందుకే ఎలాంటి ప్రజా పోరాటానికైనా ఆయన మద్దతు ఉండేది. చాలా వాటిలో ఆయన నేరుగా పాల్గొనేవారు.
ఎమర్జెన్సీ తర్వాత హర్యానాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయ్యారు. ఆ సందర్భంగా ఆయన రైతులపై ప్రభుత్వం జరిపిన హత్యాకాండను మంత్రివర్గంలో ఉన్నా తీవ్రంగా వ్యతిరేకించారు. దానిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని కాపాడుకోడానికి ఆయన తన విలువలను వదులుకోలేదు. ప్రజల పక్షాన నిలబడటానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి పదవిని వదులుకున్నారు. నిజానికి ఆయన ఎమర్జెన్సీ తర్వాత వెల్లువెత్తిన ప్రజాస్వామిక పోరాటాలన్నిటికీ మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా దేశంలో తిరిగి ఊపందుకున్న విప్లవోద్యమంతో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. తెలంగాణలో భూస్వామ్య సకల దోపీడీ పీడలనకు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన మిలిటెంట్ రైతాంగ పోరాటాలకు గట్టి సంఘీభావం ప్రకటించారు. సమాజంలో అత్యంత దుర్భర స్థితిలో ఉన్న పీడిత సమూహాలకు చట్టపరమైన రక్షణల దగ్గరి నుంచి ఆ స్థితిని ధ్వంసం చేయగల వర్గపోరాటాల దాకా ఆయన అన్నిటినీ గౌరవించారు. వాటిలోని ప్రజా ఆకాంక్షలను, విలువలను చారిత్రక పురోగమనంలో భాగంగా చూడటం వల్లే ఇది సాధ్యమైంది. 1982లో కరీంనగర్ రైతుకూలి సంఘం మహా సభల్లో పాల్గొనడం దగ్గరి నుంచి ఈ నలభై ఏళ్లలో అనేక సందర్భాల్లో విప్లవోద్యమం మీద దాడులను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేశారు. భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేకంగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా విప్లవ, ప్రజా సంఘాల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వంతో విప్లవకారులకు చర్చలు జరగాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం విప్లవోద్యమ అగ్రనాయకుడు కా. అజాద్ ను (చెరుకూరి రాజ్ కుమార్)ను కుట్ర పూరితంగా హత్య చేసింది. దీనిపై అగ్నివేశ్ తీవ్రమైన ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు ఐదారు దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన ఎల్ల వేళలా పీడితుల పక్షానే ఉన్నారు. శాస్త్రీయతను వ్యతిరేకించే మూఢాచారాల దగ్గరి నుంచి మతాన్ని, దోపిడీ ఆర్థిక వ్యవస్థను ఆధారం చేసుకున్న హిందుత్వ రాజకీయ నియంతృత్వాన్ని ఆయన సునిశితంగా వ్యతిరేకించారు. వేర్వేరు రూపాల్లో పెచ్చరిల్లిపోతున్న హిందుత్వ దుర్మార్గాలను ఎండగట్టారు. అందుకే ఆయన సంఘ్ పరివార్ దాడులకు గురయ్యాడు. 2018 జులై 18న జార్ఖండ్ లో సంఘ్ పరివార్ మూక ఆయనపై దారుణంగా భౌతిక దాడికి పాల్పడి గాయపరిచింది. అనేకసార్లు సంఘ్ హెచ్చరికలకు గురయ్యారు. అవమానాలకు గురయ్యారు. ఆయన జైలు జీవితం గడిపారు. కానీ ఆయన తన విశ్వాసాలను వదులుకోలేదు. సాహసోపేతంగా జీవించారు.
ఆయన పాటించిన ప్రజాస్వామిక విలువలను బలోపేతం చేయాలి. సంఘ్ ఫాసిజం పెచ్చరిల్లిన ఈ కాలంలో స్వామి అగ్నివేశ్ లాంటి విలక్షణ చింతనాపరుల భాగస్వామ్యం మరింత అవసరం. ఆయన కొనసాగించిన విలువలు మరణంతో ముగిసిపోయేవి కాదు. వాటిని శక్తివంతం చేయాలి. అదే ఆయనకు నివాళి
అరసవిల్లి కృష్ణ(అధ్యక్షుడు)
బాసిత్ (ఉపాధ్యక్షుడు)
రివేరా(సహాయ కార్యదర్శి)
విప్లవ రచయితల సంఘం

Keywords : agnivesh, virasam, Revolutionary Writers Association
(2021-06-24 04:36:34)No. of visitors : 361

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

Search Engine

పోరాటం నుండి నేను వెనక్కి వచ్చాను... హరిభూషణ్ ప్రజల కోసం నిలబడ్డాడు -ఎమ్మెల్యే సీతక్క‌
Addaguduru custodial death: దళిత మహిళ లాకప్ డెత్ పై న్యాయ విచారణకు ఆదేశించిన హైకోర్టు
హరిభూషణ్ తో ఒకరోజు....
హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై ఐదేళ్లు...
ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం
ʹనాన్నకు న్యాయం దొరుకుతుందనే ఆశ అడుగంటుతోందిʹ
ʹమన్‌రేగాʹ లో కులపర, మనువాద సలహాలు
అడ్డగూడూరు లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి - POW
కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌
సిల్గర్ పోలీసు క్యాంపు ముందు వేల మందితో కొనసాగుతున్న నిరసన - జూన్ 27-29న‌ భారీ ర్యాలీకి ప్రణాళిక‌
ఈ హత్యలను మీరెందుకు ప్రశ్నించడం లేదు? - పద్మకుమారి
ఒకవైపు ʹసిల్గరిʹ పోరాటం...మరో వైపు ʹనహరిʹ పోలీసు క్యాంపు ఎత్తివేయాలంటూ దంతెవాడలో భారీ ర్యాలీ
Chattisgarh: కాల్పులకు నిరసనగా ఆదివాసుల భారీ ర్యాలీ... ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి - పోలీసులపై చర్యలకు డిమాండ్
అభయ్ పేరిట విడుదలైన ప్రకటనకు జంపన్న జవాబు
సందె గంగన్న అమర్ రహే ‍- పోరుదారిలో నేలకొరిగిన కన్న బిడ్డను గుండెకద్దుకొని కన్నీటి సంద్రమైన గుంపుల ‍
బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం
శనివార‍ం సందె గంగయ్య అంత్య క్రియలు: మా అన్నది బూటకపు ఎన్ కౌంటర్... సందె గంగయ్య సోదరుడు
మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌
Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పౌరహక్కుల సంఘం నేతలు... ప్రజా సంఘాల‌పై నిషేధం ఎత్తివేయాలని విఙప్తి
Etala Rajendar :ఈటల రాజేందర్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ - సందె గంగయ్యతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి !
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు బ్రాహ్మణిజం వ్యతిరేకం అన్నందుకు నటుడిపై కేసు
more..


ప్రజాస్వామిక