ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!


ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!

ఉమర్

ఉమర్ ఖలీద్‌ను ఈశాన్య ఢిల్లీ హింసాకాండపై దర్యాప్తు పేరిట ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిద్దాం!
* కార్యకర్తలు, మేధావుల వేధింపులను ఆపండి!
సెప్టెంబర్ 15, 2020
సెప్టెంబర్ 13 నాడు పది గంటలకు పైగా సుదీర్ఘ విచారణ చేసిన తరువాత, ఢిల్లీ పోలీసులు పూర్వ జెఎన్‌యు విద్యార్థి ఉమర్ ఖలీద్‌ను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ 59/2020 కింద క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నివారణ) చట్టం (యుఎపిఎ) లోని అనేక సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆసిఫ్ ఇక్బాల్ తన్హా, దేవంగన కాలిత, గుల్ఫిషా, ఖలీద్ సైఫీ, ఇష్రత్ జహాన్, మీరన్ హైదర్, నటాషా నార్వల్, షార్జీల్ ఇమామ్, షిఫా ఉర్ రెహమాన్, ఇంకా అనేకమందితో పాటు, ఉమర్ ఖలీద్ ప్రజలపై, ప్రత్యేకించి ఈశాన్య ఢిల్లీలోని ముస్లిం సముదాయంపై హింసాకాండని ప్రేరేపించే కుట్ర చేశారని అభియోగం మోపారు.
మత వివక్షతో కూడిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్) లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై, ఆ ఉద్యమం అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో, బిజెపి నాయకులు కపిల్ మిశ్రా, రాగిణి తివారీ, అనురాగ్ ఠాకూర్ మొదలైనవారు రెచ్చగొట్టిన మితవాద ముఠాలతో కలిసి ఢిల్లీ పోలీసులు చేసిన క్రూరదాడులు, ఆ తరువాత ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసా కాండపై దర్యాప్తు చేసే నెపంతో ఢిల్లీ పోలీసులు కార్యకర్తలు, మేధావులను లక్ష్యంగా చేసుకోవడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. అమిత్ షా నేతృత్వంలోని గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఢిల్లీ పోలీసులు వుండడం రాజ్యమూ, దాని పోలీసు బలగాల పక్షపాత స్వభావాన్నీ, బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్ట్ ఎజెండాకు వారి విధేయతను కూడా స్పష్టంగా తెలియచేస్తుంది.
వలసరాజ్య పాలనలో రాజకీయ ఖైదీల గౌరవం కోసం పోరాడిన భారత విప్లవకారుడు జతిన్ దాస్ 91వ వర్ధంతి రోజు ఉమర్ ఖలీద్‌ను అరెస్టు చేసినట్లు గమనించాలి. వ్యక్తిగత గుర్తింపుతో సంబంధం లేకుండా ఖైదీలందరినీ సమానంగా చూడాలని కోరుతూ 63 రోజుల నిరాహార దీక్ష చేసి జతిన్ దాస్ అమరుడయ్యాడు. CAA, NRC, NPR లకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ, ఆ నేపథ్యంలోనూ ముస్లిం సముదాయాన్ని, ప్రత్యేకించి 2020 ఫిబ్రవరి చివరలో జరిగిన హింసాకాండ ఫలితంగా ఎక్కువగా నష్టపోయిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఒక క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ పోలీసులు జతిన్ దాస్ వారసత్వాన్నీ, పోరాటాలనూ అణచివేస్తున్నారు.
COVID-19 విపత్తు వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 47 లక్షల పాజిటివ్ కేసులు, 77,000 కి పైగా మరణాలు, ప్రతిరోజూ దాదాపు లక్ష కొత్త కేసులు వస్తున్న తరుణంలో ఈ అరెస్టులు జరుగుతున్నాయి. రాజ్య వ్యవస్థలు తమ వనరులను కేటాయించడంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మొండిగా నిరాకరిస్తున్నాయి. అయితే, అసమ్మతిని మరింతగా అరికట్టడానికి, ప్రజాపక్ష విద్యావేత్తలు, కార్యకర్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కవులు, కార్మిక సంఘాల కార్యకర్తలు, ప్రత్యేకించి ప్రజాస్వామికవాదులను లక్ష్యంగా చేసుకొని వేటాడి వేధించడానికి ఈ భయానక స్థితిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దర్యాప్తు పేరిట రాహుల్ రాయ్, సబా దివాన్ లతో పాటు అనేక మందికి జారీ చేసిన సమన్లు ప్రజాస్వామ్య స్వరాల్లో ఖైదు చేయబడతామనే భయాన్ని కలిగిస్తాయి. రాజ్య ఎజెండాను అతి స్పష్టంగా అమలుచేస్తున్న పోలీసులకు శిక్షకుగురవుతామనే భయం ఏమాత్రం లేదని కూడా సూచిస్తుంది.
CAA, NRC, NPR లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో అపనమ్మకాన్ని, భయాన్ని కలిగించడం కోసం ఖైదీలుగా వున్నవారి ఎంపిక చేసిన కల్పిత ʹబహిర్గత ప్రకటనలʹను మీడియాకు అందచేయడంతో పాటు, ప్రొఫెసర్ అపూర్వానంద్, సీతారాం యేచురి, జయతి ఘోష్, రాహుల్ రాయ్, యోగేంద్ర యాదవ్ వంటి ప్రసిద్ధ ప్రజాస్వామిక స్వరాల పేర్లు చార్జిషీట్‌లో పెట్టడం లాంటివి చేస్తుంది. భావప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు, ప్రజాస్వామ్యానికి అవసరమైన యితర హక్కులన్నింటినీ అణిచివేయడం, అలాంటి అంశాలను లేవనెత్తేవారిని నేరస్తులుగానూ, దేశ ద్రోహులుగానూ ముద్ర వేయడం అనేది అందులో వున్న ప్రబలమైన లక్ష్యం.
1975 అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజాస్వామ్య సూత్రాల నిర్మూలన మరెన్నడూ యింత ప్రస్ఫుటంగా జరగలేదు. నేటి పరిస్థితి ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తుల మధ్య, ముఖ్యంగా అట్టడుగు, అణగారిన కులాలు, వర్గాలు, సముదాయాలు, జాతుల ఐక్యతను డిమాండ్ చేస్తూంది. రాజ్య అణచివేత వ్యతిరేక పోరాటానికి ఈ ఐక్యత ఆధారంగా ఉండాలి, రాజ్య అణచివేత సాధారణమైనప్పుడు, ప్రజాస్వామ్యం తన ఉనికిని కోల్పోయినప్పుడు బ్రాహ్మణ హిందుత్వ ఫాసిజపు పట్టు బలం పుంజుకుంటుంది.
సమాజంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య సెక్షన్లు అరెస్టులను, దర్యాప్తు పేరిట జరిగే వేధింపులను ఏకకంఠంతో ఖండించాలని రాజ్యఅణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (CASR) విజ్ఞప్తి చేస్తూంది. 2020 ఫిబ్రవరి నెలాఖరులో ఈశాన్య ఢిల్లీలో ప్రజలకు సంభవించిన మరణాలు, గాయాలు, జీవనోపాధి, ఆస్తి నష్టం, నిర్వాసత్వం లాంటి వాటికి కారణమైన అసలైన నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉమర్ ఖలీద్ అరెస్టును ఖండిస్తున్నాం. రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం! ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం కోసం పోరాడే అన్ని స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
*Campaign Against State Repression*
(Organising Team: AISA, AISF, APCR, BCM, Bhim Army, Bigul Mazdoor Dasta, BSCEM, CEM, CRPP, CTF, Disha, DISSC, DSU, DTF, IAPL, IMK, Karnataka Janashakti, KYS, Lokpaksh, LSI, Mazdoor Adhikar Sangathan, Mazdoor Patrika, Mehnatkash Mahila Sangathan, Morcha Patrika, NAPM, NBS, NCHRO, Nowruz, NTUI, Peopleʹs Watch, Rihai Manch, Samajwadi Janparishad, Satyashodak Sangh, SFI, United Against Hate, WSS)

Keywords : umar khalid, delhi, riots, arrest, UAPA, CAA, NRC, NPR
(2020-09-20 18:26:51)No. of visitors : 119

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రి

ʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని.....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
more..


ఉమర్