ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !

ఏచూరి

ప్రస్తుతం కేరళ, వియూర్‌లోని హై-సెక్యూరిటీ జైలులో ఉన్న సిపిఐ (మావోయిస్టు) నాయకుడు రూపేష్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)పై సిపిఎం కేంద్ర, కేరళ రాష్ట్ర పార్టీ నాయకత్వాల ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి లేఖ రాశారు.
ఢిల్లీ అల్లర్ల కేసులో UAPA కింద యేచురిపై కూడా అభియోగాలు మోపబడే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఈ లేఖ రాశారు.
UAPA చరిత్రను బ్రిటీష్ కాలంలో అపఖ్యాతి పాలైన రౌలాట్ చట్టంతో పోల్చారు రూపేష్. దేశంలో ఉన్న అన్ని చట్టాలలోకి ఈ చట్టం అత్యంత కఠినమైనదని అన్నారు. 2019లో సవరణ తర్వాత ఇది మరింత దుర్మార్గంగా మారింది.
UAPAకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించినందుకు సిపిఎంను ప్రశంసిస్తూ ఈ చర్య రాజకీయ ఖైదీలకు అపారమైన విశ్వాసాన్నిచ్చేదన్నారు రూపాష్. అయితే కేరళలో మాత్రం ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు రూపేష్. UAPA సెక్షన్ 45ను బలహీనపరిచేందుకు 2008లో చేసిన సవరణ ఒక నిర్దిష్ట చర్య అని, అప్పుడు యేచూరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని అన్నారు. UAPAలోని సెక్షన్ 45 ఒక చట్టబద్ధమైన అధికారం నుండి అనుమతి ఉండాలని నిర్దేశిస్తుంది. ఈ నిబంధన ఏకపక్షంగా చట్టాన్ని ఉపయోగించడం నుంచి కాపాడటానికి ఉద్దేశించబడింది.
సెక్షన్ 45 నిబంధనను పాటించనందుకు కేరళ హైకోర్టు రూపేష్‌పై పెట్టిన మూడు కేసులను రద్దు చేసింది. అయితే, కేరళ ప్రభుత్వం పునరాలోచన చేయడానికి బదులు, హై కోర్టు ఇచ్చిన ఆ ఆర్డరును నిలుపు(స్టే) చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కోవిడ్ 19 కారణంగా సుప్రీంకోర్టు పనితీరు బాగా దెబ్బతిన్న సమయంలో ఆగస్టు 18 న పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అడ్వకేట్ జనరల్ మధ్యంతర స్టే కోరారు . సుప్రీంకోర్టులో ఇంటర్‌లోకటరీ దరఖాస్తును దాఖలు చేయడానికి ఖరీదైన ప్రైవేట్ న్యాయవాది సేవను ఉపయోగించారని రూపేష్ ఆరోపించారు. "UAPAకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం నుండి సిపిఎం కేరళ కమిటీకి మినహాయింపు ఉందా" అని రూపాష్ ఏచూరిని ప్రశ్నించారు.
మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసిఓసిఎ) లాంటి చట్టాన్ని కేరళలో కూడా రూపొందించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోందని తాను వార్తాపత్రికల్లో చదివానని రూపేష్ అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఇటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ, కేరళలో మాత్రం వాటిని స్వాగతిస్తున్నది. అలాన్, త్వాహాలను అరెస్టు చేయడం, బెయిల్‌పై విడుదలైన డానిష్‌ను తిరిగి అరెస్టు చేయడాన్ని చూస్తే బిజెపి, కాంగ్రెస్ విధానాలను ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కాపీ చేస్తోంది అని అనిపిస్తోందని రూపాష్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. అఖిల భారత స్థాయిలో సిపిఎం UAPA వ్యతిరేక ప్రచారం చేస్తున్నది. కేరళలో మీ ప్రభుత్వం చేపట్టిన‌ చర్యలు UAPAకు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల‌ UAPA కు వ్యతిరేకంగా మీరు చేసే ప్రచారం పైనే సందేహం వస్తున్నది అని రూపాష్ అన్నారు.

Keywords : kerala, maoists, rupesh, sitaram yechury, letter, UAPA
(2024-04-16 04:45:37)



No. of visitors : 904

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఏచూరి