మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు


మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు

మావోయిస్టు

సీపీఐ (మావోయిస్టు) 16వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ ఏర్పడిన సెప్టెంబర్ 21 నుండి 27వరకూ వారోత్సవాలు జరపాలని కమిటీ అధికారప్రతినిధి జగన్ తన ప్రకటనలో కోరారు. జగన్ ప్రకటన పూర్తి పాఠం....

మన పార్టీ 16వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 21 నుండి 27వరకూ దేశ వ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకొండి!

పార్టీని కంటికి రెప్పలా రహస్యంగా కాపాడుకొంటూ, శతృవు అభేధ్యమైన, బలమైన పార్టీని నిర్మించుకొండి.!

గెరిల్లా యుద్ధం లో క్రియాశీలంగా పాల్గొని తీవ్రతరం - విస్తృతం చేయండి. శతృవు వ్యూహాత్మక ʹసమాధాన్ʹ ప్రణాళికను సమాధి చేయండి!!

భారత విప్లవ మహా నాయకులు, పార్టీ సంస్థాపకులు ఉపాధ్యాయులు కా, చారు మజుందార్, కా, కన్హయ్ చటర్జీ ల నాయకత్వంలో ఆవిర్భవించిన రెండు ప్రధాన విప్లవ స్రవంతుల సంగమంగా, మహత్తర నక్సలబరీ రైతాంగ సాయుధ విప్లవ వెల్లువతో పాటుగా, భారత కమ్యూనిస్టు ఉద్యమ సుధీర్ఘ చరిత్రలో విప్లవాత్మక అంశాలన్నింటికి నిజమైన కొనసాగింపుగా, నిజమైన భారత విప్లవ కార్మిక వర్గ అగ్రగామి దళంగా మన పార్టీ - భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) ఆవిర్భవించి సెప్టెంబర్ 21 నాటికి 16 సంవత్సరాలు పూర్తిగా నిండుతాయి. ఈ సందర్భంగా పార్టీ 16వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 21 నుండి 27వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ,పట్టణ, మైధాన అటవి ప్రాంతాల్లో విప్లవోత్సహంతో, విప్లవ సంకల్పంతో నిర్వహించాల్సిందిగా విప్లవ ప్రజలకు, పార్టీ శ్రేణులకు రాష్ట్ర కమిటీ పిలుపనిస్తుంది.

మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయ వంతం చేసి, అంతిమంగా ప్రపంచ వ్యాప్తంగా సోషలిజాన్ని - కమ్యూనిజాన్ని నెలకొల్పే లక్ష్యంతో సాగుతున్న ప్రజాయుద్ధంలో ఈ సంవత్సర కాలంలో వంద మందికి పైగా కామేడ్స్ అమరులయ్యారు. ఇందులో పదహారు మంది మహిళ కామేడ్స్ వున్నారు. అమరుల ధైర్య సాహసాలు,ధృడ సంకల్పం, అంకిత భావం, అమరుల త్యాగాల ఫలితంగానే విప్లవోద్యమంలో పలు విజయాలు సాధించగలిగాము. పార్టీ 16వ వార్షి కోత్సవం సందర్భం గా ప్రజల కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి తమ చివరి ఊపిరి వరకు పార్టీకి, విప్లవానికి సేవ చేసినా విప్లవ వీరులకు , వీరాంగనలకు, విప్లవ ప్రజానికానికి జోహార్లు తెలుపుదాం. వారి ఆశయాల నుండి స్పూర్తి ని పొందుదాం. వారి నిస్వార్థ సేవలను , త్యాగ నీరితిని ఎత్తి పడుతూ విజయ సాధనకు వారు నడిచిన విప్లవబాటలో తుది వరకు పోరాడుదామని శపథం చేద్దాం.

భారత దోపిడి పాలక వర్గాలు మన పార్టీ నాయకత్వంలోని విప్లవోద్యమాన్ని తుడిచి పెట్టిందుకు ఈ సంవత్సరం విప్లవ ప్రతి ఘాతుక "సమాధాన్" ప్రణాళికలో భాగంగా ఆపరేషన్ పహార్ పేరుతో తీవ్రమైన దాడి సాగించాయి. పార్టీ ఈ దాడిని తిప్పి కోడుతూ త్యాగాల సంప్రదాయాలను కొనసాగిస్తూ విప్లవోద్యమాన్ని పురోగమింప చేయడానికి కృషి చేసింది.

తెలంగాణలో శత్రవు పాశవిక దాడుల మూలంగా విప్లవోద్యమం దిబ్బతిని తాత్కలిక సెట్ బ్యాక్కు గురిఅయిన విషయం మనందరికి తెలిసిందే. మళ్ళీ తిరిగి విప్లవోద్యమ పునర్ నిర్మాణానికి పార్టీ కృషి చేస్తుంది. అందులో భాగంగానే ప్రజల మాళిక సమస్యల పై వివిధ రంగాలలో నిర్మాణాలు చేపట్టి ప్రజలను సంఘటిత పరుస్తుంది. ప్రజా స్వామిక తెలంగాణ నినాదాన్ని ప్రజల్లో ప్రత్యామ్నాయ మార్గంగా నిలుపుతూ తెలంగాణ ప్రజా సంఘాల నాయకత్వంలో పలు రకాల పోరాటాలు నిర్వహించింది. బహుళ జాతి కంపెనీల, వారి దళారి కంపెనీల గనుల తవ్వకాలు, భారీ ప్రాజెక్టులు, ప్లాంటు, డ్యా ములు, అభయారణ్యాలు, టైగర్ జోన్ తవ్వకాలు, ఓపెన్ కాస్టులు యూరేనియం తవ్వకాలు, చేపట్టి ప్రజలను బలవంతంగా విస్థాపనకు విధ్వంసాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల చర్యలకు, విధానాలకు వ్యతిరేకంగా, హరిత హారం పేరుతో అడవుల నుండి ఆదివాసీల గెంటివేతకు వ్యతిరేకంగా, పోడు భూమలరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, భూస్వామ్య పెట్టుబడిదారి, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలు సంఘటితం అవుతూ మిలిటెంట్ పోరాటాలు సాగించారు. జల్, జంగల్, జమీన్ కోసం ఆదివాసీలు ప్రత్యేక పోరాటాలు చేపట్టారు. శతృవు నిరంతర దాడుల మధ్య నిర్భందాలకు, త్యాగాలకు వెరవకుండా ధృడ సంకల్పంతో ప్రజలను సంఘటితం చేయడంలో దళాలు, పార్టీ ఆహార్నిశలు శ్రమిస్తూనే వున్నాయి.

దేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రజల రాజ్యాధికారం కోసం రాజకీయ, నిర్మాణ, మిలటరీ రంగాలలో చాలా కృషి చేసింది.

బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టులు సాగించే మూక హత్యలకు ( మోబ్ లించింగ్ ) ఇతర బౌతిక దాడులకు, హత్య కాండలకు వ్యతిరేకంగా వివిధ స్థాయిలో పీడిత సామాజిక సెక్షన్లు మహిళలు, దళితులు, ఆదివాసీలు, మతమైనార్టీలను సమైక్యం చేస్తూ పోరాటాలు కొనసాగాయి. రామజన్మ భూమి - బాబ్రీ మసీదు వివాదాలపై సుప్రీ కోర్టు ఇచ్చి హిందూత్వ పక్షపాత తీర్పుకు,
జమ్ము కాశ్మీర్ ప్రజల స్వయం ప్రతిపత్తిని కాలరాసే ఆర్టికల్ 370 , 35 ఎ అధికరణల రద్దుకు వ్యతిరేకంగా, ఎన్ ఐ ఏ , ఊపా, మొదలైన కూరమైన చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా స్వామిక వాదుల అరెస్టులకు , నిర్భందాలకు నిషేధాలకు నిర్వాసిత ఇంకా అనేక ప్రజా సమస్యల పై ఐక్యసంఘటనలు ఏర్పరుస్తు పోరాటాలు చేపట్టాము.

మన పార్టీ నాయకత్వంలో పిఎల్ జిఏ బలగాల చొరవ, తెగింపు, సాహసంతో తమ శక్తి మేరకు గెరిల్లా యుద్ధాన్ని సాగిస్తూ శత్రవు దాడిని నిలవరిస్తున్నాయి. ఎత్తుగడల ఎదురుదాడి క్యాంపియన్లు చేపట్టి కొన్ని విజయాలు సాధించాము. వందలాది చిన్న చర్యలు నిర్వహించాము. దేశవ్యాప్తంగా జరుగుతున్న చిన్న చిన్న గెరిల్లా చర్యల విజయాల సమహారాన్ని స్పూర్తిగా తీసుకొని తెలంగాణలో గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేద్దాం. విస్తృతం చేద్దాం. తిరిగి బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించుకొందాం. శత్రువు అభేద్యమైన రహస్య ప్రాంతాలను నిర్మించుకుంటూ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుందాం.

ప్రియమైన ప్రజలారా !
దేశంలో బిజెపి, రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వాలు దోపిడి వర్గాల ప్రయోజనాలు నెరవేర్చడానికి ఆర్థిక సంస్కరణలను వేగిరం చేస్తున్నాయి. ఒక పక్క సామ్రాజ్యవాదుల లాభాపేక్ష, యుద్ధ నీతి, పర్యావరణ విద్వంసంలతో కరోనా వైరస్ సృష్టించి, ప్రపంచ మానవాళిని పెను ప్రమాదంలోకి నెట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభానికి గురి చేసి, సామ్రాజ్యవాదులు, నిరంకుశ పెట్టుబడి దారులు, బడా భూస్వామ్య వర్గాలు కరోన సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దోపిడి ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు ఉద్దీపన ప్యాకేజీలు కల్పించి సంక్షోభాన్ని భారాన్ని కార్మిక, కర్షక, మద్య తరగతి, తదితర పీడిత ప్రజల పై మోపుతున్నాయి. మన దేశం లో బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు మోదీ ముఠా ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు. లక్షలాది మంది వలస శ్రామికులు పనులు లేక ఆకలి చావులకు గురవుతున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం మరింత ముదిరి రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు బందు పథకం అటకిక్కింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇక నిరుద్యోగుల సమస్య చెప్పలేనంతగా ముదిరింది. ఉద్యోగుల జీతాలకు కోతలు పెట్టారు. కరోనా తో పోరాడు తున్న ప్రజలకు వైద్య సౌకర్యాలు లేవు. విద్యా విధానం గతి తప్పింది. కార్పొరేట్ విద్యా విధానానికి ఎర్ర తివాచీ పరిచింది. తత్ఫలితంగా కోట్లాది పీడిత ప్రజల్లో నెలకొని వున్న తీవ్రమైన ఆగ్రహాన్ని, అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు దేశ భక్తి ఉన్మాదాన్ని, చైనా వ్యతిరేక, పాకిస్తాన్ వ్యతిరేక దూరహకారాన్ని రెచ్చగొడుతున్నది. మరో పక్క చైనా ఎఫ్ డీఐలతో అంటకాగుతూనే స్వదేశీ నినాదం ఎత్తుకున్నది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవడానికి దశల వారి లాక్ డోన్లు విధించి భౌతిక దూరాలను సామాజికంగా దూరం చేస్తున్నది. దోపిడి వర్గాల ప్రయోజనాలకు అతి ప్రమాదకరమని భావించిన విప్లవోద్యమాలను, నిజమైన దేశ భక్తుల ను ప్రజా స్వామిక వాదులను అణిచివేయడానికి పాశ‌విక నిర్భందాలను ప్రయోగిస్తున్నది. అందులో భాగమే రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు, భూటకపు ఎన్ కౌంటర్లు, అడవుల్లో పోలీసుల కూంబింగ్ లు, మావోయిస్టు పార్టీ పై దుష్ప్రచారం, నిరంతరం దాడిని కొనసాగిస్తున్నారు.

ప్రియమైన ప్రజలారా దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు కల్పిస్తున్న భయంకర, ప్రమాదకర పరిస్థితుల నుండి బయటపడడానికి నూతన ప్రజా స్వామి విప్లవమే ఏకైక మార్గం, దోపిడి వర్గాలైన సామ్రాజ్యవాదం, బడా పెట్టుబడిదారులు, బడా భూస్వాములు సమాజానికి పునాదులు వేసుకొన్నారు. వీరి పునాదుల పై ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలకు పరిష్కారాలు దొరకవు. ప్రజల ప్రజా స్వామిక ప్రజా రాజ్యాధికారం నెలకొల్ప కోవడం ద్వారానే అంతిమ పరిష్కరం దొరకుతుంది.

సామ్రాజ్యవాద, దశారి నిరంకుశ పెట్టుబడి దారుల, బడా భూస్వాముల వ్యతిరేక వర్గ పోరాటాలలో సంఘటితం కండి. బ్రాహ్మణీయ హిందూ పాసిజ వ్యతిరేక పోరాటాలు విస్తృతం చేయండి. నిస్వార్ధంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేస్తున్న మావోయిస్టు పార్టీని అత్యంత రహస్యంగా కాపాడు కొండి, గెరిల్లా యుద్ధంలో క్రియాశీలంగా పాల్గొని గెరిల్లా చర్చలను తీవ్రతరం - విస్తృతం చేయండి, గెరిల్లా జోన్ పరిస్పెక్టివ్ ప్రాంతాలను నిర్మించుకొండి .
విప్లవాభివందనాలతో
కార్యదర్శి
జగన్


Keywords : cpi maost, telangana, jagan, formation week,
(2020-10-28 09:25:07)No. of visitors : 537

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
more..


మావోయిస్టు