భారతదేశ జైళ్ళలో 50 శాతం ‌దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే ఎందుకున్నట్టు ?

భారతదేశ

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) భారతదేశ జైళ్లలో నమోదైన వ్యక్తుల గణాంకాలను ʹ2019 ఎన్‌సిఆర్‌బి జైలు నివేదికʹ విడుదల చేసింది. భారతదేశంలోని 1350 జైళ్లలో ప్రస్తుతం 4 లక్షల 78,600 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 4.78 లక్షల మంది ఖైదీలలో 4.58 లక్షలు పురుషులు, 19,913 మంది మహిళా ఖైదీలు. మన దేశ జైళ్లలో ఖైదీలను వుంచగలిగే సామర్థ్యం కేవలం 4.03 లక్షలు మాత్రమే, అంటే జైళ్లలో ఖైదీలు సామర్థ్యానికి మించి వున్నారు. ఈ ఖైదీలలో అత్యధిక సంఖ్యలో దళిత, ఆదివాసీ, ముస్లిం ఖైదీలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ మొత్తం జనాభాలో ఈ మూడు వర్గాలకు ఈ క్రింది వాటా ఉంది:
భారతదేశ జనాభాలో వీరి సంఖ్య 39 శాతం మాత్రమే ఉన్నప్పుడు, జైళ్లలో వారి సంఖ్య 50 శాతం ఎందుకు వుంది? వాస్తవానికి వీరు ఎక్కువ నేరాలకు పాల్పడుతున్నారా లేదా మన దేశ వ్యవస్థలు పక్షపాత వైఖరితో ఉద్దేశపూర్వకంగా ఈ సమాజ ప్రజలను నేరస్థులను చూపించడానికి ప్రయత్నిస్తున్నాయా? అనేది గమనించాల్సిన విషయం.
ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం, ఖైదీలలో జైళ్లలో 18.1 శాతం ముస్లిం ఖైదీలు ఉన్నారు, కాని 2011 జనాభా లెక్కల ప్రకారం వారి జనాభా 14.2 శాతం. షెడ్యూల్డ్ కులాల ప్రజల జనాభా 16.6 శాతం కాగా జైలులో 21.2 శాతం ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల ప్రజల జనాభా 8.6 శాతం మాత్రమే వుండగా జైళ్ళలో 11.8 శాతం ఉన్నారు.

విద్య, ఆరోగ్య సేవల కొరత, నిరుద్యోగం మొదలైన సమస్యల వల్ల, అట్టడుగు వర్గాలకు చెందిన ఈ ఖైదీలు న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న విచారణా ఖైదీలలో 28.6 శాతం మంది నిరక్షరాస్యులు అని ఎన్‌సిఆర్‌బి 2019 నివేదిక పేర్కొంది.

విచారణా ఖైదీలలో 40.7 శాతం మంది పదవ తరగతి దాటి చదువుకున్నవారు లేరు. భారత రాజ్యాంగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987లు , ఉచిత న్యాయ సహాయ హక్కు గురించి చెబుతున్నప్పటికీ ఇది వాస్తవ పరిస్తితి. వాస్తవానికి, ఈ ఖైదీలకు ప్రాథమిక స్థాయిలో ʹఉచిత న్యాయ సహాయంʹ వల్ల ఎటువంటి ప్రయోజనం దొరకదు. తత్ఫలితంగా, వారికి ʹన్యాయం పొందడంʹ కంటే జైలు ప్రవేశం సులభం అని తెలుస్తుంది.

ఆర్థిక పరిమితుల కారణంగా, ఈ ఖైదీల కుటుంబాలు కూడా వారిని జైళ్ల నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాయి. ఈ ఖైదీలపై మోపిన అభియోగాలు నిరూపణకానప్పటికీ సంవత్సరాల తరబడి జైలులో వుండాల్సి వస్తోంది. 2019లో సుమారు 37 శాతం మంది విచారణా ఖైదీలు మూడు నెలల నుండి ఒక సంవత్సరం వరకు జైలు జీవితం గడిపారు. వీరిలో ఎవరూ నేరస్తులుగా నిరూఫణ లేదు.

దళితులు, ముస్లింలు, షెడ్యూల్డ్ తెగలు అధిక ʹనేర ధోరణిʹ కలిగి ఉన్నాయని నిరూపించడానికి జైళ్లలో పెరుగుతున్న దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలను ఉదహరించడం విచారకరం. ఈ రకమైన ఆలోచన సమాజంలోని మెజారిటీ వర్గాలలోనే కాదు, మన దేశంలోని పోలీసు, నేర న్యాయవ్యవస్థలు కూడా చాలావరకు ఇలాంటి దృక్పథంతోనే వున్నాయి.

ఈ పక్షపాతవైఖరి యితర నివేదికలలో కూడా కనిపిస్తుంది. 2019 లో విడుదలైన భారతదేశంలో ʹస్టేటస్ ఆఫ్ పోలీసింగ్ రిపోర్ట్ ఇన్ ఇండియాʹ సర్వే చేసిన ప్రతి ఇద్దరు పోలీసులలో ఒకరు ముస్లింలు నేరాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులపై వ్యవస్థీకృత పక్షపాత ధోరణి కారణంగా, మిగతా వారికంటే అరెస్టు అయ్యే అవకాశం ఎక్కువగా వుంటుంది. మరోవైపు, ఈ వర్గాల ప్రజలు తమపై హింస గురించి ఫిర్యాదు చేసినప్పుడు, తరచుగా వారి ఫిర్యాదు దాఖలు అవవు, ఒకవేళ అయినా, దానిపై ఎటువంటి చర్యలు తీసుకోరు.

వాస్తవానికి, ఈ సమస్య అంతా సులభంగా ఒక పరిష్కారమయేది కాదు. పోలీసు జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, పోలీసు సంస్కరణలను అమలు చేయడం, అదే సమయంలో ఈ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడం వంటి చర్యలతో కొంతవరకు ఈ సమస్యను పరిష్కరించగలం.

Keywords : india, jails, dalits, adivasi, minorities
(2024-04-22 18:27:15)



No. of visitors : 742

Suggested Posts


వాకపల్లి నెత్తిటి గాయానికి పదేళ్ళు

2007 ఆగస్టు 20న విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామనికి కూంబింగ్‌ పేరుతో గ్రేహౌండ్స్‌ దళాలు చొరబడ్డాయి. గ్రేహౌండ్స్‌ దళాలు పదకొండు మంది ఆదివాసీ కోందు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన అనైతిక సంఘటన గురించి అందరికి తెలిసిందే! ఈ ఆగస్టు 20తో ఆ అమానవీయ గాయానికి దశాబ్ద కాలం పూర్తవుతుంది. రాజ్యహింసను ఎదుర్కొంటూ, పోలీసుల....

Abduction and Wrongful Incarceration of Adivasi-Dalit activists by Police

Intimidation, Abduction and Wrongful Incarceration of Adivasi-Dalit leaders, activists and members of Niyamgiri Suraksha Samiti by Odisha Police to further the interests of Vedanta

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భారతదేశ