విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు


విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు

విచారణ

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా అడవి ప్రాంతంలో, భద్రతా దళాల క్యాంపుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం బుర్కాపాల్. ఈ గ్రామానికి వెళ్తే తమ పనులలో నిమగ్నమై వున్న మహిళలు లేదా వడిసెలతో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. కొంతమంది పురుషులు కూడా కనపడవచ్చు కానీ వారు బయటి వారితో మాట్లాడడానికి భయపడతారు.
మూడున్నర సంవత్సరాల క్రితం 2017 ఏప్రిల్ లో, 37 మంది ఆదివాసీలను చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద అరెస్టు చేసినప్పటి నుండి ఆ గ్రామంలో సాధారణ పరిస్థితి లేదు.

2017 ఏప్రిల్ లో బుర్కాపాల్ అనే గ్రామానికి కేవలం 100 మీటర్ల దూరంలో వున్న సిఆర్పిఎఫ్ 74 వ బెటాలియన్ క్యాంప్ మీద మావోయిస్టులు ఆకస్మిక దాడి చేసినప్పుడు ఒక ఇన్‌స్పె క్టర్ స్థాయి అధికారితో సహా 25 మంది సిబ్బంది మరణించారు.

మావోయిస్టులు దాడి చేసిన సమయంలో బుర్కాపాల్ గ్రామానికి సమీపంలో ఉన్న డోర్నపాల్-జాగర్ గొండ రహదారి నిర్మాణ పనులకు సైనికులు కాపలా కాస్తున్నారు.

తరువాతి కొన్ని రోజుల్లో, ఛత్తీస్‌గఢ్ పోలీసులు బుర్కాపాల్, గొండపల్లి, చింతాగుఫా, తల్మెట్ల, కొరైగుండం మరియు టోంగుడా- ఈ ఆరు గ్రామాలకు చెందిన 120 మంది ఆదివాసీలపై – చింతాగుఫా పోలీస్ స్టేషన్‌లో యుఎపిఎ, ఇతర ఐపిసి సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు.
"దాడి జరిగిన తరువాత కొద్ది రోజుల్లోనే, మా గ్రామంలోని 37 మందిని UAPA, IPC సెక్షన్ల క్రింద కేసు పెట్టి జైలుకు పంపారు" అని కొత్తగా గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన 30 ఏళ్ల ముచాకీ హండా చెప్పారు. తన అన్నయ్యని కూడా ఈ దాడిలో పాల్గొన్నాడని జైలులో పెట్టారనీ, ఆ రోజు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పురుషుడిపై కేసు పెట్టారనీ అతను చెప్పాడు.

"గ్రామంలో నివసిస్తున్న ప్రతి మగవాడి మీదా, కొంతమంది పిల్లల మీద కూడా యుఎపిఎ, ఐపిసి సెక్షన్ల కింద కేసు పెట్టారు. పట్టణాల్లో పనిచేస్తున్న వారిని మాత్రమే వదిలేశారు. నేను ఆంధ్రప్రదేశ్‌లోని కిరాణా దుకాణంలో పని చేస్తున్నాను కాబట్టి నా పేరు పెట్టలేదు, కాని నా అన్న పేరు పెట్టారు. వీరిలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాడిలో పాల్గొనలేదు, కాని వారందరినీ మావోయిస్టులు అని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారుʹ అని సర్పంచ్ అన్నారు.

మూడేళ్ళ పైగా గడచిపోయినా, ఈ కేసులలో విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. యుఎపిఎ కింద కేసు నమోదైన వారిలో ఒక్కరికి కూడా బెయిల్ మంజూరు కాలేదు. పోలీసు రికార్డుల ప్రకారం, బుర్కాపాల్‌కు చెందిన 37 మందితో సహా మూడు గ్రామాలకు చెందిన మొత్తం 120 మంది గ్రామస్తులపై దాడిలో పాల్గొన్నారని కేసు నమోదు చేశారు.

ʹనా గ్రామానికి చెందిన ఏడుగురు మైనర్ పిల్లలను కూడా ఐపిసి సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేశారు. దంతేవాడ జైలులో పద్దెనిమిది నెలలు వున్నాక వారు విడుదలయ్యారు, ʹఅని సర్పంచ్ అన్నారు.

ʹనేను కొంతమంది స్నేహితులతో కలిసి వూరి బయట ఆడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మేము తుపాకీ కాల్పుల చప్పుడు వినగానే మా యిళ్ల వైపు పరుగెత్తాము. దాడి జరిగిన కొద్ది రోజుల తరువాత, నా తండ్రిని ఎత్తుకెళ్ళారు, ఆ తరవాత ఒక రోజు మధ్యాహ్నం నిద్ర పోతున్న నన్ను భద్రతా దళాల వారు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళారు, ʹఅని భీమా సోడి, తాము ఆ రోజు ఆడుకుంటున్న ప్రాంతం వైపు చూపిస్తూ అన్నాడు. సోడి తండ్రి కూడా జైలులోనే వున్నాడు.

"120 మంది అమాయకులపై కేసు నమోదు చేసారు. ఇప్పటివరకు విచారణ ప్రారంభం కాలేదు. పెద్ద సంఖ్యలో వున్న నిందితులను క్రమం తప్పకుండా కోర్టు ముందు హాజరుపర్చడానికి తాము ఏర్పాట్లు చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్న కారణంవల్ల మాత్రమే విచారణ జరగడం ఆలస్యం అవుతోంది. తమ వద్ద తగినంతమంది కానిస్టేబుళ్లు లేరని పోలీసులు అంటున్నారు. దఫాలుగా (ఒక్కోసారి కొంత మందిని) హాజరుపరచడానికి కోర్టు మొదట్లో ఇష్టపడలేదనీ, అవసరమైన దర్యాప్తు, నేరం చేసారనే ఆధారాలు లేకుండా పోలీసులు ప్రజలను అరెస్టు చేశారుʹఅని మానవ హక్కుల కార్యకర్త, కొంతమంది నిందితుల న్యాయవాది అయిన బేలా భాటియా తెలిపారు. లాక్డౌన్ కాలంలో వారికి బెయిల్ ఇవ్వాల్సి వుండిందనీ, ఆ తర్వాత వారిని ఒక పద్ధతిలో కోర్టులో హాజరుపరచి వుండాల్సిందనీ ఆమె అన్నారు.

నిర్దోషుల మీద పోలీసులు ఉపా, యితర సెక్షన్ల కింద జైలులో పెట్టారు. విచారణ ఇప్పటికీ "ఆరోపణలను రూపొందించే" ప్రారంభ దశలో ఉంది. మూడున్నర సంవత్సరాలుగా 120 మంది నిందితులు జగదల్పూర్ జైలులో ఉన్నారు. అలాంటి ఖైదీలను రాజకీయ ఖైదీలుగా కూడా వర్గీకరించాలి.మావోయిస్టు చర్య జరిగిన ప్రాంతం నుండి పోలీసులు UAPA, IPC లోని ఇతర సెక్షన్ల క్రింద అమాయక ప్రజల మీద కేసులు పెట్టారు. వారికి లాక్డౌన్ సమయంలో బెయిల్ మంజూరు చేయాల్సి వుండింది. ఫాస్ట్ ట్రాక్ (త్వరితగతిన) కోర్టులో విచారణ జరిపి వుండాల్సింది అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ఆరోపణలు అర్థం లేనివని బస్తర్ పోలీసులు ఖండించారు.

"కోవిడ్ -19 విపత్తు, లాక్డౌన్ కారణంగా, కేసు విచారణలో అడ్డంకి వచ్చింది. ఈ కేసుపై న్యాయమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూడడానికి బస్తర్ పోలీసులు కట్టుబడి ఉన్నారు ʹఅని బస్తర్ ఐజి పి. సుందర్ రాజ్ అన్నారు.

ʹ2017 ఏప్రిల్ లో, మావోయిస్టులు భద్రతా దళాలపై జరిపిన దారుణమైన దాడిలో మా సిఆర్పిఎఫ్ జవాన్లలో 25 మందిని కోల్పోయాము, వీరు రహదారి నిర్మాణ పనులు సక్రమంగా జరగడానికి సహాయపడుతున్నారు. దర్యాప్తు చేసి 120 మందికి పైగా మావోయిస్టు కార్యకర్తలను, వారి మద్దతుదారులను అరెస్టు చేసాము. ఈ కఠినమైన చర్య ఈ ప్రాంతంలోని మావోయిస్టు కార్యకర్తల నెట్‌వర్క్‌ ను విచ్ఛిన్నం చేసింది. 2017-2018లో నిర్వహించిన ʹఆపరేషన్ ప్రఖర్ʹ వల్ల భద్రతా దళాలకు ఎత్తుగడల రీత్యా ప్రయోజనం కలిగింది. కోర్టులో కేసు విచారణకు సంబంధించినంతవరకు, బస్తర్ పోలీసులు ఈ విషయంలో పూర్తి సహకారాన్ని అందిస్తారు, ʹఅని ఆయన అన్నారు.

జగదల్‌పూర్‌లో యుఎపిఎ కేసులను విచారించడానికి ట్రయల్ కోర్టు ఒకటే వుండడం విచారణ ప్రారంభం ఆలస్యం కావడానికి ప్రధాన కారణమని కార్యకర్తలు అంటున్నారు.

"నా దృష్టిలో, ఈ కేసులను ఇతర సెషన్ కోర్టులలో కూడా విచారించాలి, తద్వారా ఇటువంటి కేసులు వివిధ కోర్టులకు పంపిణీ అయి విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది" అని అభిప్రాయపడ్డారు.

కోర్టులో మందగతిన జరిగే ప్రక్రియ కారణంగా అతిగా ఆలస్యం జరిగిందనేది కాదనలేని వాస్తవం అని బుర్కపాల్ కేసులో ఎక్కువ మంది నిందితుల తరఫు న్యాయవాదిగా ఉన్న మరో న్యాయవాది సంజయ్ జైస్వాల్ అభిప్రాయం.

"ప్రతి ఒక్కరి మీద చార్జిషీటు తయారైన తరువాత విచారణ మొదలుపెడతారు" అని జైస్వాల్ అన్నారు.

అమాయక ఆదివాసీల వేదనను ప్రభుత్వం వినడం లేదని వారి అరెస్టులను వ్యతిరేకిస్తున్న సోని సోరి అన్నారు.

ʹగ్రామంలో మగవాళ్ళెవరూ లేరు. దాడి తరువాత, భద్రతా దళాలు బుర్కాపాల్, తదితర గ్రామాల అమాయక ఆదివాసీలను ఎటువంటి ఆధారాలు లేకుండా జైలులో పెట్టాయి. నేను రెండుసార్లు ఆ గ్రామానికి వెళ్ళాను. పోలీసుల దారుణాలకి భయపడి మహిళలు, మిగిలిన పురుషులు ఆంధ్రప్రదేశ్‌కి లేదా అడవిలోకి పారిపోయారనడంలో ఆశ్చర్యం లేదు. బుర్కాపాల్ గ్రామంలోని ప్రజలు నిందితులు కాదని తమకు తెలుసునని, వాళ్ళనేమీ చేయబోమని, పారిపోయినవాళ్ళు తిరిగి గ్రామాల్లోకి రావచ్చని భద్రతా దళాలు అక్కడి అమాయక మహిళలకు చెప్పడంతో నిజమే అని నమ్మిన‌ పురుషులు వూళ్ళోకి తిరిగి వచ్చారు. అప్పుడు బలగాలు గ్రామాలను చుట్టుముట్టి, ఎటువంటి ఆధారాలు లేకున్నా వారందరినీ అరెస్టు చేశాయి. అరెస్టు చేసి మూడున్నర సంవత్సరాలు గడిచినా కూడా విచారణ ప్రారంభించలేదని మీరు ఊహించగలరా? ఇదేనా న్యాయం? ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు? ʹ అని సోనీ సోరి ప్రశ్నిస్తున్నారు.

కోర్టులో న్యాయమైన విచారణ పొందేందుకు నిందితులకు హక్కు ఉందని, ఈ విషయంలో పోలీసులకు తాను సూచనలిస్తాననీ ఛత్తీస్‌ గఢ్ డిజిపి డి.ఎం అవస్థీ చెప్పారు.

"విచారణలో జరిగిన ఆలస్యం గురించి నాకు ఎవరూ చెప్పలేదు, ఫిర్యాదు కూడా చేయలేదు. నేను సమస్య గురించి తెలుసుకుంటాను, విచారణ మొదలవడానికి అవసరమైన సూచనలు ఇస్తాను, న్యాయస్థానంలో న్యాయమైన విచారణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది ʹఅని అవస్థీ అన్నారు.

బుర్కాపాల్ కేసులో మే, జూన్ నెలల్లోనే కోర్టులో చలాన్ యిచ్చామని, లాక్డౌన్ కారణంగా విచారణ ఇంకా ప్రారంభం కాలేదనీ, హైకోర్టు సూచనల మేరకు అవసరమైన కేసులను మాత్రమే కోర్టులో విచారిస్తున్నారనీ, కోర్టు తదుపరి సూచనల తరువాత కేసు విచారణ ప్రారంభమవుతుందిʹఅని జగదల్పూర్ ప్రభుత్వ న్యాయవాది సుజాతా జస్వాల్ తెలిపారు.
(hindustantimes.com సౌజన్యంతో)

Keywords : chattis garh, burkapal, maoists, crpf
(2021-04-16 08:23:39)No. of visitors : 815

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రజలపై పారామిలిటరీ, డిఆర్‌జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్

భద్రతా దళాల సిబ్బంది గ్రామస్తులను వేధిస్తున్నారని సిపిఐ-మావోయిస్టు కిష్టారామ్ ఏరియా కమిటీ ఆరోపించింది. ఏరియా కమిటీ తొలిసారిగా వీడియో, ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.

రైతుల ఉద్యమంలాంటిదే అక్కడా నడుస్తోంది - 4 రోజులుగా చలిలో వాళ్ళు రోడ్లమీదే ఉన్నారు

కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా లక్షలాదిమంది రైతులు ఉద్యమిస్తున్నారు. దాదాపు పది రోజులుగా వణికించే చలిలో ఢిల్లీ శివార్లలో కూర్చొని ఉన్నారు రైతులు. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమంపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఆదివాసులు దాదాపు ఇటువంటి ఉద్యమాన్నే ప్రారంభించారు.

పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు

మా జీవితాలను నాశనం చేసే పోలీసులు క్యాంపులు అవసరం లేదు. మాకు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలు కావాలిʹ అంటూ అక్కడ గుమి కూడిన వందలాది మంది ఆదివాసులు నినదిస్తున్నారు.

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


విచారణ