బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ


బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

బూటకపు

తెలంగాణ లో చెన్నాపురం, కడంబ, పూసుగుప్ప, దేవార్లగూడెంలో ఈ మధ్య జరిగిన ఎన్ కౌంటర్లన్నీ బూటకమని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అందుకు నిరసనగా ఈ నెల 28వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠం....

పత్రికా ప్రకటన
తేది: 25/9/2020

చెన్నాపురం, కడంబ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించండి!
వరుసగా ఈ నెల సెప్టెంబర్ 3,7,19,23 తేదీలలో జరిగిన ఘటనలన్ని టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు చేసిన బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలే. ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించండి హత్యలకు పాల్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నాయకులను, పోలీసులను శిక్షించండి. హైకోర్టు వెంటనే ఈ బూటకపు ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి. ఈ 4 బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా సెప్టెంబర్ 28వ తారీకున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ ను పాటించండి!

ప్రియమైన ప్రజలారా! ప్రజాస్వామిక వాదులారా!
చెన్నాపురం, కడంబ, పూసుగుప్ప, దేవార్లగూడెంలో, జరిగినవన్ని బూటకపు ఎన్‌కౌంటర్లే. ఈ బూటకపు ఎన్ కౌంటర్లలో 8 మంది కామ్రేడ్స్ కామ్రేడ్ శంకర్ (ఎసీఎం) కామ్రేడ్ శ్రీను (ఎసీఎం),
కామ్రేడ్ ఐతు గ్రామస్తుడు కామ్రేడ్ చుక్కాలు దళ సభ్యుడు, కామ్రేడ్ బాజీరావు దళ సభ్యుడు, కామ్రేడ్ జోగయ్య (ఎసీఎం),
కామ్రేడ్ రాజే, కామ్రేడ్ లలితలు (దళ సభ్యురాలు) వీళ్ళంత ఆదివాసీ, పీడిత ప్రజల ముద్దు బిడ్డలు. వీళ్ళందరిని పట్టుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు వాళ్ళ చట్ట ప్రకారం జైళ్ళో పెట్టకుండా బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేశారు.

మావోయిస్టు పార్టీ ఎజెండానే మా ఎజెండా అంటూ ఎన్ కౌంటర్లు లేని తెలంగాణనే నా, మా ద్యేయమంటూ నమ్మబలికిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలోకి రాగానే సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు సేవలు చేస్తూ నీళ్ళు, నిధులు, ఉ ద్యోగాలు పక్కన పెట్టి జల్, జంగల్,జమీన్, సహజ వనరులను దోసుకుంటూ తెలంగాణలో 90 శాతంగా వున్న పీడిత ప్రజలు దళితులు, ఆదివాసులు, వెనుక బడిన కులాల వారు, మహిళలు, మైనార్టీలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువజనులు, ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయాన్ని కల్గిస్తున్నారు.

గతంలో మా పార్టీ నాయకత్వాన పీడిత ప్రజలు భూస్వాముల వద్ద నుండి భూములను తీసుకొని సాగుచేసుకుంటున్నారు. అట్టి భూములను సాధాబైనామా పేరుతో భూస్వాములకు కట్టబెడుతున్నారు. దీనితో హక్కుల కోసం అడిగిన ప్రతి ఒక్కర్ని, ప్రజాస్వామిక వాదులను, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి చివరికి ప్రతిపక్ష బూర్జువా పార్టీల నాయకులను కూడా మావోయిస్టుల పేరుతో అరెస్టులు చేస్తూ ఉపా చట్టాన్ని మోపి జైళ్ళలో బంధిస్తున్నారు.

ఎజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలు ఉమ్మడి ఆదిలాబాద్ వరకు డిజీపీ మహేందర్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా పర్యటిస్తూ జిల్లాల ఎపిలు, ఓఎస్డిలతో మీటింగ్స్ నిర్వహిస్తూ గ్రేహౌండ్స్, పారామిలటరీ బలగాలతో పెద్ద ఎత్తున కూంబింగ్స్ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీ విధానాలకు ప్రజలు సమాయత్తమవుతుండడంతో మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు అధికారులకు విస్తృతమైన అధికారాలను కట్టబెట్టి ఆట, పాట మాటలను బందు పెట్టిస్తూ ఎన్ కౌంటర్ల పేరుతో బూటకపు హత్యలు కొనసాగించాలని నిర్ణయించి సెప్టెబర్ 3వ తారీకున కామ్రేడ్ శంకర్ ఎసీఎం అనారోగ్యంతో హాస్పటల్ కు పోయినప్పుడు పట్టుకొని దేవార్లగూడెంలో హత్య చేశారు.

తిరిగి నాలుగు రోజులు గడవక ముందే పూసుగుప్ప వద్ద నిరాయుధులైన కామ్రేడ్ శ్రీను కమాండర్, కామ్రేడ్ ఐతు గ్రామస్తుడు వీళ్ళను పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. తిరిగి సెప్టెంబర్ 19వ తారీకున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కామ్రేడ్ సుక్కాలు, కామ్రేడ్ బాజీరావు దళ సభ్యులు సివిల్ దుస్తుల్లో ప్రజలను కలవడానికి గ్రామానికి పోయినప్పుడు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందుకొన్న పోలీసులు వాళ్ళను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి కడంబ అడవుల్లో మరో బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారు.

ఇప్పుడు తిరిగి చెన్నాపురం అడవుల్లో కూడా పై విధంగానే ప్రజలను కలవడానికి సివిల్ దుస్తుల్లో మణుగూర్ దళ సభ్యులైన కామ్రేడ్ రాజే చెన్నాపురం గ్రామం చర్ల మండలం,కామ్రేడ్ లలిత బవనగిరి గ్రామం, బూర్గంపాడు మండలం, కామ్రేడ్ సోడి జోగయ్య గ్రామం కీటారంపాడు, మండలం చర్ల. వీళ్ళు గ్రామానికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని వస్తుండగా ఇన్పర్మర్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పట్టుకొని చిత్రహింసలకు గురిచేసిన‌ పోలీసులు ఆలీవ్ గ్రీన్ బ‌ట్టలను తొడిగించి చెన్నాపురం అడవుల్లో బూటకపు ఎన్‌కౌంటర్ లో హత్య చేసి ఎప్పటి లాగే ఎన్ కౌంటర్ కట్టు కథ అల్లినారు.

చెన్నాపురం గ్రామానికి రెండు వైపుల అడవుల్లో వట్టిగానే రెండు దపాలుగా పైరింగ్ చేశారు. ఈ ముగ్గురు కామ్రేడు వేరే ప్రాంతం నుంచి పట్టుకొని వచ్చి ఇక్కడ హత్య చేయడానికి కారణం సెప్టెంబర్ 16 తారీకున రెండు గ్రేహౌండ్స్ బలగాలు గందరగోళానికి గురై పైరింగ్ చేసుకున్నారు. ఈ పైరింగ్ లో ఆధిత్య అనే గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఎ చనిపోయాడు. దీని కప్పి పుచ్చుతూ తన తుపాకి మిస్ ఫైర్ అయి చనిపోయాడని కట్టు కథ అల్లి ఎస్పీ సునిల్ దత్ పోలీసు అధికారులు ప్రచారం చేశారు. మొన్న కడంబ అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ ను పోలీసులే బాస్కర్ పేరుతో ఖండిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చి నాటకమాడినారు. ఇలా టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తూ బూటకపు ఎన్ కౌంటర్లు, హత్యలు చేస్తున్నారు. ఏ ప్రతిపక్ష పార్టీ కాని హక్కుల సంఘాలు కాని ఖండించక పోవడం శోచనీయం.
ఇలా టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం యొక్క నియంతృత్వ, నిరంకుశ ఫాసిస్టు పాలన కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ బూటకపు ఎన్‌కౌంర్లు, హత్యలను, హక్కుల సంఘాలు నిజ నిర్థారణ కొనసాగించి బాధ్యులైన వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాలి. దోపిడీ లేని తెలంగాణ కోసం పోరాడుతున్న బిడ్డలను పట్టుకొని కాల్చి చంపడాన్ని తెలంగాణ సమాజం (ప్రజలు) తీవ్రంగా ఖండించండి. కంటికి రెప్పల కాపాడుకోండి!

ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీ వైపు నుండి పోలీసులపై గాని, అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైగాని ఎలాంటి భౌతిక దాడులకు పాల్పడనప్పటికీ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు బూటకపు ఎన్ కౌంట‌ర్లకు పాల్పడుతున్నారు. అందుకని ప్రజలారా ఎన్ కౌంటర్లు బూటకపు ఎన్ కౌంటర్లు లేని, దోపిడీ లేని తెలంగాణ కోసం పోరాడండి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి! చెన్నాపురం, కడంబ, పూసుగుప్ప, దేవార్లగూడెం బూటకపు ఎన్ కౌంటర్లను ఖండిస్తూ నిరసనగా ఈ నెల సెప్టెంబర్ 28వ తారీకున తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు బంద్ ను పాటించాలని కోరుతున్నాము.
విప్లభినందనాలతో
జగన్
అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర కమిటీ
సీపీఐ (మావోయిస్టు)

Keywords : cpi maoist, telangana, jagan, fake encounters, bandh
(2021-09-20 20:21:06)No. of visitors : 1149

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
Celebrate grandly the 17th Anniversary of CPI (Maoist) in revolutionary atmosphere!
ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
UP:యూపీలో సెప్టంబర్ 5న రైతు మహా పంచాయత్ - 5 లక్షల మందిపాల్గొంటారని అంచనా... ఆందోళనలో బీజేపీ
more..


బూటకపు