కేరళ: మావోయిస్టు జలీల్ ది హత్యే అని రుజువు చేస్తున్న ఫోరెన్సిక్ రిపోర్టు


కేరళ: మావోయిస్టు జలీల్ ది హత్యే అని రుజువు చేస్తున్న ఫోరెన్సిక్ రిపోర్టు

కేరళ:

కేరళలోని వయనాడ్, లక్కీడిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో సిపిఐ (మావోయిస్ట్) సభ్యుడు సిపి జలీల్ మరణించి సంవత్సరానికి పైగా గడిచిపోయాక వైనాడ్ జిల్లా సెషన్స్ కోర్టులో సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టు, జలీల్ ʹబూటకపు ఎన్కౌంటర్లో చంపబడ్డాడుʹ అనే హక్కుల కార్యకర్తలు, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

2019 మార్చి 6, బుధవారం రాత్రి 9:45 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని, తెల్లవారుజామున 4:30 గంటలకు జలీల్ మరణం నిర్ధారించబడిందని పోలీసులు తమకు తెలిపారని జలీల్ బందువులు చెప్పారు.

పోలీసు కాల్పులకు, జలీల్ మరణానికి మధ్య ఉన్న సమాయాంతరాన్ని ప్రశ్నించిన జలీల్ బంధువు, రక్తస్రావంతో చనిపోయే వరకు పోలీసులు ఎదురుచూసారా, వారు ఎత్తుకెళ్ళి, తరవాత చంపేసారా అని ప్రశ్నించారు.

"మీడియా నివేదికల ప్రకారం, కాల్పుల్లో మరొక వ్యక్తి వేలుమురుగన్ కూడా గాయపడ్డాడు. కానీ అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏ ఆసుపత్రులలో చేర్చలేదు. ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉంటే, చనిపోయే వరకు వేచి ఉండకుండావెంటనే చికిత్స చేయించాలిʹఅని ఒక బంధువు కోరారు.

థండర్ బోల్ట్ కమాండోలపై మొదట జలీల్ కాల్పులు జరిపాడని, ఆ తరువాత తాము కాల్పులు జరపడం వలన అతను చనిపోయాడనే పోలీసుల వాదనను ఫోరెన్సిక్ నివేదిక తిరస్కరించిది.

2019 మార్చి 6 న 26 ఏళ్ల జలీల్‌ మరో ʹ మావోయిస్టుʹ తో కల్సి డబ్బు యివ్వాలని డిమాండ్ చేస్తూ లక్కీడిలోని ఉపవన్ రిసార్ట్ కు వచ్చినప్పుడు జలీల్‌ను పోలీసులు కాల్చి చంపారు. తల వెనుక భాగాన , భుజంపైన తూటాలు తగిలి జలీల్ అక్కడికక్కడే మరణించగా, యింకొకతను తప్పించుకున్నాడు.

ఉపవన్ రిసార్ట్ దగ్గరకు మావోయిస్టులు వచ్చారని సమాచారం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు అనేది వారి కథనం.

సంఘటనా స్థలంలో 16 సీసీటీవీ కెమెరాలు వున్నాయి కానీ పోలీసులు మావోయిస్టులు ఆయుధాలు ధరించి వున్నారని తెలియచేయడానికి కేవలం మూడు సీసీటీవీ కెమెరాల నుంచి మాత్రమే దృశ్యాలను విడుదల చేశారు.

కానీ జలీల్ శరీరం దగ్గర దొరికిందని చెబుతున్న రైఫిల్ నుండి ఎటువంటి కాల్పులు జరగలేదని, తుపాకీ బారెల్ ను పరీక్షించినప్పుడు కాల్పులు జరిగినప్పుడు ʹదేశవాళీ ఎస్బిబిఎల్ తుపాకీʹ బారెల్ లో వుండే అవశేషాలు కనపడలేదని 2020 ఫిబ్రవరి 8 నాటి ఫోరెన్సిక్ రిపోర్టు పేర్కొంది.

విశేషమేమిటంటే, ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం జలీల్ కుడి చేతి పైన సేకరించిన నమూనాలలో సీసం లేదా మందుగుండు పొడి అవశేషాలు కనబడలేదు అంటే కుడిచేతిని వుపయోగించే జలీల్ కాల్పులు జరపలేదు అని రుజువైంది. అయితే అతని ఎడమ చేతినుంచి సేకరించిన నమూనాలలో "మెటల్ సీసం" అవశేషాలు కనబడ్డాయని చెబుతున్ననివేదిక అందుకు ఎలాంటి వివరణా యివ్వలేదు.

ఇప్పటివరకు పోలీసులు అబద్ధాలు చెబుతున్నారనీ, ఈ ఫోరెన్సిక్ నివేదికతో స్పష్టమవుతోంది. జలీల్ పోలీసులపై కాల్పులు జరపలేదని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని అని జలీల్ అన్నయ్య సిపి రషీద్ అన్నారు.

జలీల్ పై కాల్పులు జరుపుతున్నప్పుడు చిత్రీకరించిన సిసిటివి దృశ్యాలపై అధికారులు దర్యాప్తు చేయలేదని, వీడియోలో జలీల్ పరిగెత్తుతుంటే వెనుక వైపు నుండి కాల్పులు జరిగినట్లుగా వుంది, ఫోరెన్సిక్ నివేదిక వెలుగులో ఈ కేసుపై తిరిగి దర్యాప్తు జరగాలని రషీద్ అన్నారు.

గత సంవత్సరం హత్య జరిగిన వెంటనే జలీల్ కుటుంబ సభ్యులు, అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు బూటకపు ఎన్‌కౌంటర్‌లో అతని తలపై, మోకాలికి దిగువన కాల్చి చంపారని చెప్పారు.

సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఖాళీ బుల్లెట్లను పరీక్షించిన నిపుణులు అవన్నీ పోలీసులు ఉపయోగించే సర్వీస్ రైఫిల్ నుంచి కాల్చినవిగా గుర్తించారు. జలీల్ తో పాటు వున్న వ్యక్తి కాల్చాడని పోలీసులు చెప్పడం కూడా అబధ్ద్ధమే అని తేలిపోయింది. పోలీసులు వుపయోగించే ఆయుధాలతో తప్ప యితర ఎలాంటి ఆయుధాలతోటీ కాల్పులు జరిగాయని రుజువులు లేవు.

జలీల్ సోదరులు ఇద్దరు, సిపి జిషాద్, సిపి రషీద్, ఈ ఘటన బూటకపు ఎన్కౌంటర్ అని, పోలీసులు తమ సోదరుడిని పట్టుకుని చంపారని ఆరోపించారు.

Keywords : kerala, maoist, jaleel, fake encounter, police, Forensic report
(2020-10-28 03:30:42)No. of visitors : 261

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Search Engine

సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
more..


కేరళ: