గ్రామాల్లో మళ్ళీ దొరల రాజ్యం...టీఆరెస్ పాలనపై మావోయిస్టుల మండిపాటు


గ్రామాల్లో మళ్ళీ దొరల రాజ్యం...టీఆరెస్ పాలనపై మావోయిస్టుల మండిపాటు

గ్రామాల్లో

తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనపై సీపీఐ మావోయిస్టు పార్టీ మండి పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పౌరహక్కుల కోసం, బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఒక ఐక్యవేదికగా ఏర్పడి పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పౌరహక్కుల కోసం, బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఒక ఐక్యవేదికగా ఏర్పడి పోరాడాలని పిలుపునిస్తున్నాం.

మావోయిస్టు పార్టీ ఎజెండానే టీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా ఉద్యమాన్ని చేపట్టడంతో ఒక ఉద్యమ పార్టీగా భావించిన తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంట్ మెంట్ తో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ (కేసీఆర్) అధికారంలోకి వచ్చారు. ఇలాంటి ఉద్యమ పార్టీ అప్రజాస్వామిక, అవినీతి, నియంతృత్వ విధానాలతో పాలన కొనసాగిస్తున్నది. సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాలకు సేవ చేస్తూ నీళ్ళు, భూమి, ఖనిజ సంపదను దోచిపెడుతూ తాము దోచుకొంటున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ తో అధికారాన్ని కొనసాగిస్తున్నారు. పచ్చి హిందూ మతోన్మాద భావజాలంతో గుడులు, గోపురాలు నిర్మిస్తూ ప్రజలను అంధవిశ్వాసాలకు గురి చేస్తున్నారు. కొన్ని జనాకర్షణ పథకాలతో ప్రజలను కేసీఆర్ (టీఆర్ఎస్) పార్టీ, మోసం చేస్తున్నది. పెట్టుబడిదారుడు రామేశ్వర్ రావు, చిన్న జీయర్ స్వామి వాస్తు సలహాలతో పాలన కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోట్ల రూపాయాలు దోచుకొంటున్నారు.

సామ్రాజ్యవాదుల ప్రపంచ బ్యాంకు ఎజెండాను దూకుడుగా అమలు చేస్తున్నారు. టీఎస్- ఐపాస్ ద్వారా సామ్రాజ్యవాదులకు, దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకు లక్షల ఎకరాల భూములు నీళ్ళు, విద్యుత్ వగైరా ఉచితంగా ఇస్తున్నారు. భూసర్వే పేరుతో, సాధాబైనామ పేరుతో దళితులు, అదివాసులు, పీడిత ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకున్న భూములను బలవంతంగా లాక్కొని భూస్వాములకు కట్టబెడుతున్నారు. తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో దొరల పాలనను నెలకొల్పుతున్నారు. భూమాఫియా, ఇసుక మాఫియాలను పెంచి పోషిస్తున్నారు. దళితులు, వెనుకబడిన కులాలపై అగ్రవర్ణ, అగ్రకుల దాడులు, పరువు హత్యలు కొనసాగిస్తున్నారు. ఉన్న యూనివర్సిటీలను మూసివేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేలాది ప్రభుత్వ పాఠశాలను మూసి వేశారు. హరితహారం పేరుతో అదివాసుల, పీడిత ప్రజల భూములను ఆక్రమించుకొంటున్నారు. అదివాసులను మావోయిస్టుల పేరుతో అక్రమంగా అరెస్టులు చేస్తూ జైళ్ళల్లో బంధిస్తున్నారు. దళిత, ముస్లింల పై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి.

తెలంగాణ రాకముందు మావోయిస్టు పార్టీ ఎజెండానే మా ఎజెండా అనీ, ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ తెస్తామని, దళితుడే ముఖ్యమంత్రి అని నమ్మబలికిన కేసీఆర్ అధికారంలోకి రాగానే భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలు ఉమ్మడి ఆదిలాబాద్ వరకు గ్రేహౌండ్స్, పారామిలటరీ బలగాలతో ముమ్మరంగా కూంబింగ్స్ కొనసాగిస్తూ ఆదివాసులపై మా దళాలపై దాడులు చేశారు, చేస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారు. కా|| శృతి, కా|| సాగర్, కా|| వివేక్ లాంటి విద్యావంతులైన తెలంగాణ బిడ్డలను బూటకపు ఎన్ కౌంటర్లలో హత్య చేశారు. బొట్టెం, లంకపల్లి, కాటెపల్లి, కల్లెడ, పూజారి కాంకేర్, రోళ్ళగడ్డ, బుడుగుతోగులలో మా దళాలపై దొంగ ఎదురు కాల్పులకు పాల్పడి 39 మంది కామ్రేడ్స్ ను, ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా వున్న నల్గురు ముస్లిం యువకులను కోర్టుకు తీసుకెళ్ళే పేరిట బస్సులోనే కాల్చి చంపారు.

2020లో తిరిగి మా దళాలపై మూడుసార్లు దాడులకు పాల్పడ్డారు. ఎన్నో దాడులు తృటిలో తప్పాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వాన ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమవుతుండడంతో సెప్టెంబర్ నెలలో (8,7,19,23) టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు 8వ తారీకున అనారోగ్యంతో హాస్పటలకు పోయిన కా|| శంకర్ (ఎసీఎం)ను పట్టుకొని దేవార్లగూడెం వద్ద బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారు. 7వ తారీకున సివిల్ దుస్తుల్లో సామాన్ల కోసం పోయిన కా॥ శ్రీనును (ఎసీఎం), గ్రామస్తుడు కా॥ ఐతులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి పూసుగుప్ప-వద్ధిపేట గ్రామాల మధ్యన బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. 19వ తారీకున అదిలాబాద్ జిల్లాలో సివిల్ దుస్తుల్లో గ్రామానికి పోయినప్పుడు దళ సభ్యులు కా|| చుక్కాలు, కా|| బాజీరావులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి కడంబ అడవుల్లో బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారు. 23వ తారీకున సివిల్ దుస్తుల్లో గ్రామానికి పోయి ప్రజలను కలిసి వస్తున్నప్పుడు కా|| జోగాలు (ఎసీఎం), కా|| రాజే, కా|| లలిత దళ సభ్యులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి చెన్నాపురం గ్రామ సమీప అడవుల్లో కాల్చి చంపి ఎప్పటిలాగే ఎన్ కౌంటర్ కట్టుకథ అల్లారు.

ఒక నెలలోనే 8 మంది ఆదివాసి యువతీ,యువకులను బూటకపు ఎన్ కౌంటర్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులు హత్య చేశారు. వాళ్ళ చట్టం ప్రకారం అరెస్టు చేసినవాళ్ళను జైళ్ళో పెట్టాలి కానీ చట్టాన్ని ఉల్లంగించి బూటకపు ఎన్‌కౌంటర్లో హత్య చేశారు. అడవిలో అదివాసీల బ్రతుకులు టీఆర్ఎస్ పాలనలో జంతువుల కన్నా హీనమైపోయాయి. డిజీపీ మహేందర్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం మొదలు ఉమ్మడి ఆదిలాబాద్ వరకు హెలీకాప్టర్ ద్వారా పర్యటిస్తూ ఏస్పీలు, ఓఎస్డీలు, ఎఎస్పీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ దాడులను ముమ్మరం చేస్తున్నారు. మావోయిస్టుల తలలకు వెలలు కట్టి, పట్టించిన వారికి పారితోషికాలు అంటూ ఫోటోలతో కూడిన పోస్టర్లు వేస్తున్నారు.

ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక దళం కోసం 18 వేల మంది గ్రేహౌండ్స్, పారామిలటరీ బలగాలతో చుట్టుముట్టి గ్రామాలు, అడవులు జల్లెడపడుతున్నారు. దారులు, గుట్టల మధ్య వాగులు, ఊర్ల వద్ద అంబుష్ లు పెడుతున్నారు. మంగి, ఇంద్రవెల్లి, సిర్పూర్, చెన్నూర్, బోద్, సింగాపూర్, పిప్పలదరి, వాంకిడి, అదిలాబాద్, తలమడుగు, తాంసి ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం తెలుసుకుంటూ కూంబింగ్ కొనసాగిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. పై విధంగానే భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను వేలాది మంది గ్రేహౌండ్స్ , పారామిలటరీ,కోబ్రా బలగాలతో చుట్టుముట్టి అనువణువున గాలిస్తూ గోదావరి, ప్రాణహిత నదుల కొర్రి పాయింట్స్ వద్ద అంబుష్ లు పెడుతున్నారు. డ్రోన్స్ ద్వారా నిరంతరం నిఘాను కొనసాగిస్తూ యుద్ధ వాతావరణాన్ని కల్గిస్తున్నారు. ఆదివాసులను హత్యలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం-పోలీసులే అదివాసి సంఘాల పేరుతో మావోయిస్టులు ఆదివాసులను హత్య చేస్తున్నారని మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు. అర్బన్ మావోయిస్టుల పేరుతో రాష్ట్రంలో ప్రజాకవి వరవరారావు మొదలు అనేక మంది ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి జైళ్ళలో బంధించారు. చివరికి ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను కూడా అరెస్టులు చేసి జైళ్ళల్లో బంధిస్తున్నారు. ఆట, పాట, మాట, ధర్నా, ర్యాలీలను నిషేదించారు. ఇలా తెలంగాణలో పౌరహక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు ప్రతిపక్ష పార్టీలు, యంఎల్ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యక్తులు, సంస్థలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతున్నాము. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిస్తున్నాం.

విప్లవాభినందనలతో

తెలంగాణ రాష్ట్ర కమిటీ
సీపీఐ (మావోయిస్టు)

Keywords : cpi maoist, telangana, trs, kcr, fake encounters, police
(2020-10-27 01:37:37)No. of visitors : 1932

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
more..


గ్రామాల్లో