కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం


కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం

కశ్మీర్

లాక్డౌన్ సమయంలో తన సోదరి ఇంట్లో వుంటున్న కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ అక్టోబర్ 5, ఆదివారంనాడు తన ఇంటికి వెళ్లినప్పుడు ఇల్లంతా భీభత్సంగా వుండటమే కాకుండా, పడకగదిలో మంచం మీద డాక్టర్ ఇమ్రాన్ గనై అనే వ్యక్తి పడుకొన్నాడు. అతనితో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

ʹమాజీ ఎంఎల్‌సి, షెహ్నాజ్ గనాయ్ సోదరుడు డాక్టర్ ఇమ్రాన్ గనాయ్ నేతృత్వంలోని కొంతమంది గూండాలు, (జమ్ము లోని ) వజారత్ రోడ్‌లో (2000 నుండి) నాకు ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్‌లోకి ప్రవేశించి, దొంగతనానికి పాల్పడ్డారు. ఎస్టేట్స్ డిపార్ట్ మెంట్, కొంతమంది పోలీసు సిబ్బందితో మిలాఖతై నా ఆభరణాలు, వెండి సామాగ్రి, ఇతర విలువైన వస్తువులను దొంగిలించారు. సివిల్ దుస్త్తుల్లో వున్న కొంతమంది పోలీసులు వారికి సహాయం చేస్తున్నారు, వారు అన్నిగదులనూ ఆక్రమించారు. నేను ఫోటోలు తీస్తుంటే తమ ముఖాలను దాచుకోడానికి ప్రయత్నించారు.

మేము పిలిస్తే ఆ ప్రాంతానికి వచ్చిన పిర్ మిథా పోలీస్ స్టేషన్ SHOను చూసి పారిపోయారు. కానీ ఆ SHO మా ఫిర్యాదు తీసుకోకుండా, ఆ ఇల్లు వారికి కేటాయించబడిందని అబద్ధం చెప్తూ, వారికి వత్తాసు పలికాడు. ఇంట్లో సామాన్లలన్నింటినీ ఒక గదిలో పడేశారు. పగిలిపోయే వస్తువులను కూడా చెల్లా చెదురుగా విసిరేశారు.

మమ్మల్ని అటూ,ఇటూ నెట్టేస్తే ఆత్మరక్షణ కోసం పోరాడాల్సి వచ్చింది. ఇంట్లోకి రావడానికి నిరాకరించిన SHO ఫోటోలు, పుస్తకాలతో సహా వారు నా వస్తువులను ఎలా దోచుకుంటున్నారో చూస్తూ నిలుచున్నాడు. చాలా సమయం గడిచాక మా న్యాయవాది వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్లో ఒక అధికారిక ఫిర్యాదు నమోదు చేయడానికి అంగీకరించి, పరిస్తితి చూడటానికి ఇంటికి వెళ్ళాడు. నా మంచం మీద పడుకుని వున్న డాక్టర్ ఇమ్రాన్ గనైని లేపడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు ఏ మాత్రం సహాయం చేయలేదు. ఒక గదిలో నలుగురు అమ్మాయిలను బంధించారు. వారిని బయటికి తీయడానికి మేము తలుపు విరగ్గొట్టాల్సి వచ్చింది. ఆ అమ్మాయిలు ఏడుస్తూ బయటికి పారిపోయారు.

ఇటీవలి సంవత్సరాలలో, షెహ్నాజ్ గనాయ్, ఆమె కుటుంబ సభ్యులకు ఆ ప్రాంతంలో ఐదు కంటే ఎక్కువ ఫ్లాట్లు ఏ ప్రాతిపదికన కేటాయించబడ్డాయి? మునుపటి కేసులు కూడా ఇలాంటి అక్రమ అతిక్రమణ, దొంగతనాలకు పాల్పడ్డవేనా? షో కాజ్ నోటీసు ఇవ్వకుండా, మునుపటి యజమానులకు / కేటాయింపుదారులకు తమ వస్తువులను తీసుకెళ్ళడానికి కూడా సమయం యివ్వకుండా ఎస్టేట్స్ డిపార్ట్ మెంట్ వేరేవారికి అపార్ట్మెంట్ ను ఎలా కేటాయిస్తుంది? ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ దొంగతనాలను ప్రోత్సహిస్తోంది. పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు కావాలనే పట్టించుకోవడం లేదు.ʹ

ట్విట్టర్ లో నిన్నటి పోస్ట్ గురించి వివరణ:

- 1999-2000 నుండి నేను ఈ ప్రభుత్వ ఫ్లాట్ అధికారిక కేటాయింపుదారుని (ఇందులో గూండాలు బలవంతంగా ప్రవేశించి, దొంగిలించి, నా వస్తువులను దోచుకున్నారు, కొట్టారు, నెట్టారు, పోలీసులు వారిని ఇంటి నుంచి తొలగించడానికి నిరాకరించారు). నాకంటే ముందు, 1969 లో ఆ ఫ్లాట్ నా తండ్రికి కేటాయించబడింది. ఈ రెండు కేటాయింపులు కూడా జర్నలిస్ట్ కేటగిరీ కింద జరిగాయి.

ఈ తేదీ వరకు నాకు ఏ షోకాజు నోటీసు లేదా కేటాయింపు రద్దు నోటీసు ఇవ్వలేదు. ఒకవేళ వుండి వుంటే నాకు ఉద్దేశపూర్వకంగా పంపలేదు. గత వారం నేను కొన్నిసోర్స్ ల‌ ద్వారా విన్నప్పుడు మా కేటాయింపు రద్దు చేయబడుతుందని ఎస్టేట్స్ విభాగంలోవున్న వారి ద్వారా తెలిసినప్పుడు విషయమేమిటో తెలుసుకోవడానికి డైరెక్టర్ / డిప్యూటీ డైరెక్టర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ వారు స్పందించలేదు. నేను విషయం తెలియచేయమని వ్రాతపూర్వక లేఖ పంపాను అయితే ఆ లేఖను అంగీకరించలేమని చెప్పారు. ప్రస్తుత స్థితి గురించి, కేటాయింపు రద్దుకు కారణాలను తెలియచేయమని స్పీడ్-పోస్ట్ లో లీగల్ నోటీసు పంపాను. కానీ యింతవరకు స్పందన లేదు -.

ట్విట్టర్ పోస్టులో:

ఆదివారం నాడు కొన్ని డజన్లమంది గూండాలు, తమ వ్యక్తిగత SPO లతో సహా, నా ఇంట్లోకి ప్రవేశించారు. వీరికి ఇమ్రాన్ గనై (తనను తాను డాక్టర్ అని పిలుచుకుంటాడు) నేతృత్వం వహించారు, మా ఇంటి ఎదురుగా ఉన్న మాజీ ఎంఎల్సి షెహ్నాజ్ గనాయ్ కి(మా కాలనీలో యిల్లు కేటాయించిన వారిలో ఒకరు) సోదరుడు.

మునుపటి పోస్ట్‌ లో వేధింపుల అనుభవం గురించి వ్రాశాను, ఇంకా ఆ గాయం పచ్చిగానే వుంది. నా వస్తువులు ఎలా దోచుకోబడ్డాయి, నా విలువైన వస్తువులు కనబడకుండా పోయాయి. ఎస్‌హెచ్‌ఓ స్వయంగా చూసినప్పటికీ అతిక్రమణ, దొంగతనాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయనేలేదు.

సుమారు మూడు వారాల క్రితం, శ్రీనగర్ ప్రెస్ ఎన్క్లేవ్ లో కాశ్మీర్ టైమ్స్ కార్యాలయం ఉన్న ప్రభుత్వ వసతికి సంబంధించి ఇలాంటి పుకార్ల గురించి మేము విన్నాము, ఇక్కడ అనేక ఇతర వార్తాపత్రిక కార్యాలయాలు, పాత్రికేయులకు కూడా వసతి కేటాయించబడింది. మా సిబ్బంది ఎస్టేట్స్ డిపార్టుమెంటుకు వెళ్ళినప్పటికీ, అధికారిక రద్దు నోటీసు కూడా యివ్వలేదు.

ప్రభుత్వ వసతి అధికారిక కేటాయింపుదారులకు సమాచారం ఇవ్వకుండా, గూండాలను నియమించి వారి వస్తువులను దొంగిలించడం, ఇంటి నుంచి వెళ్ళగొట్టడం ప్రభుత్వ కొత్త విధానమా? లేదా, ప్రభుత్వం చేస్తున్న లేదా చేయని పనులకు సంబంధం లేకుండా గూండాలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా?

ప్రభుత్వం లేదా గూండాల ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరిస్తున్నారా? లేక ఈ మూడింటికి నెక్సస్ ఉందా? నేను, నా సంస్థ బాధితుల కొత్త రూపాన్ని ఎదుర్కొంటున్నామా?

అనురాధ భసిన్ పరిచయం:

జమ్మూ కాశ్మీర్లో ఇంగ్లీష్ జర్నలిజపు ʹగ్రాండ్ ఓల్డ్ మ్యాన్ʹ గా ప్రశంసలు పొందిన, ప్రముఖ పాత్రికేయులలో ఒకరైన అనురాధ తండ్రి వేద్ భాసిన్ కు ఈ అపార్ట్మెంట్ ను మొదట కేటాయించారు. అనురాధకు ఒక సంవత్సరం వయసులో ఆ ఇంట్లో చేరిన ఆయన 1999 లో తన సొంత ఇంటిని కట్టుకున్న తరువాత ఆ యిల్లు ఖాళీ చేశారు. అయితే అప్పటికే అనురాధ ఒక ప్రతిష్టిత జర్నలిస్ట్ కావడంతో ఆ ఇంటినే ఆమెకు కేటాయించారు.

ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ లో జర్నలిస్టుల పట్ల ప్రభుత్వపు వైఖరిలో భాగంగా ఆమె కూడా తన రచనలు, కార్యకలాపాల వల్ల ప్రభుత్వ నిఘాలో వుంది. ఇప్పుడు ఇంటిపై జరిగిన దాడి కూడా జర్నలిస్టుల వేధింపులలో భాగంగానే జరిగి వుండవచ్చు.

ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ ను పూర్తిగా బ్లాక్అవుట్ చేయడానికి దారితీసిన, 2019 లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 మరియు 35 Aలను రద్దు చేసినప్పుడు అనురాధ భాసిన్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు.

జమ్ము కాశ్మీర్‌లోని జర్నలిస్టులకు కొన్నిసార్లు ప్రెస్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో చిన్న అపార్ట్‌మెంట్లు కేటాయిస్తారు. ఒక దగ్గర కలిసి వుండచ్చని జర్నలిస్టులు చాలా వరకు వాటిని తమ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటారు.

అయితే అధికారికంగా కేటాయించిన ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి.

1990ల ప్రారంభంలో ప్రెస్ ఎన్క్లేవ్ ప్రాంతంలో కేటాయించిన ఫ్లాట్ ఇప్పుడు వివాదాస్పద ఆస్తిగా వుంది. ఖర్చులు తిరిగి చెల్లిస్తామని ఎస్టేట్స్ విభాగం చెప్పడంతో కాశ్మీర్ టైమ్స్ తన సొంత డబ్బును ఖర్చుపెట్టి అత్యవసర మరమ్మతులు చేయించింది కానీ వారు చెల్లించనే లేదు. పునర్నిర్మాణం చేయడం కోసం ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని 2009 లో, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఆదేశించింది, కాని అప్పటికే భాసిన్ మరమ్మతులు చేపట్టడం వల్ల కోర్టులో సవాలుచేసారు.

(sabrangindia.in సౌజన్యంతో)

Keywords : kashmir, jammu, kashmir times, editor, anuradha Bhasin, Journalist
(2021-05-06 04:51:27)No. of visitors : 292

Suggested Posts


కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం

తంలో ఇలాంటి ర్యాలీ నిర్వహించినందుకు జమ్ము కాశ్మీర్ కు చెందిన బీజేపీ మంత్రి లాల్ సింగ్ ను మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం గత నెలలో మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజేందర్ సింగ్ అద్వర్యంలో మళ్ళీ ర్యాలీ నిర్వహించారు.

మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ‌

ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను పోస్ట్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా

యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ లోని డౌన్ సిటీలో పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిష్టులు అన్నా- ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా

Search Engine

మహానుభావా, దయచేసి దయచేయండి...ప్రధానికి అరుంధతీ రాయ్ విజ్ఞప్తి
మన ఈ పరిస్థితికి ఎవరిని నిందిద్దాం ?
షట్ అప్.. గెట్ అవుట్.. జర్నలిస్టులపై నోరు పారేసుకున్న బండి సంజయ్
సుధా భరద్వాజ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?
జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి - యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు
నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం... చీకట్లను చీల్చుకొని మళ్ళీ జనం మధ్యకు వస్తాం - విరసం
కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ - ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్
Professor Hargopal wrote a letter to KCR - demanding the lifting of the ban on 16 mass organizations
COVID19 : ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి - మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు
ఆస్పత్రిలో నా భర్తను చిత్ర హింసలు పెడుతున్నారు... ఆయనను జైలుకు తరలించండి: సీజేఐకి జర్నలిస్టు కప్పన్ భార్య విన్నపం
ఆక్సీజన్ కొరత పై రూమర్స్ ప్రచారం చేస్తే ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం
16 సంఘాల మీద నిషేధంపై ప్రజా సంఘాల ప్రెస్ మీట్ వీడియో
ʹతెలంగాణలో ప్రజా సంఘాలపై నిషేధం ఎమర్జన్సీని గుర్తుకు తెస్తున్నదిʹ
ʹప్రజా సంఘాలపై నిషేధం కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టʹ
ʹమావోయిస్టు ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజా సంఘాలపై నిషేధం విధించడం దుర్మార్గంʹ
తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థి సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలి - AISF
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాల పై పెట్టిన నిషేధాన్ని ఎత్తి వేయాలి :ఎస్.ఎఫ్..ఐ
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం - న్యూ డెమాక్రసీ
పౌరహక్కుల సంఘానికి నాయకుణ్ణవుతా అన్నవాడే ఆ సంఘాన్ని నిషేధించడం అనైతికం
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం
ఆదివాసీ ప్రాంతాలపై బాంబు దాడుల నేపథ్యంలో శాంతి కమిటీకి సీనియర్ జర్నలిస్టు రాజీనామా
పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల
థూ.......
మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌
more..


కశ్మీర్