BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి


BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి

గత మూడు దశాబ్దాలలో, ఆదివాసీలు, తమ ఆత్మగౌరవం, గౌరవంగా జీవించే హక్కు కోసం చేస్తున్న పోరాటంలో నన్ను నేను కలుపుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాను. రచయితగా కూడా నేను వారి వివిధ సమస్యలను అంచనా వేయడానికి ప్రయత్నించాను. ఈ సమయంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక ఆదివాసీ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నా అసమ్మతిని ప్రజాస్వామిక పద్ధతుల్లో వ్యక్తం చేశాను. ప్రభుత్వం, పాలక వ్యవస్థల ఇటువంటి అనేక విధానాల నైతికత, హేతుబద్ధత, చట్టపరమైన ప్రామాణికతను నేను ప్రశ్నించాను.
1. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ అమలు చేయకపోవడాన్ని నేను ప్రశ్నించాను. ఆదివాసీలు మాత్రమే వుండే ʹగిరిజన సలహా మండలిʹ ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఆదివాసీల అభివృద్ధి, రక్షణ అంశాలకు సంబంధించి ఈ కమిటీ గవర్నర్‌కు సలహా ఇస్తుంది అని ఈ షెడ్యూల్ [ఆర్టికల్ 244 (ఎ), భారత రాజ్యాంగం] స్పష్టంగా పేర్కొంది.
2. పెసా చట్టాన్ని ఎందుకు పూర్తిగా విస్మరించారు? అని నేను అడిగాను. 1996 లో అమల్లోకి వచ్చిన పెసా చట్టం మొదటిసారిగా, దేశంలోని ఆదివాసీ సముదాయాలకు గ్రామసభల ద్వారా స్వయం పాలన చేసుకొనే సంపద్వంతమైన సామాజిక, సాంస్కృతిక చరిత్ర ఉందని గుర్తించింది.
3. సుప్రీంకోర్టు 1997 సమత నిర్ణయంపై ప్రభుత్వం మౌనం వహించడం పట్ల నేను నిరంతరం నా నిరాశను వ్యక్తం చేశాను. ఈ నిర్ణయం యొక్క ఉద్దేశ్యం [1997 లో సివిల్ అప్పీల్ నెం: 4601-2] ఆదివాసీలకు, తమ భూమిపై గనుల తవ్వకాన్ని నియంత్రించే హక్కును ఇవ్వడం, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం.
4. 2006 లో చేసిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం చూపిన ఉదాసీన వైఖరిపై నేను నిరంతరం నా దు:ఖాన్ని వ్యక్తం చేశాను. ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం శతాబ్దాలుగా ఆదివాసీలకు, అటవీ ఆధారిత సముదాయాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం.
5. - భూమి ఎవరిదో, ఖనిజాలు వారికే -అనే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదని నేను అడిగాను [ఎస్సీ: సివిల్ అప్పీల్ నంబర్ 4549, 2000] భూస్వంతదారుల వాటా గురించి ఆలోచించకుండా, బొగ్గు బ్లాకులను వేలం వేసి కంపెనీలకు యిస్తున్నారు.
6. భూసేకరణ చట్టం, 2013 కి జార్ఖండ్ ప్రభుత్వం 2017లోచేసిన సవరణ ఔచిత్వాన్ని నేను ప్రశ్నించాను. ఈ సవరణ ఆదివాసీ వర్గాలను విధ్వంసం చేసే ఆయుధం. ఈ సవరణ ద్వారా, ప్రభుత్వం ʹసామాజిక ప్రభావ అంచనాʹ యొక్క అత్యవసరాన్ని తొలగించింది. వ్యవసాయ, బహుళ-పంట భూముల వ్యవసాయేతర వినియోగానికి తలుపులు తెరిచింది.
7. ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయడాన్ని నేను తీవ్రంగా నిరసించాను. ల్యాండ్ బ్యాంక్ ఆదివాసీలను అంతం చేసే మరో ప్రయత్నం, ఎందుకంటే దీని ప్రకారం గ్రామానికి చెందిన మజ్రూయేతర (కమ్యూనిటీ ల్యాండ్) భూమి ప్రభుత్వానికి చెందుతుంది, గ్రామసభకు కాదు. ప్రభుత్వం తన యిష్టం వచ్చినట్లు ఈ భూమిని ఎవరికైనా (ప్రాథమికంగా కంపెనీలకు) ఇవ్వవచ్చు.
భూసేకరణ, విస్థాపనల అన్యాయాన్ని ప్రశ్నించే వేలాది మంది ఆదివాసీ-స్థానిక ప్రజలను ʹనక్సల్ʹ అని అరెస్టు చేయడాన్ని నేను వ్యతిరేకించాను.
నేను ఈ డిమాండ్ లతో జార్ఖండ్ రాష్ట్రంపై హై కోర్టులో పిల్ దాఖలు చేశాను 1) విచారణ ఖైదీలందరినీ వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని బెయిల్‌పై విడుదల చేయాలని, 2) ఈ అబద్ధపు అభియోగం నుండి చాలా మంది నిర్దోషులైన ఖైదీలు బయటపడడానికి కోర్టు వ్యాజ్య ప్రక్రియను వేగవంతం చేయాలి, 3) ఈ కేసులో కోర్టు విచారణ ప్రక్రియను ధీర్ఘకాలంగా పెండింగ్‌లో వుంచడానికి గల కారణాలను విచారించడానికి జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి, 4) పోలీసుల విచారణలో ఉన్న ఖైదీలకు సంబంధించిన వివరాలను యివ్వమని పిఐల్ వేసి రెండేళ్ళకు పైగా అయింది కాని ఇప్పటివరకు కోరిన పూర్తి సమాచారం ఇవ్వలేదు. పూర్తి సమాచారం ఇవ్వండి.
ప్రభుత్వ వ్యవస్థ నన్ను దారి నుండి తొలగించాలని కోరుకుంటుందని నేను నమ్ముతున్నాను. నన్ను తొలగించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, నన్ను అబద్ధపు కేసులలో, తీవ్రమైన ఆరోపణల్లో యిరికించడం, దాంతో పాటు అమాయక ఆదివాసీలకు న్యాయం జరిగే న్యాయ ప్రక్రియను కూడా ఆపడం.

(స్టాన్ స్వామి అరెస్టుకు ముందు తాను మాట్లాడిన వీడియోను పైన చూడండి)

Keywords : stan swamy, jharkhand, NIA, Bhimakoregaon, case, BK16, maoists,
(2021-02-25 06:52:11)No. of visitors : 504

Suggested Posts


0 results

Search Engine

మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగర‌న్ మంచ్ʹ మూక దాడి
Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital
జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య‌ డిమాండ్
ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR
రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన‌ పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ?
రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్
ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్
CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers
నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన‌ రైతు నాయకుడు
జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌
రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు
కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌
నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
more..


BK16:నేను