పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం


పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం

పౌరహక్కుల

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొ. శేషయ్య శనివారం రాత్రి 8 గంటలకు హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. భారతదేశంలోని వివిధ పౌరహక్కుల ఆలోచనా స్రవంతుల్లో ప్రొ. శేషయ్య విశిష్టమైన మేధావి. హక్కులను ʹమనిషిʹ కేంద్రంగా చూసే ఉదారవాద, బూర్జువా దృక్పథాలకు భిన్నంగా ప్రొ. శేషయ్య సామాజిక సంబంధాల్లో భాగంగా హక్కులను చూసేవారు. హక్కుల ఉల్లంఘనకు కారణాలు కూడా సామాజిక సంబంధాల్లో, ఉత్పత్తి సంబంధాల్లో, రాజ్యవ్యవస్థలో చూసి విశ్లేషించేవారు. 1999లో ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘానికి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీలు ఏర్పడ్డాక రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ గా పని చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్త పౌరహక్కుల సంఘాల కోఆర్డినేషన్ కమిటీ సిడిఆర్ వో వ్యవస్థాపక కన్వీనర్ గా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ హంట్ వ్యతిరేక పోరాట కమిటీకి కన్వీనర్ గా వ్యవహరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రెండు విప్లవ పార్టీలకు మధ్య జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తుల కమిటీలో కూడా పని చేశారు.
నలభై ఏళ్లకు పైగా విస్తారమైన ప్రజా జీవితంలో ఆయన పీడిత ప్రజల హక్కుల కోసం దృఢంగా పాటుపడ్డారు. మారు మూల గ్రామాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లి దళితుల, ఆదివాసుల, మహిళల హక్కుల ఉల్లంఘనపై నిజనిర్ధారణలు చేశారు. విప్లవకారులను రాజ్యం హత్య చేసిన ఘటనల్లో నిజ నిర్ధారణల ద్వారా పోలీసుల దుర్మార్గాన్ని ఎండగట్టారు.
రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల దారుణాలను ప్రశ్నిస్తూ నోరులేని ప్రజల గొంతుకగా నిలిచారు. ఈ క్రమంలో అనంతపురంలో ఆయన ఇంటి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. చంపుతామని అనేకసార్లు బెదిరించారు. అయినా తిరిగి చూసుకోకుండా పీడిత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పని చేశారు. ఈ క్రమంలో ఆయన పౌరహక్కుల అవగాహన సమాజంలో విస్తరించడానికి దోహదపడ్డారు. చివరికి సొంత సంస్థలోనే హక్కుల దృక్పథంలో వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి లోతైన తాత్విక, రాజకీయార్థిక, చారిత్రక విశ్లేషణలను అందించిన దార్శనికుడు అయన. న్యాయశాస్త్ర పండితుడిగా భారత శిక్షా స్మృతిని, రాజ్యాంగాన్ని అత్యంత సునిశితంగా, విమర్శనాత్మకంగా పరిశీలించి వాటికి ఉన్న పరిమితులను కూడా ఎత్తి చూపే క్రమంలో ఆయన పౌరహక్కుల ఉద్యమానికి తనదైన నాయకత్వాన్ని అందించారు. రాజ్యాంగంలోని విలువలు, ఆదర్శాలు వేర్వేరు పీడిత సమూహాల పోరాట ఫలితమని, ప్రజా పోరాటాల ద్వారానే హక్కుల సాధన, అమలు సాధ్యమని సాధికారికంగా చెప్పిన ఆలోచనాపరుడు ఆయన.
ఇలాంటి అత్యద్భుతమైన హక్కుల దృక్పథాన్ని అందించడం వెనుక ఆయన రూపొందిన క్రమం ఉంది. విద్యార్థి దశలో ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం సహాయ కార్యదర్శిగా పని చేశారు. 1980-81లో తిరుపతిలో చదువుతున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలో రాడికల్ ఉద్యమ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడిగా విద్యార్థులను పోరాటాల్లోకి తరలిచారు. చదువు అయిపోయాక 1983 సెప్టెంబర్ లో అనంతపురం ఎస్కె విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్ర ఆచార్యుడిగా పని చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో చేరారు. ఈ ఆచరణ, వర్గపోరాట రాజకీయాల అభినివేశం ఆయన్ను మార్క్సిస్టు మేధావిగా తయారు చేసింది. పౌరహక్కుల రంగాన్ని ఎంచుకొని జీవిత పర్యంతం పని చేయడానికి ఈ చైతన్యమే దోహదపడింది. హక్కుల రంగం, రాజ్యాంగం, శిక్షా స్మృతితోపాటు ఆయనకు మార్క్సిస్టు సిద్ధాంత, రాజకీయార్థిక, సాహిత్య విషయాల్లో లోతైన అధ్యయనం ఉంది. వాటి మీద తనదైన పరిశీలనలు, విశ్లేషణలు అందించారు. అట్లాగే కార్మిక ఉద్యమాలు, చట్టాల గురించి, రాయలసీమ ప్రత్యేక సమస్యల గురించి ప్రొ. శేషయ్యగారికి సీరియస్ అధ్యయనం ఉంది. ఆయా ఉద్యమాలకు అండగా నిలిచారు. ముఖ్యంగా విద్యార్థి దశలోనే రాయలసీమ యువజన విద్యార్థి కార్యాచరణ కమిటీలో పని చేశారు. నాయకత్వం వహించారు.
దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం రాజ్యమేలుతున్న తరుణాన పౌర ప్రజాస్వామిక హక్కులు తీవ్రంలో సంక్షోభంలో పడిపోయాయి. ఈ సందర్భంలో ప్రొ. శేషయ్యగారు అర్థాంతరంగా వెళ్లిపోవడం చాలా విషాదం. ప్రజా పోరాటాల ద్వారానే ఈ లోటు పూరించగలం. ఆయన జీవన సహచరి, కథా రచయిత్రి, అనువాదకురాలు, విరసం సీనియర్ సభ్యురాలు కా. శశికళ, కొడుకు అరుణ్ దు:ఖంలో పాలుపంచుకుంటూ శేషయ్యగారి స్ఫూర్తిని కొనసాగించడానికి విరసం సాహిత్య రంగంలో మరింత దృఢంగా పని చేస్తుంది. ఇదే ఆయనకు ఇవ్వగల నివాళి.
అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
బాసిత్, ఉపాధ్యక్షుడు
రివేరా, సహాయ కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం

Keywords : professor seshaiah, CLC, Martyr, Virasam, Maoists
(2020-11-26 00:10:35)No. of visitors : 248

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
more..


పౌరహక్కుల