హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్

హత్రాస్

అత్యాచారం, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నిర్భందించి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై హత్రాస్ దారుణంపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిథల్ మరియు జస్టిస్ రాజన్ రాయ్ డివిజన్ బెంచ్ రెండు గంటల విచారణలో బాధితుడి కుటుంబం మరియు వివిధ ప్రభుత్వ అధికారులను వాదనల్ని విన్నది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా బాధితురాలి కుటుంబసభ్యులు మాట్లాడుతూ..ఈ కేసు విచారణను ఢిల్లీకి లేదా ముంబైకి మార్చాలని కోర్ట్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును ఉత్తర ప్రదేశ్ నుంచి బదిలీ చేయాలని కుటుంబం కోరుకుంటుందని బాధితురాలి కుటుంబ తరఫు న్యాయవాది సీమా కుష్వాహా తెలిపారు.

ఇప్పటికే నిందితులకు మద్దతు ఇస్తున్న వివిధ గ్రూపుల నుంచి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నందున కుటుంబ భద్రత తీవ్ర‌ ఆందోళన కలిగిస్తోందని అన్నారు. భద్రతపై నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. కుటుంబ గోప్యతకు రాజీ పడకుండా దర్యాప్తు సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని సీమా కుష్వాహా కోర్టును కోరారు.

కాల్ వివరాల రికార్డులు మరియు ఇతర సమాచారానికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా, ఈ కేసులోని నిజాల్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. తన కుమార్తె దహన కార్యక్రమాలు తమకు తెలియకుండా,తమ సాంప్రదాయాలకు విరుద్దంగా జరిగాయని, ఆ కార్యక్రమానికి తమని అనుమతించలేదని పేర్కొన్నారు.

హత్రాస్ పోలీసులు తమ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారని, వారిపై జిల్లా మేజిస్ట్రేట్ ఒత్తిడి తెస్తున్నారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్సర్ తన వాదన వినిపించారు. 19 ఏళ్ల బాధితురాలి దహన సంస్కారాలను రాత్రి వేళల్లో నిర్వహించడంపై ఆయన మాట్లాడుతూ... ఆ నిర్ణయం తీసుకునే హక్కు తనకుందన్నారు.
కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కుల హింసను రేకెత్తించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా రాత్రి పూట దహన సంస్కారాలు నిర్వహించినట్లు లక్సార్ విజ్ఞప్తి చేశారు. దహన సంస్కారాలు మరింత ఆలస్యం చేస్తే శరీరం కుళ్ళిపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల నుండి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ కోర్ట్ కు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్ విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.

Keywords : hathras, court, rape, police,
(2024-04-17 20:02:05)



No. of visitors : 796

Suggested Posts


హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం

హ‌త్రాస్ వెళ్లేందుకు య‌త్నించిన మ‌ళ‌యాళీ పాత్రికేయుడు సిద్ధికీ క‌ప్ప‌న్‌తో పాటు మ‌రో ముగ్గురిని సోమ‌వారం యూపీ పోలీసులు అరెస్టు చేసి Unlawful Activities (Prevention) Act (యూఏపీఏ) కింద దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు.

దళితులపై అగ్రకుల మనువాద దాడులను ప్రతిఘటిద్దాం - కుల నిర్మూలనా పోరాట సమితి పిలుపు

ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా బుల్ గడి గ్రామంలో 20 బ్రాహ్మణ,వంద భూస్వామ్య ఠాకూర్ కుటుంబాలు,కేవలం నాలుగు దళిత కుటుంబాలు వ్యవసాయ రైతుకూలీలుగా జీవిస్తున్నారు.19 ఏళ్ల దళిత యువతి మనీషాను ఠాకూర్ కులానికి చెందిన నలుగురు మృగాళ్ళు

పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లు

నిన్న హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పట్ల కొందరు ఠాకూర్లు దుర్భాషలతో రెఛ్చిపోయారు. పోలీసుల ముందే వారు అసభ్యంగా మాట్లాడుతున్నా ఖాకీలు ప్రేక్షక పాత్ర వహించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హత్రాస్