ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!

ఎన్

కొన్ని సంవత్సరాల కింద చత్తీస్ గడ్ పోలీసులు వెళ్లగొట్టేవరకూ, దంతెవాడలో వనవాసి చేతనా ఆశ్రమ్ నిర్వహించిన సుప్రసిద్ధ గాంధేయవాది హిమాంశు కుమార్ తన ఫేస్ బుక్ వాల్ మీద మూడు రోజుల కింద హిందీలో రాసిన‌ బహిరంగలేఖకు వీక్షణం సంపాదకులు ఎన్. వేణు గోపాల్ చేసిన తెలుగు అనువాదం

ఎన్ ఐ ఎ సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగ లేఖ
ప్రియమైన యోధులారా,
మీరొక జాతీయ దర్యాప్తు సంస్థలో నియమితులైన అధికారులు.
దేశానికీ, ప్రజలకూ కష్టనష్టాలు కలిగించే అపరాధుల గురించి దర్యాప్తు చేసి, దేశానికీ, ప్రజలకూ నష్టం కలగకుండా చూడడం మీ పని.
ఇటీవలి కాలంలో మీరు దేశంలోని ఎందరో సామాజిక కార్యకర్తలను జైళ్లకు పంపించే పని చేశారు.
దానితో పాటు మరెందరో సామాజిక కార్యకర్తలను ప్రశ్నించారు. వారిలో మరికొందరిని కూడ మీరు జైలుకు పంపించగలరు.
మీ ద్వారా జైళ్లకు పంపించబడిన సామాజిక కార్యకర్తలలో వృద్ధులైన మహిళలున్నారు. వృద్ధులైన కవులూ, న్యాయవాదులూ, మానవహక్కుల కార్యకర్తలూ ఉన్నారు.
మీ సంస్థ నేరుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది.
ఇటీవల మీరు అమిత్ షా అధీనంలో పని చేస్తున్నారు.
మీరు పోలీసు అధికారులు గనుక మీకు అమిత్ షా గురించి తెలిసే ఉంటుంది.
అమిత్ షా ఒక పేరు మోసిన నేరస్తుడు. మొదట గ్రానైట్ వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తూ ఉండేవాడు.
అమిత్ షా కిరాయి హంతకుల చేత హత్యలు చేయిస్తుండేవాడు.
తులసీ ప్రజాపతి, సోహ్రాబుద్దీన్ అనే ఇద్దరు కిరాయి హంతకులు అమిత్ షా కొలువులో ఉండేవారు.
మంత్రి అయిన తర్వాత అమిత్ షా తన పాత నేరాల ఆనవాళ్లు చెరిపివేయడం కోసం ఆ ఇద్దరు కిరాయి హంతకులనూ (ప్రజాపతినీ, సోహ్రాబుద్దీన్ నూ) హత్య చేయించాడు.
సోహ్రాబుద్దీన్ హత్య కేసులో అమిత్ షా కొంతకాలం జైలులో కూడ ఉన్నాడు. న్యాయస్థానం అమిత్ షాను నేరస్తుడిగా నిర్ధారించింది కూడ.
ఇటీవల మీరు ఈ నేరస్తుడి ఆదేశాల మేరకు సామాజిక కార్యకర్తలను జైలు పాలు చేస్తున్నారు.
మీరు భారత పౌరులేననుకుంటాను.
మీరు పోలీసు అధికారులుగా పదవీ బాధ్యతలు స్వీకరించేటప్పుడు నిండా ఆదర్శాలున్న యువకులుగా ఉండి ఉంటారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ దేశాన్ని ఒక మంచి దేశంగా, అందమైన దేశంగా తీర్చిదిద్దాలనీ, దేశ ప్రజలకు సేవ చేయాలనీ కలలు కని ఉంటారు.
కాని ఇప్పుడు మీరు ఏ పనులు చేస్తున్నారో, మీరే ఒకసారి ఆలోచించండి.
ఇవాళ మీరు ఏయే పనులు చేస్తున్నారు?
మీరు జైలుకు పంపించిన సామాజిక కార్యకర్తలు భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, పౌరులందరి మానవ హక్కులు కాపాడడం కోసం తమ జీవితమంతా కృషి చేసినవారు.
వారిలో పేదల కోసం ఉచితంగా న్యాయసేవలు అందించిన న్యాయవాదులున్నారు.
వారిలో ప్రజల పక్షాన కవిత్వం రాసిన కవి ఉన్నాడు.
ఇవాళ కొందరు సంపన్నులు అడానీ, జిందల్, మిత్తల్ ల లాగ మన దేశపు అడవులనూ, గనులనూ ఆక్రమించి, ఖనిజాలు తవ్వి మరింత సంపన్నులు కాదలచుకున్నారు.
ఆ సంపన్నులు తమ ఈ భూదురాక్రమణ లో తమకు ఎవరూ అడ్డు రాగూడదని భావిస్తున్నారు.
అందుకే ఆ సంపన్నులు అమిత్ షా, మోదీ వంటి నేరస్తులైన నేతలకు లంచాలు పెట్టి వారిని అదుపులో పెట్టుకున్నారు. ఆ నేతలే ఆ సంపన్నులను వ్యతిరేకించేవారిని జైళ్ల పాలు చేయమని మిమ్మల్ని ఆదేశిస్తున్నారు.
ఆ నేరనేతల ఆదేశాల మేరకు మీరు దేశాన్ని రక్షిస్తున్న సామాజిక కార్యకర్తలను జైళ్లపాలు చేస్తున్నారు.
మీరు చేస్తున్న పని దేశానికి ప్రయోజనకరమైనదా, హానికరమైనదా మీరే స్వయంగా ఆలోచించండి.
జలియన్ వాలా బాగ్ లో హతులైన భారతీయుల మీద తుపాకులు పేల్చిన సైనికులు భారతీయులేనని గుర్తు తెచ్చుకోండి.
ఇవాళ భారతదేశాన్ని కొల్లగొడుతున్న సంపన్నుల ఆదేశం మేరకు మీరు దేశానికి నష్టం కలిగిస్తున్నారు.
ఇవాళ మీకు గెలుపు మీదే అన్నట్టు అనిపిస్తుండవచ్చు. ఆ సామాజిక కార్యకర్తలను జైళ్లలో నిర్బంధిస్తే వారు ఓడిపోయారని మీకు అనిపిస్తుండవచ్చు.
కాని మిత్రులారా, మీ ఆలోచన తప్పు.
కొన్ని సంవత్సరాలు గడిచాక ఈ సామాజిక కార్యకర్తలు మరణించవచ్చు.
మీరు కూడ మరణించవచ్చు.
కాని అప్పుడు చరిత్ర మీ పిల్లలకు ఈ జరిగిన ఘటనాక్రమం అంతటి గురించీ చెపుతుంది.
ఆ చరిత్ర ఈ సామాజిక కార్యకర్తల ఔన్నత్యాన్ని చెపుతుంది. మీరు చేసిన దుర్మార్గాన్నీ చెపుతుంది.
అప్పుడు మీ పిల్లలూ, వారి పిల్లలూ మీ వారసులమని చెప్పుకునేందుకు సిగ్గు పడతారు.
ఆలోచించండి, మీరు ఏ రకంగానూ ప్రయోజనం పొందడం లేదు.
కొన్ని సంవత్సరాల తర్వాత మీరు పదవీ విరమణ పొందుతారు. అప్పుడు మీ పాత పాపాలు మీ మనసును ఆందోళనామయం చేస్తాయి. మిగిలిన జీవితమంతా మీరు భయంభయంగా, పాపభీతితో బతకవలసి వస్తుంది.
నిజాయితీతో పనిచేస్తున్నవాళ్లు తమ శేష జీవితాన్ని సంతోషంగా గడపగలరు.
ఆ నిజాయితీపరులు తిన్నంత ఆహారమే మీరు కూడ తింటారు.
దేశం పట్ల, దేశప్రజల పట్ల, చివరికి మీ పట్ల మీరే ఈ ద్రోహానికి పాల్పడడం ఎందుకు?
ఇప్పటికైనా దేశం వైపు, రాజ్యాంగం వైపు, మానవత వైపు మళ్ళడానికి మీకు సమయం ఉంది.
అవన్నీ పోగొట్టుకుని కాసిన్ని డబ్బులే సంపాదించాలనుకుంటే, అవి ఏం పని చేస్తాయి?
దేశం వైపు రండి.
దేశద్రోహులకు సహకరించకండి.
మీ శ్రేయోభిలాషి
హిమాంశు కుమార్
(తెలుగు అనువాదం ఎన్. వేణు గోపాల్)

Keywords : NIA, Amit shah, Bhimakoregaon, Jaliyanwalabagh, adani, ambhani, jindhal. mittol
(2024-04-25 03:16:24)



No. of visitors : 619

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఎన్