పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు


పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు

ʹమా జీవితాలను నాశనం చేసే పోలీసులు క్యాంపులు అవసరం లేదు. మాకు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలు కావాలిʹ అంటూ అక్కడ గుమి కూడిన వందలాది మంది ఆదివాసులు నినదిస్తున్నారు.

ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో అనుప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కక్రీ గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం చేస్తున్నారని తెలుసుకొని janjwar.com వెబ్ సైట్ ప్రతినిధి అక్కడికి వేళ్ళే సరికి...అక్కడ వందలాది మంది రహదారిని తవ్వుతున్నారు. వాళ్ళాపని 5 రోజులుగా చేస్తున్నారు. అప్పటికే దాదాపు 5 కిలోమీటర్ల మేర రహదారిని తవ్వేశారు. ప్రభుత్వం వేసిన రహదారిని తవ్వడంలో నిమగ్నమై ఉన్న ఆ గ్రామస్తులతో ఆ వెబ్ సైట్ ప్రతినిధి తామేశ్వర్ సిన్హా మాట్లాడగా.... ʹʹఎట్టి పరిస్థితులలోనూ మాకు పోలీసు క్యాంప్ వద్దు అని గ్రామస్తులు అన్నారు. క్యాంపు వుంటే నక్సలైట్లు అని కేసులు పెట్టి జైళ్లకు పంపుతారు. ఇంతకు ముందు కూడా పోలీసులు మా గ్రామ ప్రజలను పట్టుకుని జైలుకు పంపారుʹʹ అని చెప్పారు

వాస్తవానికి, ఏ ఆదివాసీ గ్రామస్తులు కూడా తమ ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేయడానికి ఇష్టపడరు. పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా కక్రీ గ్రామస్తులందరూ క్యాంపు ఏర్పాటును ఐక్యంగా వ్యతిరేకిస్తున్నారు.
అక్కడ మహిళలు, వృద్ధులు, పురుషులు పార, పలుగులతో, రహదారిని తవ్వే పనిలో ఉన్నారు. సుమారు 5 కిలోమీటర్ల రహదారిపై వందలాది గుంటలు తయారు చేసి గ్రామస్తులు తమ నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలియచేయడానికి నహరి గ్రామం దగ్గర నహరి, కాకాడి, బుర్గం, పొటాలి, జబెలి, గోండేరాస్, బారెం గ్రామస్తులు 4 రోజులుగా రోడ్డు పక్కన టెంట్ వేసుకుని వుంటున్నారు, అక్కడే వంట చేసుకుంటున్నారు. నహారీ నుండి కాకాడి వరకు రహదారిని తవ్వేసారు.త్రవ్వుతున్న వారిలో నహరి సర్పంచ్ కూడా ఉన్నాడు. నహరి గ్రామంలో పోలీసు క్యాంపు అవసరం లేదని, నహరిలో శిబిరం ఏర్పాటు చేయరాదని పంచాయతీ ఒక తీర్మానం చేసింది. 4 రోజులుగా నిరసన కొనసాగుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం తరఫు నుంచి ఎవరూ రాలేదు. నహాది గ్రామం లోతట్టు ప్రాంత పంచాయతీలో చేర్చారు, ఈ కారణంగాప్రభుత్వానికీ, పోలీసులకు ఈ నిరసన విషయం తెలియనే తెలియదు.

నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు తమకు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలు అవసరమని, భద్రతా దళాల క్యాంపులు కాకుండా, తరువాతి తరం భవిష్యత్తును మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు. బస్తర్‌లో గత రెండేళ్లలో భద్రతా దళాల క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివాసీ గ్రామస్తులు నిరంతరం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం కొత్త పోలీసు క్యాంపులను ఏర్పాటు చేస్తూనే వుంది.

Keywords : chattis garh, bastar, dantewada, adivasi, roads, police camps, hospitals, Schools
(2021-04-17 06:03:26)



No. of visitors : 548

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రజలపై పారామిలిటరీ, డిఆర్‌జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్

భద్రతా దళాల సిబ్బంది గ్రామస్తులను వేధిస్తున్నారని సిపిఐ-మావోయిస్టు కిష్టారామ్ ఏరియా కమిటీ ఆరోపించింది. ఏరియా కమిటీ తొలిసారిగా వీడియో, ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా అడవి ప్రాంతంలో, భద్రతా దళాల క్యాంపుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం బుర్కాపాల్. ఈ గ్రామానికి వెళ్తే తమ పనులలో నిమగ్నమై వున్న మహిళలు లేదా వడిసెలతో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. కొంతమంది పురుషులు కూడా కనపడవచ్చు కానీ వారు బయటి వారితో మాట్లాడడానికి భయపడతారు.

మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.

రైతుల ఉద్యమంలాంటిదే అక్కడా నడుస్తోంది - 4 రోజులుగా చలిలో వాళ్ళు రోడ్లమీదే ఉన్నారు

కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా లక్షలాదిమంది రైతులు ఉద్యమిస్తున్నారు. దాదాపు పది రోజులుగా వణికించే చలిలో ఢిల్లీ శివార్లలో కూర్చొని ఉన్నారు రైతులు. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమంపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఆదివాసులు దాదాపు ఇటువంటి ఉద్యమాన్నే ప్రారంభించారు.

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


పోలీసు