సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు

సాయుధ

(2016 అక్టోబర్ 24 న బూటకపు ఎన్ కౌంటర్ లో అమరుడైన కామ్రేడ్ ప్రభాకర్ పై వరవరరావు రాసిన వ్యాసం)

1970 ల తొలి రోజుల్లో విడుదలైన అంకుర్‌కు సినిమా. ఆపిల్లవాడు దొరగడీమీదికి ఎంతో ఆగ్రహంతో ఒక రాయి విసరడంతో ముగుస్తుంది. ఐదారేళ్ల పసి వయసుకే ఆపిల్లవాడు ఆవూళ్లో చాలా అత్యాచారాలు,అఘాయిత్యాలు చూసాడు. తానటువంటి సంతానమని తనకు తెలుసా?ఎందుకంత వేదన,ఎందుకంత ఆగ్రహం? ఏమంత వయసని?

1970లకు ముందు సికిందరాబాద్‌ కంటోన్మెంట్‌ వాతావరణం అది. అల్వాల్‌ ,వెంకటాపురం, లాల్‌ బజార్‌ ,బొలారం, యాప్రాల వంటి ఎన్నో గ్రామాలను మింగిన సైనిక పటాల కొండచిలువ కంటోన్మెంట్‌.అక్కడ రెండు ప్రపంచాలు. దేశమంతా ప్రతీనగరం ప్రవేశాల్లో కనిపించే ఇంగ్లీష్‌ పాలన కాలపు కంటోన్మెంట్లు సికిందరాబాదు భాషలోనైతే లష్కర్లు. ఆ లష్కర్లో ఆ పేరుపెట్టుకొని పిలిచే లష్కరుబోనాలు. కల్లు కాంపౌండులు. రక్తంతో తొక్కేరిక్షాలు. సిరుమల్లె సెట్టుకింద సినబోయి కూచున్న లచ్చుమమ్మలు. ఎక్కువ మంది దళితులు. అప్పటికి ఆ ఊరికి దత్తత వచ్చిన దొరతప్ప అందరూ బడుగు వర్గాలు. కష్టం చేసుకుని బతికే వాళ్లు. 1970ల ఆ జీవితాన్ని అప్పుడే కుతకుత ఉడుకుతున్న తిరుగుబాటును ,వాళ్ల కళ్ల నుంచి చూసి, వాళ్ల జానపద బాసలో వినాలంటే శ్యాం బెనగల్‌ అంకుర్‌ చూసి తీరాల్సిందే.

అక్కడ పుట్టింది ఆర్ట్‌ లవర్స్‌ .ఆర్ట్‌ లవర్స్‌ విస్ఫోటనమై జననాట్యమండలి అయింది. బీదలపాట్లు ప్రదర్శించి ఊరుకోలేదు. పాటను, మాటను తూటాగా మార్చింది. దృశ్యం మారిపోయింది. ఈ ముప్పై ఆరేళ్లలో ఆ ఊళ్లనుంచి ఎందరెందరు విప్లవకారులు దేశవ్యాప్తంగా నక్సలైటు ఉద్యమంలోకి వెళ్లారో ఎందరు అమరులయ్యారో. కనీసం నలుభై అయిదుగురు. సుభాష్‌ నగర్‌లోని అమరుల స్థూపం నిలువెత్తు సాక్ష్యం.

ఆ జానపద, ప్రజా సాంప్రదాయం నుంచి వచ్చి మావోయిస్టు విప్లవకారుడుగా అమరుడయ్యాడు ప్రభాకర్‌. ఆయన కళల్లో కళ్లు తెరిచేనాటకిే కంటోన్మెంట్‌లోనే కాదు ఒక విప్లవ కుగ్రామంగా యాప్రాల్‌ గ్లోబల్‌ సంగ్రామంలో భాగమైంది. తలిదండ్రుల నుంచి పరిసరాలనుంచి ఉగ్గుబాలతో అబ్బిన కళలు జననాట్యమండలి ప్రభావంతో క్రాంతి కళా కాంతులైనవి. డోలక్‌ దయగా జననాట్యమండలిలో ప్రసిద్ధుడై అమరుడైన తన ముందు వరుస కళాకారుడు ఆప్రాంతం వాడే. అయితే ఇంక ప్రభాకర్‌కు ప్రాంతమేమిటి. యాప్రాలనుంచి తన గాత్రంతో, వాద్యంతో నేకాదు నిర్మాణ శక్తిగా తెలుగునేలంతా దేశమంతా విస్తరించాడు. రెండు దశాబ్దాల క్రితమే సామ్రాజ్యవాద ,భూస్వామ్య సంస్కృతినిప్రతిఘటించే కళాసాంస్కృతిక సంస్థ ప్రజాకళా మండలి సంస్థాపనలో ఒకడయ్యాడు. తానెప్పుడూ తబలాపై తరగలవలె ఎగసి పడే చేతులతో సైడ్‌ కర్టెన్‌ లలోనే . ఎప్పుడోగానీ మైకుముందుకురాడు. వస్తే ఆ కంఠం ఆ స్టామినా (దమ్ము) జననాట్యమండలి సంజీవ్‌నుతలపింప చేసేది. ఆ చిరునవ్వు ఆ హాస్యం ఆ వ్యంగ్యం, ఆ పలకరింపు, ఆ ఆప్యాయత, ఆ ఆత్మీయత. ముందటి పళ్ల కింద పళ్లతో కళ్లల్లో వెలుగుతో ఆనిలువెత్తు శ్యామలాకారం. ఆ గాత్రం కంఠంగా కాదు.. కరచరణాలు కావు. ఒక దేహంగా ఒక ఆత్మగా, ఒక వ్యక్తిత్వంగా ఇవ్వాళ ఆయన తెలిసిన ఎవరి హృదయపేటికలైనా తెరిచిచూడండి. అచ్చుగా అదే దృశ్యం.

1997 డిసెంబర్ 28,29 తేదీల్లో అఖిల భారత ప్రజాప్రతిఘటనావేదిక వరంగల్‌లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు నిర్వహించింది. రెండువేల మంది ప్రతినిధుల సదస్సుతో, రెండున్నర లక్షల మంది ప్రజలు పాల్గొన్న బహిరంగ సభ అది.

ఆ సదస్సులో ప్రజాకళా మండలి లొల్లి ఆడియో క్యాసెట్‌ విడుదల చేసింంది. అన్ని పాటలు ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ చేసే మిలిటెంట్‌ స్వరాలు. నందిని సిధా రెడ్డి నాగేటి చాళ్లల్లో నాతెలంగాణ అందులోదే. అప్పటిదే. అక్కడినుంచి 2014 లో తెలంగాణ ఏర్పడేదాకా ప్రజాకళామండలి ప్రభాకర్‌ ఎన్ని వేల ప్రదర్శనల్లో తెలంగాణ లోనే కాదు , ప్రజాస్వామిక తెలంగాణ స్వరాన్ని వినిపిస్తూ తెలుగునేలంతా దేశమంతా తిరిగాడు. ఎన్నో ప్రజాసంఘాలకు సాంస్కృతిక శిక్షణా శిబిరాలు నిర్వహించాడు. ఎన్ని విరసం సభల్లో ఒక వాద్యమయ్యాడో,ఒక గాత్రమయ్యాడో.ఎప్పుడూ ఒంటరిగాకాదు,సోలోగాకాదు,బృందంగా తబలా ఒక్కటే ఊగిపోయే మనిషి,మోదే రెండుచేతులు.. కళ్లల్లోంచి విద్యుత్‌ వెలుగులు. పెదాలమీంచి చిరునవ్వులు.కోపావేశాల కోరస్‌.సందర్భాన్ని బట్టి.. అవసరాన్ని బట్టి..

మళ్లీ మీరంతా విన్నారు గదా.. సోషల్‌ మీడియాలో.. లగడపాటిపై పాటలో దిశ వేదిక మీంచి ఆయన స్వరంతోనూ, శరీరంతోనూ పలికించిన వ్యంగ్యం..

అంత మాత్రమే అయితే ప్రభాకర్‌ గురించి పికెఎంప్రభాకర్‌ గురించి, ఎందుకు మాట్లాడుకుంటాం. స్వరమే పోరాటమైతే మాట్లాడుకోమని కాదు. ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక పోరాటంలో ప్రజాకళామండలి కన్వీనర్లు గా ముందువరుసలో పదిహేడు ముక్కలైన బెల్లి లలిత గురించి పద్మాక్షమ్మ గుట్ట కు ఎన్‌ కౌంటర్‌ అయిన ఐలన్న గురించి పాటకున్న మందుపాతర శక్తి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రజాగాయకుడు గద్దర్‌ దేహంలోకి దూసుకుపోయిన తుపాకిగుండ్లగురించి ,ఊపిరితిత్తుల్లో మిగిలిన తూటా గురించి అది తెలంగాణ పాటయై తిరిగి వచ్చిన వైనంగురించీ మాట్లాడుకుంటూనే వున్నాం.

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత పులులనుంచి చంద్రవంక దళమైన ఏసువలె. జననాట్యమండలినుంచి పీపుల్స్‌వార్‌ నలగొండ జిల్లా కార్యదర్శిగా ఎదిగిన దివాకర్‌ వలె. ప్రభాకర్‌ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రజాపోరాట ప్రవాహ గంగాధరుడయ్యాడు. ఆదివాసీ సమాజ సాయుధ సాంస్కృతిక యోధుడయ్యాడు. ఆయన గాత్రానికొక ఆకుపచ్చని విప్లవ ఆహార్యమొచ్చింది. చేతుల్లో తబ్లా స్థానంలో తుపాకీ వచ్చింది. భుజానికి వేళాడిన వాయిద్యం వలె పోరాట సాధనమొచ్చింది. ఆయన ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రత్యేక సాయుధ గెరిల్లా జోన్‌లో జిల్లా స్థాయి నాయకుడయ్యాడు. అందుకే విక్టర్‌ యారా గాత్రమంతా అణువణువూ ఛిద్రం చేసినా అమెరికా బహుళ జాతి రాగి పరిశ్రమ వంటి దుబాయి బాక్సైట్‌ కంపెనీ,నిరంతరం చింతపెల్లి అడవుల సంరక్షణ పోరాట గీతాలాలపిస్తున్న ప్రభాకర్‌ పేగులను తోడేసింది. మొహం ఛిద్రం చేసింది. కాళ్లు విరిచేసింది.

అక్టోబర్‌ 26న సహచరి దేవేంద్రతోబాటు ఆయన మృతదేహాన్ని ఎత్తిన చేతులనుంచి మాంసపుముద్దలురాలిపడినట్లు. మంచుగడ్డలు కరిగి రక్తం ప్రవించినట్లు. అవన్నీ గడ్డకట్ట వచ్చు. నల్ల బడ వచ్చు. ఆ మృత దేహం నల్లబడ వచ్చు. దహనమైబూడిద కావచ్చు. ఆ సాయుధ గాత్రం మన గుండెల్లో సదా మార్మోగుతూనే ఉంటుంది.

- వరవరరావు

Keywords : prabhakar, maoists, varavararao, encounter, malkangiri, singer, song, hyderabad,
(2024-04-06 19:14:45)



No. of visitors : 1122

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సాయుధ