టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం


టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం

బీహార్‌లోని కైమూర్ ప్రాంతంలోని నూట ఎనిమిది గిరిజన గ్రామాలు ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. గత నెలలో బీహార్ పోలీసులు ఈ ప్రాంతంలోని గిరిజన గ్రామాలపై విరుచుకుపడి గ్రామస్తులను దారుణంగా కొట్టి అనేక మందిని అరెస్టులు చేసినందుకు నిరసనగా, తమ ప్రాంతాన్ని టైగర్ రిజర్వుడు ఫారెస్టుగా ప్రకటించడానికి వ్యతిరేకంగా, మరికొన్ని డిమాండ్లపై ఈ గ్రామాలు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు గ్రామాలపై దాడులు చేస్తూ బలవంతంగా ఇళ్ళను కూలగొట్టడం పంటలను నాశనం చేయడం ప్రజలపై దాడులు చేయడం నిరంతరం కొనసాగిస్తున్నారని ఈ ప్రాంత గిరిజనులు ఆరోపించారు. ఫారెస్టు వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొంత కాలంగా ఆదివాసీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ʹకైమూర్ ముక్తి మోర్చాʹ అనే సంస్థ‌ ఈ ఆందోళనల‌కు నాయకత్వం వహింస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన 29 మంది గిరిజన కార్యకర్తలు మరియు నాయకులు తమపై పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆరోపించారు. నిరసనకారులలో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని జైలుకు పంపారు. ఆ ఏడుగురు అక్టోబర్ 16 న బెయిల్‌పై విడుదల చేశారు.

ఈ అంశంపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్ తో సహా నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ఈ రోజు ఓ నివేదికను విడుదల చేసింది. "ఈ నిర్దిష్ట సందర్భంలో, నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అస్సలు అమలు చేయలేదు - అది కూడా రెండు బ్లాకులలో 50 శాతానికి పైగా గిరిజన జనాభా ఉన్న ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలోని ఒక్క ఆదివాసీకి కూడా పట్టా ఇవ్వలేదు - గిరిజనులు దాఖలు చేసిన 8,000 భూ దావాల్లో 121 మాత్రమే అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. ʹ అని కారత్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
నలుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందంలో అమీర్ షెర్వానీ ఖాన్ (ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ వర్కింగ్ పీపుల్), మాతాదయాల్ (ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ వర్కింగ్ పీపుల్), రాజా రబ్బీ హుస్సేన్ (ఢిల్లీ సాలిడారిటీ గ్రూప్) మరియు సుప్రీంకోర్టు న్యాయవాది అమన్ ఖాన్ ఉన్నారు. .

ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం, 2020 సెప్టెంబర్ 10 న, అధౌరా బ్లాక్ లోని 108 గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులు, యువకులు మరియు పిల్లలతో సహా వేలాది మంది ఆదివాసీలు అధౌరాలోని అటవీ శాఖ కార్యాలయం ముందు చేరి తమపై దాడులు, బలవంతంగా తమను నిర్వాసితులను చేయడం, తమ పంటలను నాశనం చేయడం తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు దుర్మార్గంగా దాడి చేశారు. లాఠీ చార్జ్ చేశారు. కాల్పులు జరిపారు. ఏడుగురు ఆదివాసీ కార్యకర్తలను అరెస్టు చేసి జైలుకు పంపారు. చాఫనా గ్రామానికి చెందిన ఆదివాసి యువకుడు ప్రభుపై కాల్పులు జరిగాయని నివేదిక పేర్కొంది.

Keywords : bihar, election boycott, adivasi, 108 tribal villages to boycott Bihar polls over ʹpolice crackdownʹ
(2020-12-03 13:03:04)



No. of visitors : 186

Suggested Posts


Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State Repression

The CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters. Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others....

భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్‌ - రవి నర్ల

భారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్‌లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్‌ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్‌ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని.

ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి

జార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్‌ 29న జార్ఖండ్‌ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్‌ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?

బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.....

బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు

బీహార్ గయ జిల్లాలో జరిగిన ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14వతేదీన ఇంటి నుండి బైటికి వెళ్ళిన ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు బలిసిన కుటుంభాలకు చెందిన దుర్మార్గులు కిడ్నాప్ చేసి పంచాయితీ భవనంపైకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. స్పృహతప్పిన ఆ బాలికను అక్కడె వదిలేసి వెళ్ళి పోయారు.

పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?

బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లా లోని షాహోపూర్ గ్రామానికి చెందిన గీరెజ్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి,ఒక కొడుకు కొడుకుకు మూడేళ్ళు. కొద్ది రోజులుగా కొడుకు రిషుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు.

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader

The internet canʹt stop admiring TV9 Bharatvarsh reporter Rupesh Kumarʹs questioning of a self-proclaimed Bharatiya Janta Party leader who broke ICU rules in a Muzaffarpur hospital.

జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?

అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలికిన నేరానికి చెరసాలల్లో మగ్గుతున్న ప్రియమైన మిత్రులారా, మా పేర్లు కళ్యాణి, తన్మయ్. బీహార్ ఈశాన్య కొసన అరారియా అనే చిన్న జిల్లాకు చెందినవాళ్లం. బీహార్ లో భూమిలేని నిరుపేదల మధ్య పనిచేసే జన జాగరణ శక్తి సంఘటన్ కార్యకర్తలం.

Search Engine

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !
రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌
20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం
రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
more..


టైగర్