శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది


శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది

శిక్ష

12 సంవత్సరాలు గడచిపోయినా, గుజరాత్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 78 మంది నిందితులు యింకా జైల్లోనే ఉన్నారు

నిందితులందరూ నిర్దోషులు అనీ.. ఇతర ఉగ్రవాద కేసుల్లో లాగానే వీరిని కూడా ఈ కేసులో ఇరికించారని డిఫెన్స్ లాయర్ ఖలీద్ షేక్ అంటున్నారు. 2008 సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుల బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు అక్టోబరు 22, గురువారంనాడు ఇచ్చిన ఉత్తర్వులో విలేఖరులను, సంపాదకులను విచారించడానికి డిఫెన్స్ కౌన్సిల్ కు అనుమతినివ్వకపోవడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఈ కేసులో 78 మంది నిందితులు గత 12 సంవత్సరాలుగా శిక్ష పడకుండానే జైలులో వున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోద‌క‌ చట్టం(UAPA), దేశద్రోహ ఆరోపణలతో సహా చట్టంలోని వివిధ కఠినమైన సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు అయింది.

"విలేఖ‌రులు, సంపాదకులను విచారణ చేయడం మాకు ఒక రకమైన రక్షణను కలిగిస్తుంది. దీని విలువను నిర్ణయించాల్సిన బాధ్యత కోర్టుపై ఉంది. ఈ కేసులు నిందితులపై కల్పించబడినవని మేము నమ్ముతున్నాము. విలేఖ‌రులు, సంపాదకులను విచారణ చేస్తే పోలీసులు ముందుగానే ఒక కథను తయారు చేసి, తరువాత నిందితులను అందులో చేర్చార‌ని రుజువు అవుతుంది ʹఅని ఈ కేసులో 50 మందికి పైగా నిందితులకు ప్రాతినిధ్యం వహించిన న్యాయ‌వాది ఖ‌లీద్‌ షేక్ అన్నారు.

ఈ కేసులో 1,163 మంది సాక్షుల విచారణ జరిగింది కానీ నిందితులపై ప్రాసిక్యూషన్ ఏమీ రుజువు చేయలేదు. నిందితులకు ప్రత్యక్ష ప్రమేయం వున్నట్లు ఇంకా రుజువు కాలేదు.

ʹఈ కేసు అక్షరధాం పేలుడు కేసు లాంటిది. నిందితులను అక్షర్‌ధామ్ కేసులో ఇరికించార‌ని సుప్రీంకోర్టు తీవ్రంగా చివాట్లు పెట్టిన క్రైమ్ బ్రాంచే ఈ కేసును కూడా విచారిస్తోంది. అక్షరధాం కేసులో మాదిరిగానే, ఈ కేసులో కూడా అవే సాక్ష్యాలను చూపిస్తోంది …… రాజకీయ లబ్ది పొందటానికి ఒక నిర్దిష్ట సముదాయాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ కేసులు రూపొందించబడ్డాయి, రాజకీయ నాయకులు ఉగ్రవాద దాడుల నుండి రాజకీయ లబ్ది పొందారనేది బహిరంగ రహస్యం. రాజకీయ నాయకులు రాజకీయ లబ్ది తీసుకోవ‌టానికి ఇష్టపడనప్పుడు, పేలుడు జరగదు, కాని వారు రాజకీయ లబ్ది పొందాలనుకున్నప్పుడు మాత్రం పుల్వామా దాడిలో జరిగినట్లుగా పేలుళ్లు జరుగుతాయి" అని షేక్ అన్నారు.

అహ్మదాబాద్, సూరత్ లలో 2008 జూలై 26 నాడు వరుస బాంబులు పేలడంతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాద దాడి చేసిందని భారతీయ ముజాహిదీన్ ని నిందించారు. పేలుడు జరిగిన కొన్ని నెలల తరువాత, పోలీసులు ముస్లిం సముదాయానికి చెందిన డజన్ల కొద్దీ వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులు, వైద్యులు, ఇంజనీర్లు కూడా ఉన్నారు.

పేలుడు తరువాత, అరెస్టులకు ముందు ప్రచురించబడిన రిపోర్టుల మూలాధారాలను ప్రామాణీకరించడానికి స్థానిక, ఆంగ్ల వార్తాపత్రికల విలేఖ‌రులను, సంపాదకులను పరీక్షించడానికి న్యాయవాదికి అనుమతినివ్వాలని నిందితులు తమ న్యాయవాది ద్వారా కోర్టును కోరారు. స్థానిక దినపత్రికలు సందేష్, దివ్య భాస్కర్, ఇంగ్లీష్ దినపత్రికలు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్ మిర్రర్ లవిలేఖరులు, ఫోటోగ్రాఫర్ల ను డిఫెన్స్ కౌన్సిల్ విచారణ చేయాలనుకున్నది.

బాంబు పేలుడు కేసులు త్వరితగతిన విచారణ జరపడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన న్యాయమూర్తి అంబలాల్ పటేల్ గురువారం ఆ దరఖాస్తును తిరస్కరిస్తూ, విలేఖరులు సేకరించి వార్తాపత్రికలలో ప్రచురించిన సమాచారం నిజం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.

కొన్ని ఉగ్రవాద కేసుల్లో నిందితులకు ప్రాతినిధ్యం వహించిన మరో న్యాయవాది షంసద్ పఠాన్ కూడా నిందితులపై పెట్టిన కేసులు కల్పితమైనవి కావచ్చని భావిస్తున్నారు, అయితే డిఫెన్స్ లాయ‌ర్ త‌మ క్లయింట్ల కోసం గట్టి పోరాటం చేసినట్లు కనబడటం లేదు అని అన్నారు. ఈ కేసులో రాజకీయ కోణం కూడా వుందన్నారు.

"2008 బాంబు పేలుడు ఘటన నాకు మొదటి నుండి సందేహాస్పదంగానే వుంది. ఎందుకంటే, ఆశారాం బాపు ఆశ్రమంలో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మరణం తరువాత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో ఈ పేలుడు జరిగింది. ఆశారాంకి వ్యతిరేకంగా ప్రజలు గొంతు విప్పడం అదే మొదటిసారి. ప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో వుండిందంటే, అధికారంలో ఉన్నవారికి సమాధానం చెప్పడం కష్టమైపోయింది. అప్పుడు, అకస్మాత్తుగా పేలుళ్లు జరిగాయి. అందుకే ఈ సీరియల్ పేలుళ్లపై నాకు సందేహాలు ఉన్నాయిʹ అని పఠాన్ అన్నారు.

Keywords : gujarat, bomb blasts, ahmedabad court, UAPA
(2023-03-19 20:00:26)No. of visitors : 1160

Suggested Posts


పెప్సీని, లేస్ ను బ‌హిష్కరిద్దాం... రైతులను కాపాడదాం !

ఏప్రిల్ మొదట్లో అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో... పెప్సీ కంపెనీ ఓ లా సూట్ ఫైల్ చేసింది. ఫలితంగా సబర్‌కాంతా జిల్లాలో... రైతులైన బిపిన్ పటేల్,ఛాబిల్ పటేల్, వినోద్ పటేల్, హరిభాయ్ పటేల్ లాంటి అనేక మంది రైతులు బంగాళా దుంపల పెంపకం, అమ్మకాలు జరిపేందుకు వీలు లేకుండా పోయింది.

After JNU,HCU & DU, ABVP Loses Gujarat Central University Polls

Akhil Bharatiya Vidhyarthi Parishad (ABVP) has lost the student body election held in Gujarat Central University by a big margin, reports National Herald. This loss comes ahead of a hotly-contested Assembly elections in Gujarat....

ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రావడం పేదల ప్రాణాలమీదికొచ్చింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఆయన పర్యటించనున్నారు. ఆయన తిరిగే ప్రాంతంలో పేదలెవ్వరూ ఆయనకు కనపడవద్దని భావించిన

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం

ప్రపంచ పోలీసుగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం వస్తున్న సందర్భంగా మోడీ చేస్తున్న పని విమర్షలకు తావిస్తోంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు ట్రంప్ వస్తున్నాడు.

సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !

గోద్రా ఘటన జరిగిన రోజు హిందువులు ఆగ్రహావేశాలతో ఉన్నారని ఆ ఆగ్రహాలు బయటకు వెళ్లగక్కనీయండని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముస్లింలకు గుణపాఠం చెప్పాల్సిందేననే అర్థంలో స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి తన నివాసంలో జరిగిన పోలీసు ఉన్నత అధికారుల సమావేశంలో చెప్పాడని సంజీవ్‌ భట్‌ అనే సీనియర్‌ పోలీసు అధికారి సుప్రీంకోర్టుకు తెలియచేశాడు. ఆ సమావేశంలో తాను కూడా ఉ

ముస్లిం మహిళ వేళ్ళు నరికేసి ఆమె కొడుకు చేతులు విరగ్గొట్టిన భజరంగ్ దళ్ మూకలు !

గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఓ వృద్ధ ముస్లిం మహిళ, ఆమె కొడుకుపై భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దుర్మార్గంగా దాడి చేశారు. మహిళ చేతి వేళ్ళను నరికేసిన భజరంగ్ దళ్ ముష్కరులు ఆమె కొడుకు చేతులను విరగొట్టారు.

ʹNot Joining Congress, But Aim To Bring BJP Down,ʹ Says Gujarat Dalit Leader Jignesh Mevani

The 36-year-old lawyer and activist, who has led protests in Gujarat against attacks on Dalits after four men were stripped and brutally thrashed with iron rods by cow vigilantes in the stateʹs Una last year, declined an invitation to meet Congress president Rahul Gandhi in Ahmedabad today....

షరతులు విధిస్తూ రైతులపై కేసు ఉపసంహరించుకున్న పెప్సికో....ఇక పోరాటం ఆపేద్దామా !

రాబోయే కాలాన మన భూములమీదా, మన పంటల మీదా, మన భూగర్భ జలాల మీదా ఆఖరికి మనం ఎలా, ఏది తినాలి అనే విషయం మీదా ఆ కంపెనీ ఆధిపత్యాన్ని ఆపగలగాలా వద్దా? అంటే బ్యాన్ పెప్సీ, బ్యాన్ లేస్ అనేది తాత్కాలిక నినాదంగా ఆగిపోకూడదు.

ఓ ఆదివాసీని కొట్టి చంపారు..ప్రశ్నించిన వారిపై కాల్పులు జరిపి మరొకరిని చంపేశారు

గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా జేసావాడా పట్టణ పోలీసు స్టేషన్ లో కమేశ్ గమారా అనే ఆదివాసీని పోలీసులు కొట్టి చంపారు. దీనిని ప్రశ్నించడానికి వచ్చిన 500 మంది ఆదివాసులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామాసు మొహానియా అనే అదివాసీ ప్రాణాలు కోల్పోయాడు.

కులాంతర పెండ్లిళ్ళు, సెల్ ఫోన్లు బ్యాన్... స్త్రీలపై 12 గ్రామాల తీర్మానం, మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్లు ఈ నెల (జూలై, 2019) 14 న సమావేశమయ్యారు. ఠాకూర్లు అంటే ఆ కులపు స్త్రీ పురుషులందరూ కాదు మగోళ్ళు మాత్రమే అన్ని గ్రామాల్లోని 800 మంది మగోళ్ళు సమావేశమయ్యారు. సమాజం మనువు చెప్పినట్టు నడవ‌డం లేదని గుండెలు బాదుకున్నారు. పిల్లలు మన చేతుల్లో లేకుండా పోతున్నారని, మగ పిల్లలు ఎలా ఉన్నా పర్వా

Search Engine

అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
more..


శిక్ష