యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో


యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో

యుపి

ఎన్నికైన ప్రభుత్వం చట్టాలను రూపొందించడం ద్వారా తన స్వంత పౌరుల స్వేచ్ఛను ఎలా హరించగలదో, రాజ్యాంగ వ్యవస్థలో "చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రక్రియ" తోనే ఒక రాష్ట్రాన్ని నిరంకుశ రాజ్యంగా ఎలా మార్చవచ్చు అనే దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ "ఉత్తర ప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం చట్టం- 2020 "

విశేషమేమిటంటే, ముఖ్యమంత్రి ʹకలగన్న ప్రాజెక్ట్‌ʹ గా ప్రచారం చేసి, 2020 జూన్ 26 న ప్రకటించిన ఈ ఆర్డినెన్స్ ʹఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ʹ (యుపిఎస్ఎస్ఎఫ్) చట్టంగా, శాసనసభ ఆమోదించిన తరువాత 2020 ఆగస్టు 6 నుండి అమల్లోకి వచ్చింది.

మూడు నెలల్లో ఈ బలగాన్ని ఉనికిలోకి తీసుకురావాలని ఉత్తర ప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించడం గమనార్హం. ప్రారంభంలో 9,900 మంది పోలీసు సిబ్బందితో 8 బెటాలియన్లు ఏర్పడతాయి. ADG ర్యాంక్ పోలీసు అధికారి కమాండింగ్ ఆఫీసర్ గా ఉంటారు, లక్నోలో ప్రధాన కార్యాలయం ఉంటుంది.

ఈ చట్టంలో వున్న నిబంధనలను పరిశీలిస్తే, ఈ ప్రత్యేక పోలీసు బలగం జవాబుదారీతనం లేకుండా అసాధారణమైన అధికారాలను కలిగి ఉంటుందని, నేర న్యాయ పరిపాలన అంగీకరించిన సూత్రాలకు విరుద్ధంగా వుండి పౌరులకు న్యాయ సేవలు అందవనీ తెలుస్తుంది. ఆసక్తికరంగా, ఈ ʹఎలైట్ పోలీస్ ఫోర్స్ʹ ఏర్పాటుకు సంబంధించిన ఈ చట్టాన్ని అమలు చేయడాన్ని సమర్థించుకోటానికి రాష్ట్ర ప్రభుత్వం ʹబిజ్నోర్ జిల్లా కోర్టులో కాల్పులుʹ కేసులో 2019 డిసెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును కవచంగా చేసుకొంది.

బిజ్నోర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన అనేక నేరాలు, కాల్పుల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కోర్టుల భద్రతను కఠినతరం చేయాలని, న్యాయవాదుల ఐడి కార్డులు, సిసిటివి కెమెరాలు, వ్యాజ్యాల కదలికల రికార్డు మొదలైనవాటిపైన సక్రమంగా నిఘా వహించడానికి ప్రత్యేక శిక్షణ కలిగిన ప్రత్యేక దళాలను అందుబాటులో ఉంచాలి అని ఈ ఉత్తర్వులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టు తన ఆదేశంలో ʹప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా దళంʹ అవసరమని పేర్కొంది తప్ప ʹప్రత్యేక భద్రతా పోలీసు దళంʹ అని కాదని గమనించడం అవసరం.

వాస్తవానికి, ఇది ఆ ఉత్తర్వుని ఏకపక్ష వ్యాఖ్యానం చేయడమే అవుతుంది. ఇలాంటి చట్టాన్ని రూపొందించడం అంటే రాజ్యాంగ సూత్రాలను గాలికొదిలేసి పౌరులకుండే న్యాయ సేవల హక్కును అంతం చేసే కుటిల యత్నమే. మరో మాటలో చెప్పాలంటే, పోలీసు బలగంలో ʹక్రాట్ స్టేట్ పోలీస్ʹ లేదా నాజీ జర్మనీలో వుండిన ʹగెస్టపోʹ వంటి బలగాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యానికి ఈ చట్టం అనుమతినిస్తుంది.

ఈ చట్టంలో మొత్తం 19 సెక్షన్లు ఉన్నాయి; సెక్షన్ 17 చట్టం లోని నిబంధనలను అమలు చేయడానికి, నియమాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తే, ఆ నిబంధనలను అమలు చేయడంలో తలెత్తే ఇబ్బందులను తొలగించడానికి ఆదేశాన్ని జారీ చేసే అధికారాన్ని సెక్షన్ 18 ఇస్తుంది.

10, 11 సెక్షన్లు మేజిస్ట్రేట్ ఆదేశాలు లేదా వారెంట్ లేకుండానే అరెస్టు, సెర్చ్ చేసే అధికారాన్నిస్తాయి. మరోవైపు, సెక్షన్ 15 ఈ బలగం సభ్యులపై సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడాన్నుంచి రక్షిస్తే, సెక్షన్ 16, ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా కోర్టు ఈ బలగం సభ్యులపై చర్యలు తీసుకోవడంపై ఆంక్షలు విధిస్తుంది.

చట్టంలోని లక్ష్య నిబంధనను పరిశీలిస్తే, ఈ బలగం ఏర్పాటు హైకోర్టు, జిల్లా కోర్టు పరిసరాలు, పరిపాలనా భవనాలు రాజ్యాంగ సంస్థల, పారిశ్రామిక యూనిట్లు, వాణిజ్య, బ్యాంకింగ్ లాంటి సంస్థలు, గుర్తించిన ప్రముఖ వ్యక్తుల రక్షణ కోసం ఉద్దేశించినదని వెంటనే అనిపిస్తుంది. ఇలాంటి సున్నితమైన పనులనుంచి విముక్తి చేసి యుపి పోలీసులు, పిఎసి దళాలను శాంతిభద్రతల నియంత్రణ కోసం నియమించవచ్చు. సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఒరిస్సా, మహారాష్ట్రలలోని ప్రత్యేక పారిశ్రామిక భద్రతా దళాల తరహాలో ఈ బలగాలు ఏర్పడబోతున్నాయి.

కానీ ఈ చట్టంలో వున్న అనేక నిబంధనలు పైన చెప్పిన వాటి కంటే భిన్నంగా వున్నాయి. సెక్షన్ 7 ప్రకారం, వారు ప్రభుత్వ సంస్థలు, కోర్టు కాంప్లెక్సులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక, వాణిజ్య భవనాల భద్రత కోసం మాత్రమే కాకుండా, డిజిపి అనుమతి తీసుకుని, తగిన ఫీజు చెల్లిస్తే కనక ప్రైవేట్ వ్యక్తులను, వారి నివాస ప్రాంగణాలను, ప్రైవేట్ సంస్థలను రక్షించడానికి కూడా నియమించబడతారు.

సిఐఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగంలో, అరెస్టు, సోదా చేసే అధికారం నిర్దిష్ట ర్యాంకు ఉన్న అధికారికీ మాత్రమే వుంటుంది, కానీ యుపిఎస్ఎస్ఎఫ్ సభ్యులందరికీ వారి ర్యాంకుతో సంబంధం లేకుండా ఈ అధికారం ఇవ్వబడింది. దేశవ్యాప్తంగా 246 బెటాలియన్లను కలిగి ఉన్న సిఆర్పిఎఫ్ వంటి పారామిలిటరీ దళాలు, పార్లమెంట్ భవన సముదాయం, ఉన్నత న్యాయవ్యవస్థ ప్రాంగణం వంటి కీలక ప్రాంతాలను రక్షించడంలో, పాకిస్తాన్, చైనా సరిహద్దులను రక్షించడంలో నిమగ్నమయ్యే దళాలకు సహాయపడే పాత్ర పోషిస్తున్న వారికి కూడా వారెంట్ లేకుండా సోదా లేదా అరెస్ట్ చేసే అధికారం లేదు.

ఈ విధంగా, యుపిఎస్ఎస్ఎఫ్ లో వుండే ప్రతి సభ్యునికి ఎటువంటి జవాబుదారీతనం లేకుండా యిష్టం వచ్చినట్లుగా ఎవరినైనా గాయపరిచే, గుర్తించదగిన నేరానికి పాల్పడవచ్చనే అనుమానం మీద, మేజిస్ట్రేట్ ఉత్తర్వు లేదా వారెంట్ లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్టు చేసే, సోదా చేసే లేదా నిర్బంధంలోకి తీసుకొనే అధికారాన్ని చట్టంలోని 10-11 సెక్షన్లు ఇచ్చాయి.

ఆ సమయంలో అరెస్టు, సోదా, నిర్బంధాన్ని నిర్ణయించే ఏకైక అధికారం బలగంలో ప్రతి సభ్యుడికి వుంటుంది. ఇదంతా అతని వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ చట్టంలో అత్యంత ఆశ్చర్యకరమైన నిబంధన ఏమిటంటే, యుపిఎస్ఎస్ఎఫ్ సభ్యుడు అధిక శక్తిని అంటే అవసరానికి మించి తన అధికారాన్ని ఉపయోగించినప్పటికీ, గోప్యత హక్కును ఉల్లంఘించినప్పటికీ లేదా మరొకరికి హాని కలిగించినప్పటికీ కూడా అతను చేసిన సివిల్ లేదా క్రిమినల్ చర్యకు సంబంధించి ఏ కోర్టులోనూ విచారణ జరగకూడదు.

రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కూడా ఈ సభ్యులపై నేరాలను ఏ న్యాయస్థానం తీసుకోదు (చట్టంలోని 16-17 సెక్షన్లు). ఇటువంటి అసాధారణమైన శక్తి, మినహాయింపు CISF, CRPF కి కూడా లేవు. CISF లోని ఒక సభ్యుడిపై ప్రాసిక్యూషన్ నిర్వహించడానికి సమర్థుడైన ఉన్నత అధికారి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది.

అదే సమయంలో, ఈ రాష్ట్ర స్థాయి పోలీసు బలగాలకు సంబంధించి అలాంటి నిబంధనలు ఏవీ లేవు. ఈ విధంగా యుపిఎస్ఎస్ఎఫ్ క్రింద ఒక ప్రాంతీయ స్థాయి పోలీసు బలగాలకు ఇచ్చిన అసాధారణ అధికారాలు, శిక్షనుంచి తప్పించుకొనే అవకాశం కేంద్ర రక్షణా దళాల కంటే ఎక్కువగా వుంటుంది. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రంలోపల ʹరాష్ట్ర అధిష్టానాన్నిʹ సృష్టించడంతో సమానం.

చట్టాన్ని అమలు చేసే సంస్థను ఒక నకిలీ సైన్యంగా మార్చడానికి ఇది ఒక కుటిల ప్రయత్నం. ఈ బలగం ఎలాగూ ప్రజల రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది కానీ అందుకు ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. వాస్తవానికి, రాజ్యాంగంపై ఆధారపడి వున్న ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో, దేశంలో అత్యున్నత చట్టంగా భావించబడే రాజ్యాంగాన్ని విస్మరించే, అధికార వికేంద్రీకరణ ప్రాథమిక సూత్రాన్ని ధిక్కరించే ప్రయత్నం జరిగింది.

ఈ చట్టంలోని సెక్షన్ 18, ఈ నిబంధనను అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి, విషయాలను స్పష్టం చేయడానికి కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వు జారీ చేయవచ్చు. అయితే ఇదే సెక్షన్ లో చట్టం అమలు ప్రారంభమయిన 2 సంవత్సరాల వరకు ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయకూడదు అనే మరో నియమం కూడా వుంది.

ప్రస్తుత అధికార పార్టీని 2022 లో అధికారం నుండి తొలగించినప్పటికీ, కొత్తగా వచ్చే పార్టీ ప్రభుత్వం కూడా కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని ఇది సూచిస్తుంది. వాస్తవానికి, చట్టంలోని ఈ నిబంధన ప్రస్తుత ప్రభుత్వం యొక్క రహస్య ఉద్దేశ్యాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది.

ఇది కాకుండా, రాష్ట్ర పోలీసు దళానికి ఒక విభాగంగా ఏర్పడే ఈ ప్రత్యేక భద్రతా దళంలో సభ్యుల నియామకం, సేవా నిబంధనల నియంత్రణ సాధారణ పోలీసు అధికారయంత్రాంగం ద్వారా జరుగుతుందని, పోలీస్ యాక్ట్, 1861, ఉత్తర ప్రదేశ్ పోలీస్ రెగ్యులేషన్స్ చట్టాల క్రింద వాటిని అమలు చేస్తామని చట్టం అంతటా పదేపదే పునరుద్ఘాటించారు.

ఈ స్పెషల్ ఫోర్స్ యొక్క కమాండింగ్ ఆఫీసర్‌ను ఎడిజి ర్యాంకు అధికారిగా చేశారు, కానీ సాధారణ పోలీసు దళ సభ్యులను నియంత్రించడానికి జారీ చేసిన మార్గదర్శకాల ఆంక్షల నుండి మినహాయింపు ఉంది. ఈ విధంగా ఇది చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం, పద్ధతుల సమాన రక్షణ అనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా వుంది.

యుపిఎస్‌ఎస్‌ఎఫ్ చట్టం 2020 లోని నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన నేర చట్టం సూత్రాలను అవహేళన చేస్తున్నాయి. ఈ బలగం సభ్యులచే అరెస్టు చేయబడిన వ్యక్తి గురించి, ఎక్కడ అరెస్టు చేశారు, ప్రస్తుతం ఎక్కడ వున్నాడు లాంటి సమాచారాన్ని ఆ వ్యక్తి బంధువులకు తెలియచేయాల్సిన బాద్యత గురించి ఏమీ చెప్పలేదు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22 ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తులు / ఖైదీలకు వున్న ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎలాగూ జరిగింది. దాంతో పాటు అరెస్టు చేసిన వ్యక్తుల హక్కులను ప్రస్తావించే సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు, సిఆర్‌పిసి సెక్షన్ 50 - అరెస్టు చేసిన వ్యక్తి అరెస్ట్ కు కారణాలు, బెయిల్ తీసుకునే హక్కు వుందని తెలియచేయడం, సెక్షన్ 50 ఎ- అరెస్టు చేసిన వ్యక్తి బంధువుకు లేదా సూచించినవారికి సమాచారం యివ్వాల్సిన బాధ్యత, సెక్షన్ 57-అరెస్టు చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటలకు మించి అదుపులో వుంచుకోకూడదు అనే నియమాల బహిరంగ ఉల్లంఘన జరిగింది.

అలాగే, ఒక వ్యక్తి అరెస్టును కోర్టు పరిశీలనాపరిధికి బయట ఉంచడం ఆ వ్యక్తికి న్యాయ సేవను నిరాకరించడంతో సమానం. ఈ చట్టంలోని సెక్షన్ 7 – ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల రక్షణ కోసం రుసుము వసూలు చేసి డిజిపి తన యిష్టమొచ్చినట్లు బలగాల నియమించే అధికారానికి చట్ట బద్ధ ప్రామాణికత నివ్వడం అనేది ఈ బలగాల్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏకపక్షంగా ఉపయోగించుకునే అవకాశాన్ని బలోపేతం చేస్తుంది.

తన పౌరులందరి భద్రత, సంక్షేమాన్ని ఆశించడం కాక ప్రజా సంక్షేమ రాజ్యం అనే భావనకు వ్యతిరేకంగా ధనవంతులు, పీడకులకు అనుకూలంగా రాజ్యం మొగ్గు చూపుతుంది. ఇది భారత రాజ్యాంగ పథకానికిగానికి విరుద్ధం.

ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయటానికి రూపొందించిన, దానిని సమర్థించటానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రాతిపదికగా రూపొందించబడిన ఈ చట్టం వాస్తవానికి సామాన్యుల కళ్ళలో దుమ్ము కొట్టే ప్రయత్నం.

వాస్తవానికి, హైకోర్టు ఉత్తర్వులో కోర్టు ప్రాంగణంలో భద్రత పరిరక్షణలో నిమగ్నమైన పోలీసులకు ప్రత్యేక శిక్షణ, అప్రమత్తత అవసరం అని వున్నది. కానీ ఆ ముసుగులో అధికార పార్టీ తన రహస్య‌ ఎజెండాను అమలు చేయడానికి కఠినమైన చట్టాన్ని, జవాబ్దారీ లేని పోలీసు శక్తిని సృష్టించే మార్గాన్ని ఎన్నుకొంది.

భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం తన విధానాలతో సమాజంలో ఉన్న సామాజిక, ఆర్ధిక వ్యత్యాసాలను పరిష్కరిస్తుందని, సమాజంలో పరస్పర సౌహార్దృత్వాన్ని పెంచుతుందని, నేరాలను తగ్గిస్తుందని ఆశిస్తాం, కాని ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా కఠినమైన చట్టాలను రూపొందించే ఏ రాజ్యమైనా న్యాయమైన సమాజాన్ని ఎలా నిర్మించగలదు?

ఇప్పటికే ఖజానా ఖాళీ అయిపోయి, కరోనా కాలంలో తన పౌరుల ప్రయోజనాల కోసం మెరుగైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఇటువంటి ʹఎలైట్ ఫోర్స్ʹ ఏర్పాటు చేయడాన్ని, అందుకు సుమారు 18 వేల కోట్ల పెట్టుబడి పెట్టడాన్ని ఏ దృష్టితో చూసినా ప్రజా ప్రయోజనం కోసం అని చెప్పలేము.

ఇప్పటికే ఉన్న పోలీస్ బలగం, ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (పిఎసి) లో ఉన్న ఖాళీల నియామకాన్ని పూర్తి చేయడం, వారిని అధిక శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతో సన్నద్ధం చేయడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచవచ్చు. కోర్టు ప్రాంగణాల రక్షణ కోసం సిబి సిఐడి, ఎస్‌టిఎఫ్, ఎటిఎస్, వాటర్ పోలీస్, అవినీతి నిరోధక సంస్థ, ఆర్థిక నేరాల విభాగం లాంటి ప్రత్యేక భద్రతా విభాగాన్ని మంచి శిక్షణ పొందిన, సమర్థవంతమైన విభాగాన్ని ప్రస్తుతం వున్న పోలీసు బలగాల క్రిందనే నిర్మించవచ్చు.

యుపి పోలీసు శాఖ ఎదుర్కొంటున్న సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల కొరత, కొద్దిపాటి బడ్జెట్ మద్దతులాంటి సమస్యలను తొలగించకుండా ఖజానాపై అదనపు బరువు పెట్టడం ఏ మాత్రం సరైనది కాదు. ఇది మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ లో పోలీసు- జనాభా నిష్పత్తి కూడా అతి తక్కువ - లక్ష జనాభాకు 71 మంది పోలీసులు ఉండగా, జాతీయ స్థాయిలో లక్ష జనాభాకు 133 మంది పోలీసులు ఉన్నారు.

అదే సమయంలో, లక్ష జనాభాకు 222 పోలీసులుండాలని UNO ప్రమాణీకరించింది. ప్రాంతాన్ని బట్టి చూస్తే 100 చదరపు కిలోమీటర్లకు 59 మంది పోలీసులు వుండాలి. ఈ సంఖ్య కూడా చాలా తక్కువే. ఇంతే కాకుండా, ʹప్రకాష్ సింగ్ʹ కేసులో, పోలీసు బలగాలను అత్యంత సమర్థులుగా, ప్రజాహితులుగా చేయడానికి సుప్రీంకోర్టు జారీ చేసిన ఏడు అంశాల మార్గదర్శకాన్ని, ఈ రోజు వరకు యుపితో సహా ఏ రాష్ట్రమూ సరిగా అమలు చేయలేదు.

UAPA, NSA, దేశద్రోహ చట్టం వంటి చట్టాలు తమతో భిన్నాభిప్రాయాలున్న పౌరులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉపయోగిస్తున్న సందర్భంలో దేశ విదేశాల్లో న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, సమాజంలోని ఇతర ప్రముఖులలో ఆందోళన వ్యక్తమవుతోంది; జవాబుదారీతనం లేకుండా అసాధారణమైన అధికారాలతో ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయడంలో వున్న రాజ్య ఉద్దేశంపై సందేహాన్ని కలిగిస్తోంది.

ఇది మాత్రమే కాదు, ఈ చట్టం గురించి రాష్ట్ర శాసనసభలో సరిగా చర్చ జరగలేదు, ప్రతిపక్షాలు అధికంగా ఉన్న శాసనమండలి వంటి సభను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా ఆతృతతో ఆమోదించింది.

ఎన్నికైన ప్రభుత్వం తన మెజారిటీ బలం మీద ప్రజా వ్యతిరేక, అనవసరమైన చట్టాలను ఎలా అమలు చేయగలదో ఇవన్నీ చూపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ రోజుల్లో కనిపిస్తున్న నియంతృత్వ దశ, చట్ట పాలన పట్ల వున్న నిర్లక్ష్య భావనను తెలియచేస్తోంది. ఇందులో అంతిమంగా ఏమాత్రం రాజ్యాంగ, ప్రజాస్వామ్య ప్రయోజనాలు ఉండవు. సంక్షిప్తంగా చెప్పాలంటే, యుపిఎస్ఎస్ఎస్ఎఫ్, యుపి పోలీసుల నినాదం "మీ భద్రత, మా సంకల్పం" ను "మీ ప్రమాదం, మా సంకల్పం" గా మారుస్తుంది.

వ్యాసకర్త రమేష్ యాదవ్ అలహాబాద్ హైకోర్టులో ప్రముఖ‌ న్యాయవాది
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : uttarapradesh, yogi adityanath, upssf,gestapos,
(2021-07-29 14:46:35)No. of visitors : 415

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

ప్రతి మనిషి జేబులో పోలీసు!
బాలికలపై సామూహిక అత్యాచారం - బాధితులదే తప్పన్న గోవా ముఖ్యమంత్రి
kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI
పెగసస్ వ్యవహారం: పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరగకుండా అడ్డుకున్న‌ బీజేపీ
చరిత్రాకాశంలో ధ్రువనక్షత్రం
Learn From Charu Mazumdar! -Communist Workers Front, Canada
ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI
Naxalbari: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
పోలీసుల దుర్మార్గం - యువకుడి ఆత్మహత్య‌
సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !
ఢిల్లీలో సోమవారం మహిళా రైతుల ప్రదర్శన‌
UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు
పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు సహాయం చేయండి -మావోయిస్టు పార్టీ పిలుపు
భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు
దేశ రాజధానిలో రేపు రైతు పార్లమెంటు - అనుమతి ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం
మోడీని విమర్షించినందుకు జర్నలిస్టును ఉద్యోగం నుండి తీసేసిన టీవీ ఛానల్
రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!
అమ్రాబాద్ చెంచులపై ఫారెస్టు అధికారుల దాడులు - పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ‌
UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి
ఒక వైపు ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు... మరో వైపు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు
ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటన‌
more..


యుపి