ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు


ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు

ఇద్దరు

ఈ ఏడాది జూలైలో హర్యాణా లోని సోనిపత్ లోని పోలీసు పోస్టు లో ఇద్దరు దళిత బాలికలపై డజను మంది సిబ్బంది అత్యాచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ విషయంపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ చండీగఢ్ కు చెందిన బేఖాఫ్ ఆజాది (భయం లేని స్వేచ్చ‌) గ్రూప్ నిజనిర్ధారణ రిపోర్టును అక్టోబర్ 27నాడు విడుదల చేసింది. చండీగఢ్లో ఈ నిజనిర్ధారణ రిపోర్టు విడుదల కార్యక్రమానికి గ్రూప్ కన్వీనర్ అర్పణ్, బాధిత ఇద్దరు అమ్మాయిల తల్లులు హాజరయ్యారు.

ఆ రిపోర్టు ప్రకారం, సామూహిక అత్యాచారం జరిగినప్పుడు బాలికలలో ఒకరికి 17 సంవత్సరాలు, మరో అమ్మాయికి 19 సంవత్సరాలు. జూన్ 30 రాత్రి సోనిపత్ జిల్లాలోని బుటానా గ్రామ సమీపంలో ఇద్దరు పోలీసుల హత్య జరిగిన కేసుతో వీరికి సంబంధముందని అదుపులోకి తీసుకున్నారు. జూలై 2 నాడు మైనర్ బాలికను బుటానా పోలీసు పోస్టుకు తీసుకువెళ్లారు.

ʹనేను జూలై 18 న జైలులో వున్న కూతురిని కలవడానికి వెళ్ళినప్పుడు, తామిద్దరిమీద 10-12 మంది పోలీసులు అత్యాచారం చేశారని చెప్పిందిʹ అని మైనర్ అమ్మాయి తల్లి తెలిపింది. ఆమె ఫిర్యాదుపై, ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇందులో ముగ్గురు పోలీసుల పేర్లు కూడా వున్నాయి.

జూన్ 30 రాత్రి బుటానా పోలీసు పోస్టుకు చెందిన కానిస్టేబుల్ రవీందర్,ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) కప్తాన్ సింగ్ ల హత్య జరిగింది. నిజనిర్ధారణ రిపోర్టు ప్రకారం, ʹఆ రాత్రి ఇద్దరు బాలికలు జింద్ నుండి సోనిపత్ కు తమను కలవడానికి వచ్చిన నలుగురు పురుషులను కలవడానికి వెళ్ళారు. వీళ్ళు ఆరుగురు హర్యాలి పార్క్ వద్ద వున్నప్పుడు అర్ధ రాత్రి పెట్రోలింగ్ డ్యూటీ ఉన్న ఇద్దరు అధికారులు వారిని చూశారు.
ʹబాలికలలో ఒకరు అమిత్‌తో కలిసి కారులో ఉండగా, మిగిలినవాళ్లు దూరంగా నిలబడ్డారు. అర్ధరాత్రి కారులో జంటగా కనిపించారనే నెపంతో పోలీసు అధికారులు వారి నుండి డబ్బును వసూలు చేయడానికి ప్రయత్నించారు. డబ్బు యివ్వ నిరాకరించడంతో అమిత్‌ని ఆ అమ్మాయిని తమతో పోలీస్‌స్టేషన్‌కు పంపమని అడిగారు … తీవ్ర వాగ్వివాదం జరిగిన తరువాత, తన దగ్గర వున్న కత్తితో అమిత్ పొడవడంతో ఆ పోలీసు అధికారులు అక్కడికక్కడే చనిపోయారు ʹఅని నిజనిర్ధారణ రిపోర్టు పేర్కొంది.

అయితే, అమిత్, ఆ బాలిక "అత్యంత సన్నిహిత స్థితిలో ఉన్నారని, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారని; ప్రశ్నించిన పోలీసు సిబ్బందిని దారుణంగా పొడిచి చంపారు.ʹ అని పోలీసులు అంటున్నారు.

తరువాత జింద్‌లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో అమిత్ మృతి చెందాడు.

నిజనిర్ధారణ రిపోర్టు ప్రకారం, ʹవారు ఆ రాత్రి అమిత్‌తో కలిసి ఉన్నారు తప్ప హత్యతో ఎలాంటి ప్రమేయం లేదని తెలిసిన తల్లి తన మైనర్ కూతురిని, బంధువుల అమ్మాయిని బుటానా పోలీసు పోస్టుకు విషయం వివరించడానికి తీసుకువెళ్ళిందిʹ

"జూలై 2 న, పోలీసు పోస్టులో అమ్మాయిలతో పాటు వున్న తల్లిని మర్నాడు వెళ్లిపొమ్మన్నారు. చౌకి దగ్గర ఉన్నప్పుడు తల్లిని కూడా వేధించారు, చెంపదెబ్బ కొట్టారు. మరుసటి రోజు, బాలికల కుటుంబానికి చెందిన ఎవరినీ చౌకి వద్దకు రావడానికి అనుమతించలేదు. 10-12 మంది పోలీసు అధికారులు బాలికలపై అత్యాచారం చేశారు, శారీరకంగా వేధించారు, యోనిలో చొప్పించడానికి వస్తువులను ఉపయోగించారు అని మైనర్ బాలిక చెప్పింది. బాలికలపై కులపర, అసభ్యకరమైన భాషను కూడా ఉపయోగించారు.

మరో బాలిక దుస్తులను తీసేసి, ఆమెపై కూడా దారుణంగా దాడి చేశారు. జూలై 4, 5 తేదీలలో బరోడా పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇద్దరు బాలికలను రిమాండ్లోకి తీసుకున్నారు. ఈ దారుణమైన చర్యలు, లైంగిక వేధింపులు పోలీస్ స్టేషన్లో కూడా కొనసాగాయి ʹఅని మహిళా కార్యకర్తలు, న్యాయవాదులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ఈ విషయం దర్యాప్తు చేసిన తరువాత తయారుచేసిన ʹబేఖాఫ్ ఆజాదిʹ రిపోర్టు పేర్కొంది.

జూలై 6 న ఇద్దరినీ కర్నాల్ జైలుకు పంపారు. జూలై 15 న కర్నాల్ జైలులో తల్లి కలవడానికి ప్రయత్నించినప్పుడు అనుమతి దొరకలేదు. జైలుకు తీసుకువచ్చినప్పటి నుండి ఆమె కుమార్తెకు నిరంతరం రక్తస్రావం అవుతోందని జైలు అధికారులు తల్లికి తెలియచేశారు. జూలై 18 న కలవగలిగినప్పుడు, బుటానా పోలీస్ చౌకి, బరోడా పోలీస్ స్టేషన్లలో జరిగిన ఘటనల గురించి బాధితురాలు తన తల్లికి చెప్పింది. అదే రోజు, తల్లి బరోడా పోలీస్ స్టేషన్ SHO కి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చింది. కానీ ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టుకు ఫిర్యాదు చేసిందిʹ అని రిపోర్టు పేర్కొంది.

లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, సెక్షన్ 376 (2) (ఎ), ఐపిసిలోని 376-డి సెక్షన్ 6 కిందజూలై 30 న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న నిందితుల్లో ఒకరు ఖాళీ కాగితాలపై సంతకం పెట్టడానికి నిరాకరించిన బాధితుల కుటుంబ సభ్యులను బెదిరించడానికి ప్రయత్నించారని రిపోర్టు పేర్కొంది. బాలికల కస్టడీ సమయంలో ఒక మహిళా పోలీసు అధికారి నిరంతరం వారితో వున్నారని, అయితే ఆమెను ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ నుండి బదిలీ చేశారని రిపోర్టులో తెలిపారు.

మరోవైపు, సోనిపత్ ఎస్పీ ʹబాలికలను అరెస్ట్ చేసే సమయంలో, వారిని వైద్యులు వైద్యపరంగా పరీక్షించారు. కోర్టులో వారు హాజరైన సమయంలో, వారు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినప్పుడు, వైద్యులు మళ్లీ పరీక్షించినప్పుడు కూడా ఏమీ ఫిర్యాదు చేయలేదు. జ్యుడీషియల్ కస్టడీలో 10 రోజుల తరువాత, వారిని మళ్లీ వైద్యపరంగా పరీక్షించారు, కాని వారు అప్పుడు కూడా అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అరెస్టు అయిన రెండు వారాల తర్వాతే వారు ఈ ఫిర్యాదు ఇచ్చారు. మేము ఈ విషయాన్ని అన్ని కోణాల నుండి పరిశీలిస్తున్నాముʹ అని అన్నాడు.

ఏదేమైనా, కర్నాల్ జైలులో బాలికలతో బ్యారక్ లో ఉన్న ఒక మహిళ విడుదలైన తరువాత మైనర్ బాలిక కుటుంబ సభ్యులను కలిసి "బాలికలు తీవ్రంగా గాయపడ్డారని, వారికి తక్షణ వైద్య సహాయం అవసరమని చెప్పింది. వైద్య పరీక్షల ప్రక్రియకు సంబంధించి సందేహాన్ని ప్రకటిస్తూ, ʹలైంగిక హింసకు పాల్పడిన వారి పర్యవేక్షణలో మొదటి వైద్య పరీక్షను నిర్వహించారు, నిందితులైన పోలీసు అధికారుల సమక్షంలో నిర్వహించిన వైద్య పరీక్ష రిపోర్టు సరైనదిగా వుండే అవకాశం లేదు అని భావించాలి. వైద్య పరీక్షల రిపోర్టులు బాధితుల న్యాయవాదులకు ఇంతవరకు ఇవ్వలేదనే విషయాన్ని కూడా గమనించాలిʹ అని రిపోర్టు పేర్కొంది.

ʹబాధితులకు జైలు లోపల భద్రత కల్పించడమే కాకుండా, తక్షణ వైద్య చికిత్స అందించాలి. వారి వైద్య పరీక్షను, న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్ లేదా, చండీ గఢ్ లోని పిజిఐ ఆసుపత్రిలో తక్షణమే చేయించాలి.

జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ఈ విషయంపై తమ స్వతంత్ర విచారణను నిర్వహించాలి. లైంగిక హింసకు పాల్పడిన వారందరినీ ఐపిసి, ఎస్సీ మరియు ఎస్టీ (అత్యాచారాల నివారణ చట్టం), 1989 లోని సంబంధిత సెక్షన్ల కింద విచారించాలి" అని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

కాగా ఈ అంశంపై దర్యాప్తు కోసం హర్యానా పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపిఎస్ అధికారి దర్యాప్తు చేసిన తరువాత, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విచారణకు సిఫారసు చేసారు. సోనిపత్ ఎఎస్‌పి నికితా నేతృత్వంలోని సిట్ దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ జషన్‌దీప్ సింగ్ రాంధవా మంగళవారం (అక్టోబర్ 27) నాడు తెలిపారు.

Keywords : haryana, sonipath, police gang rape on dalit girls, Woman IPS officer-led SIT to probe allegations of gangrape by a dozen cops in custody
(2020-12-03 17:07:58)No. of visitors : 301

Suggested Posts


రేపిస్టు బాబాకు బీజేపీ ఎందుకు మద్దతుగా నిలబడింది ?

18 మంది స్త్రీలపై అత్యాచారం చేశాడని, 400 మందిని నపుంసకులుగా మార్చాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఇతని బండారాన్ని బైటపెట్టిన జర్నలిస్టు హత్య, సాద్వి రేప్ కేసులో ప్రత్యక్ష సాక్షి రంజిత్ సింగ్ హత్య... రాజకీయ పార్టీలకు ఓట్లు కురిపించగల ఓట్లధేనువు... ప్రభుత్వాల మద్దతుతో భీభత్సం సృష్టించగల శక్తి యుక్తులున్నవాడు గుర్మిత్ రాంరహీమ్ బాబా....

పంచకులలో డేరాల హింసకు బీజేపీ ప్రభుత్వమద్దతు ఉంది... హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

రేప్ బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ కు మద్దతుగా నిల్చిన బీజేపీనే ఈ హింసకు మద్దతుగా నిల్చిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ హర్యాణా హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. హింసకు ప్రభుత్వమే మద్దతుగా నిల్చిందని కడిగిపడేసింది.

అంత గొప్ప రేపిస్టుకు శిక్ష వేయడం భారత సంస్కృతిని అపఖ్యాతి పర్చే కుట్రేనట‌ !

రేప్ ల బాబా గుర్మిత్ రామ్ రహీం సింగ్ పై తమకున్న అభిమానాన్ని బహిరంగంగానే చాటాడు. పైగా కోర్టులనే తప్పుబట్టాడు. ʹ గుర్మిత్ సింగ్ ను కోట్లాది మంది ప్రజలు, అనుచరులు అనుసరుస్తున్నారు, గుర్మిత్ గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిపై కోర్టులు తీర్పులు వెలువరించడం భారతీయ సంస్కృతిని అపఖ్యాతి పర్చే కుట్రʹ అని ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు.....

ʹGet out!ʹ Haryana Sports Minister Anil Vij tells woman IPS officer, she stays put

Locked in an argument over liquor smuggling, the Haryana Health and Sports Minister Anil Vij on Friday shouted at a senior woman police officer and ordered her to ʹget outʹ of a meeting

ʹసంఘ్ʹ మంత్రి ఉవాచ‌...డేరాల హింస అతిసహజమైనదట !

పంచకుల తగలబెట్టిన, అనేక మంది మరణానికి కారణమైన , పేదల చిన్న వ్యాపారుల కోట్లాది రూపాయల ఆస్తులను తగలబెట్టిన, రెండు రాష్ట్రాల్లో దుర్మార్గమైన హింసకు పాల్పడిన రేపులబాబా అనుచరుల స్పందన అతి సహజమైనదట...

న్యాయం అడిగినందుకు15 మంది దళితులపై రాజద్రోహం కేసు!

అక్రమంగా అరెస్టు చేసిన తమ వారిని విడుదల చేయాలని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులతో సహా 15 మంది దళితులపై రాజద్రోహం కేసు బనాయించింది హర్యాణా ప్రభుత్వం. తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిసిన రెండురోజులకే ఆ దళితులపై రాజద్రోహం కేసు మోపారు....

గో సంరక్షణ పేరుతో హరియాణాలో అరాచకం - అమాయకులపై దాడి చేసిన కాశాయ మూక‌

హర్యాణ రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో ఇస్సాన్ మహ్మద్, షాహజాద్, షకీల్, ఆజాద్ మహ్మద్ అనే నలుగురు ఆటోలో వెళ్తుండగా చేతుల్లో కర్రలు, రాడ్ లు పట్టుకున్న ఓ 20 మంది గుంపు ఆటోను ఆపి ఆనలుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. గో మాంసం తీసుకువెళుతున్నారన్న....

నేపాలీల్లా ఉన్నారని భారతీయులకు పాస్ పోర్ట్ నిరాకరించిన అధికారులు

పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక(NRC) తదితర అంశాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, హర్యాణాలో ఇద్దరు అమ్మాయిలు, తమ జాతీయతను నిరూపించుకోవాలంటూ,

Search Engine

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !
రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌
20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం
రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
more..


ఇద్దరు