నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?


నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?

నా

ఇజ్రావెల్ మోసెస్ తమిళనాడులో తమిజన్ టివి కోసం రిపోర్టుగా పని చేస్తాడు. తొమ్మిదేళ్ల క్రితం, కేవలం 20 ఏళ్ళ ప్రాయంలో, ఇస్రావెల్ మోసెస్ తన సొంత గ్రామం నల్లూరు, చెన్నై శివారు ప్రాంతమైన కుంద్రాథుర్‌తో సహా, కాంచీపురం జిల్లాలోని కొన్ని గ్రామాలకు ఏరియా రిపోర్టర్‌గా తమిజన్ టివి కార్యాలయంలోకి అడుగుపెట్టారు.

మోసేస్ ను ఒక తెలివైన, కష్టపడి పనిచేసే వ్యక్తిగా చీఫ్ రిపోర్టర్ సహయా రాజ్ గుర్తు చేసుకున్నారు., గంజాయి పంపిణీ, అమ్మకం, పోరంబోకు భూములను అక్రమంగా ఆక్రమించుకోవడంపై చేసిన కథనాల వల్లనే మోసెస్ ను నవంబర్ 8 రాత్రి మాదక ద్రవ్యాల డీలర్లు హత్య చేసారు.

"అతను ఖచ్చితంగా తెలివైన విలేఖరులలో ఒకడు. మోసెస్ స్థానిక సమస్యల గురించి, తన గ్రామం, ఇతర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నʹనిజమైన సమస్యలʹగురించి చాలా ఆసక్తి చూపించేవాడు. మా విలేకరులకు యిచ్చే అంతర్గత పురస్కారాన్ని అంతకు ముందు సంవత్సరం అతను గెలుచుకున్నాడు. రిపోర్టర్‌గా మోసెస్ ఎంతో ఉత్సాహంగా వుండేవాడు. అతను నిలకడైన మనిషి. గత సంవత్సరంలో, అతను గంజాయి పంపిణీ, అమ్మకం, భూముల ఆక్రమణపై అనేక కథనాలు చేశాడు. గత నెలలో కూడా, మోషే గంజాయిపై కథనాన్ని మరోసారి చేశాడు, కానీ పోలీసులు గంజాయి పంపిణీ, అమ్మకం దార్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ʹ అని సహయా రాజ్ చెప్పారు.

మోసెస్ తండ్రి జ్ఞానరాజ్ యేసుదాసన్ కూడా ఒక విలేఖరి, తన కుమారుడు తమ ప్రాంతంలోని ʹʹసంఘ వ్యతిరేక అంశాలనుʹ బహిర్గతం చేయడం వల్ల బెదిరింపులను ఎదుర్కొంటున్నాడు. చాలా మంది ప్రజలు అతనిని వెతుక్కుంటూ వచ్చేవారు, సమస్యను పరిష్కరించడంలో అతని సహాయం కోరేవారు. చాలా తరచుగా, మోసెస్ ప్రయత్నించి సమస్యలను పరిష్కరించేవాడు. చాలా కాలంగా నవమణి అనే ʹస్థానిక రౌడీʹ నా కుమారుణ్ణి బెదిరిస్తున్నాడు, "కొన్ని నెలల క్రితం, నేను అతని ఇంటికి వెళ్ళి ఈ బెదిరింపుల గురించి వారిని హెచ్చరించాను.ʹ అని అంటున్నారు.

ʹఆ దురదృష్టపు రాత్రి10:30 గంటల సమయంలో, మనోజ్ అనే అతను తన కొడుకును ఒక చిరునామా అడిగే నెపంతో పిలిస్తే అతనితో పాటు బయటికి వెళ్ళిన కొంత సేపటికే అరుపులు వినబడ్డాయి. నేను బయటికి వెళ్ళి చూసేటప్పటికి అతన్ని నరికేశారు. మేము అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాము, కాని అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు.ʹ అని ఆయన పేర్కొన్నారు.

ఈ సంఘటనను ఖండిస్తూ, చెన్నై ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ భారతి తమిజన్ ʹఈ హత్య రాష్ట్రంలోని జర్నలిస్టుల దుర్బలత్వాన్ని బహిర్గతం చేస్తుంది. హోం మంత్రిత్వ శాఖకు కూడా బాధ్యత వహించే ముఖ్యమంత్రి, జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి" అని అన్నారు.

సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఈ హత్యకు సంబంధించి నవమణి, విఘ్నేష్, వెంకటేశన్,మనోజ్ అనే నలుగురు నిందితులను కాంచీపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ʹహత్య వెనుక ఉద్దేశ్యం వ్యక్తిగత ప్రతీకారం, భూమి వివాదం. మేము మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నాము ʹఅని కాంచీపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ షణ్ముగ ప్రియా తెలిపారు.

మోసెస్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్నివ్వాలి, రాష్ట్రంలోని జర్నలిస్టులను రక్షించడానికి ఒక చట్టాన్ని రూపొందించాలని ర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సహయా రాజ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఇ.కె.పళనిస్వామిని కలవాలని తమ యూనియన్, రాష్ట్రంలోని ఇతర పత్రికా సంస్థలు అడుగుతున్నామని ఆయన తెలిపారు.

"మోసెస్ కుటుంబ పరిస్థితిని చూసి, కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులు తాము చేస్తున్న పనికి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే దాని గురించి ఏదో ఒకటి చేయాలి ʹఅని రాజ్ అన్నారు.

ʹరాష్ట్రంలో మరే జర్నలిస్టుకు కూడా నా కుమారుడి గతి పట్టకూడదు. అందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారా? ʹ అని ప్రశ్నిస్తున్న యేసుదాసన్‌కు జవాబు దొరుకు‍తుందా?

ఇది హత్యకు గురైన మోసెస్ తండ్రి యేసు దాసన్ ఒక్కడి ప్రశ్నే కాదు.... దేశవ్యాప్తంగా నిజాయితీగా పని చేసే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ప్రశ్న‌. వాళ్ళ ప్రాణాలకు భ‌రోసా ఉందా ?

Keywords : tamilanadu, journalist, murder, weed smugglers,
(2021-06-24 05:54:33)No. of visitors : 481

Suggested Posts


ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !

చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు.

వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌

నిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం...

కరోనా కన్నా కులమే ప్రమాదకర‌ వైరస్...పా రంజిత్

కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు.

కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌

మొబైల్ షాపు న‌డుపుకునే ఇద్ద‌రు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు. త‌మిళ‌నాడు తూతుకూడి జిల్లా శ‌తాంకులంలో ఫెనిక్స్‌ (31) చిన్న మొబైల్ షాపు న‌డుపుతుంటాడు.

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య‌!

"తమిళనాడును అత్యాచారాల రాష్ట్రంగా ప్రకటించాలి. ఇక్కడ వున్నట్లుగా కుల సమస్య మరే రాష్ట్రంలోనూ లేదు" అని మదురైకి చెందిన ఎన్జీఓ ʹఎవిడెన్స్ʹ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ కదిర్ ఆవేదన. కరోనావైరస్ గత్తర సమయంలో కుల ఆధారిత హింస తమిళనాడులో కొత్త స్థాయికి ఎదిగిందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Search Engine

పోరాటం నుండి నేను వెనక్కి వచ్చాను... హరిభూషణ్ ప్రజల కోసం నిలబడ్డాడు -ఎమ్మెల్యే సీతక్క‌
Addaguduru custodial death: దళిత మహిళ లాకప్ డెత్ పై న్యాయ విచారణకు ఆదేశించిన హైకోర్టు
హరిభూషణ్ తో ఒకరోజు....
హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై ఐదేళ్లు...
ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం
ʹనాన్నకు న్యాయం దొరుకుతుందనే ఆశ అడుగంటుతోందిʹ
ʹమన్‌రేగాʹ లో కులపర, మనువాద సలహాలు
అడ్డగూడూరు లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి - POW
కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌
సిల్గర్ పోలీసు క్యాంపు ముందు వేల మందితో కొనసాగుతున్న నిరసన - జూన్ 27-29న‌ భారీ ర్యాలీకి ప్రణాళిక‌
ఈ హత్యలను మీరెందుకు ప్రశ్నించడం లేదు? - పద్మకుమారి
ఒకవైపు ʹసిల్గరిʹ పోరాటం...మరో వైపు ʹనహరిʹ పోలీసు క్యాంపు ఎత్తివేయాలంటూ దంతెవాడలో భారీ ర్యాలీ
Chattisgarh: కాల్పులకు నిరసనగా ఆదివాసుల భారీ ర్యాలీ... ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి - పోలీసులపై చర్యలకు డిమాండ్
అభయ్ పేరిట విడుదలైన ప్రకటనకు జంపన్న జవాబు
సందె గంగన్న అమర్ రహే ‍- పోరుదారిలో నేలకొరిగిన కన్న బిడ్డను గుండెకద్దుకొని కన్నీటి సంద్రమైన గుంపుల ‍
బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం
శనివార‍ం సందె గంగయ్య అంత్య క్రియలు: మా అన్నది బూటకపు ఎన్ కౌంటర్... సందె గంగయ్య సోదరుడు
మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌
Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పౌరహక్కుల సంఘం నేతలు... ప్రజా సంఘాల‌పై నిషేధం ఎత్తివేయాలని విఙప్తి
Etala Rajendar :ఈటల రాజేందర్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ - సందె గంగయ్యతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి !
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు బ్రాహ్మణిజం వ్యతిరేకం అన్నందుకు నటుడిపై కేసు
more..


నా