నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌


నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌

నాన్న

నాన్న గురించి గుర్తు చేసుకున్నప్పుడు నాకు మొదట మెదిలేది తన అంతిమ యాత్ర. ఆ సంఘటనే నాకు ఎక్కువ గుర్తుండిపోయింది. నాన్న గురించి గుర్తున్న విషయాల కంటే, ఇతరుల నుంచి విన్న విషయాలే ఎక్కువ.

నాన్న చనిపోయినప్పుడు నా వయసు ఏడేళ్లు. అప్పుడు నేను రెండో తరగతి చదువుతున్నాను. ఆరోజు స్కూల్ నుంచి తొందరగా ఇంటికి తీసుకువచ్చారు. స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటి నిండా జనం ఉన్నారు. ఇంట్లోకి వెళ్లగానే అమ్మ నన్ను పట్టుకొని ʹʹనిన్ను ఎట్లా పెంచాలి చిన్నా" అని గట్టిగా ఏడ్చింది. ఏం జరిగిందో అర్థమయ్యే వయసు కాకపోవడం వల్ల, ఇంటికి తెలిసిన వాళ్లు వస్తున్నారన్న సంతోషం తప్ప నిజాన్ని అర్థం చేసుకోలేకపోయాను.

కాసేపటి తరువాత ఇంటి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాము. అక్కడ చాలా సేపు ఎందుకో ఎదురుచూసినట్లు గుర్తుంది. అక్కడ ఉన్నంత సేపూ ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉండడంతో, వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయాను. తరువాత అంతిమయాత్ర మొదలైంది. డీసీఎంలో ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నాను. వెనక డీసీఎంలో నాన్న మృతదేహం ఉంది. తలపై పోస్టుమార్టం తాలూకు కట్టుతో స్వేచ్ఛ పత్రికలో ప్రచురితమైన నాన్న ఫొటోనే నాకు ఇప్పటికీ గుర్తు. అంతిమయాత్ర హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల, ఐజ మీదుగా చినతాండ్రపాడు దాకా నడిచింది. దారిపొడవునా చాలా మంది జనం వచ్చి చేరుతున్నారు. అంతిమయాత్ర ఆగినప్పుడల్లా తెలిసిన వాళ్లంతా వచ్చి నన్ను పలకరించడం గుర్తు. అప్పటికి అది పరామర్శ అని కూడా నాకు తెలీదు.

అంతిమయాత్ర చినతాండ్రపాడు చేసేసరికి రాత్రి అయ్యింది. ఊరిపొలిమేరల్లో కనుచూపు మేరల్లో ఎటుచూసినా జనమే. అమ్మను అందరూ దగ్గరకు తీసుకోవాలని, ఓదార్చాలని ప్రయత్నిస్తున్నారు. సుధ అత్త పాట పాడుతోంది. "ఏడవబోకమ్మా, నువ్వు తూడ్వ‌బోకమ్మా... సల్లంగ దీవించి నన్ను సాగనంపమ్మా" అని పాట సాగుతోంది. కిశోరన్న చితికి నిప్పు పెట్టాడు.

అక్కడి నుంచి ఇంటికి వచ్చాము. వచ్చిన తరువాత ఏదీ ముందులా లేదు. ఒక సంఘటన నాకు చాలా గుర్తుండిపోయింది. రెండు రోజులు లేకపోవడంతో ఇంటికి వచ్చేసరికి మంచినీళ్లు కూడా లేవు. అమ్మ నాకొక చిన్న బిందె ఇచ్చి పై అంతస్తులో ఉండే ఓనర్స్ ఇంట్లో నీళ్లు తీసుకురమ్మని పంపింది. ఆ ఇంట్లో ఉండే పిల్లలు నాకంటే పెద్దవాళ్లు నన్ను బాగా చూసుకునే వారు. నాతో ఆడుకునే వారు. కానీ... ఆరోజు నీళ్లడిగితే ఇవ్వలేదు. ఖాళీ బిందెతో కిందికి వచ్చేశాను. ఎందుకు అలా జరిగిందో ఆరోజు అర్ధం కాలేదు. భయం వల్ల వాళ్లు నీళ్లు ఇవ్వడానికి కూడా వెనకాడి ఉండవచ్చు. కానీ ఏడేళ్ల వయసులో ఆ సంఘటన ఒక గాయంలా గుర్తుండి పోయింది. ఆ రోజు తరువాత కూడా నాతో ఎప్పుడూ ఆడుకునే చుట్టుపక్కల పిల్లలు నాతో మాట్లాడడం, ఆడుకోవడం మానేశారు. ఇదంతా గమనించిందేమో అమ్మ. అక్కడి నుంచి పిన్ని ఇంటికి తీసుకొచ్చింది. కొద్ది రోజుల తరువాత రాంనగర్ లో అద్దె ఇంటికి మారాం.

రాంనగర్ లో మారిన ఇల్లు చాలా చిన్నది. కింది నుంచి పైకి నీళ్లు తీసుకురావల్సి వచ్చేది. ఒక రోజు కింద అమ్మ నీళ్లు పడుతుంటే, ʹʹమీ ఆయన ఏం చేస్తారు అని అడిగింది ఒకావిడ. అమ్మ ఆమె వైపు చూడకుండానే లేరు" అని సమాధానమిచ్చింది. తలుపు చాటు నుంచి ఇదంతా చూస్తున్న నాకు అలా అడిగినందుకు ఆమెపై కోపం వచ్చింది. ఆమె జాలి చూపులకు చిరాకు వచ్చింది.

నన్ను స్కూల్లో ఎవరైనా "మీ నాన్న ఏం చేస్తారు" అని అడిగితే, "అడ్వ‌కేట్‌" అని చెప్పేదాన్ని. ఆ సంభాషణను కొనసాగించకపోయేదాన్ని. చనిపోయారని చెబితే, తిరిగి వాళ్లు ఎలా అని అడగడం, జరిగిందంతా వాళ్లకు చెప్పాక వాళ్లు చూపించే జాలి చూపుల నుంచి తప్పించుకునేందుకే అలా చెప్పేదాన్ని. నా క్లాస్ మేట్ కూడా వాళ్ల నాన్న చనిపోయినా, ఎవరైనా అడిగితే మాత్రం "ఊళ్ళో బిజినెస్ చేస్తారు" అని చెప్పేది. తనను చూశాక, తను కూడా నాలాగే ఫీలవుతోందని అర్ధమయ్యింది. బహుశా నర్రా ప్రభాకర్ రెడ్డి పిల్లలు చైతన్య, స్నేహప్రభ, ఆజం అలీ పిల్లలు ఆసిఫ్..... లు కూడా ఇలాంటి బాల్యాన్నే చూస్తుంటారు.

ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ లో అడ్మిషన్ రావడంతో రాం నగర్ నుంచి హిమాయత్ నగర్ కు ఇల్లు మారాం. నా ఇంటర్మీడియెట్ వరకూ అక్కడే ఉన్నాం. నా చదువంతా తక్కువ ఖర్చులో అయిపోవాలనుకునే దాన్ని స్కూల్ లో కూడా ఫీజు తీసుకునే వారు కాదు. ఇంటర్మీడియెట్ చదువు కోసం తప్ప‌... పెద్దగా ఎప్పుడూ ఖర్చుకాలేదు కూడా, లా కూడా ఉస్మానియాలో సీటు రావడంతో హాస్టల్ ఫీజు తప్ప పెద్దగా ఖర్చు ఈ అయ్యేది కాదు. ఆర్ధిక ఇబ్బందులు ప్రజా సంఘాలలో పనిచేసే కార్యకర్తల పిల్లలకు కొత్త కాదు.

నా చిన్నప్పుడు నాన్నతో గడిపిన కొన్ని సంఘటనలు మాత్రమే గుర్తున్నాయి. నేను రోజూ స్కూల్ కి వెళ్లనని మారాం చేస్తుంటే స్కూల్ కి వెళ్లక ఏం చేస్తావు. తాండ్రపాడు పంపిస్తాను. అక్కడ బ‌ర్ల కాస్తుందువు" అనేవాడు నాన్న. నిజంగానే ఊరికి పంపిస్తారనే భయంతో స్కూల్ కి వెళ్లేదాన్ని. నాకు నచ్చేలా వంట చేసి పెట్టేవాడు. నాన్నంటే... పగలంతా తిరిగి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడని గుర్తు.

నాన్న కొన్నిసార్లు కఠినంగా కనిపించినా చాలా సున్నితమైనవాడని అమ్మ చెప్పేది. "ఒక జననం గురించి పుస్తకం చదివిన మొదటి సారి నాన్న నాతో ఇట్లా ఉండేవాడా అనిపించింది. కథలు చెప్పి నిద్రపుచ్చడం, రాజకీయ విషయాలు నాకు అర్థమయ్యే భాషలో వివరించడం లాంటి అనేక విషయాలను ఆ పుస్తకంలోనే చదివాను. అవన్నీ చదివనప్పుడు నాకు ఇవన్నీ గుర్తుంటే బావుండు అనిపించేది. భౌతికంగా దూరమైన వాళ్ల జ్ఞాపకాలు, సిద్ధాంతాలు, వారి ఆచరణే కదా మన మనసులో వారిని సజీవంగా ఉంచేవి. అందుకే... ఆ పుస్తకంలోని విషయాల్నే నా జ్ఞాపకాల్లో పదిలపర్చుకున్నాను.

నన్ను స్కూల్లో చేర్పించేటప్పుడు అమ్మ ఇంటి పేరునే నా ఇంటి పేరుగా రిజిస్టర్‌లో రాయించాడు నాన్న, చిన్నప్పుడు నాన్న ఎలా చనిపోయాడని ఎవరైనా అడిగితే యాక్సిడెంట్ అని చెప్పేదాన్ని. నిజం చెప్తే ఎక్కడ వాళ్లు మాట్లాడడం మానేస్తారో అనే సందేహం ఉండేది. ఈ పరిస్థితిని కల్పించిన రాజ్యం మీద కోపం వచ్చేది. కాలం గడిచే కొద్దీ నాన్న చనిపోయింది... గొప్ప ఆశయం కోసమని అర్థమైంది. నాన్న మీద, నాన్న ఆశయాల మీద గౌరవం, అభిమానం పెరిగింది.

చిన్నప్పుడు ప్ర‌జా సంఘాలన్నా, సంఘాలలో పనిచేసే వాళ్లన్నా ఇష్టం ఉండేది కాదు. ఆ రాజకీయాల వల్లే నాన్న నాకు దూరమయ్యాడని, అమ్మ నాతో తక్కువ సమయం గడపాల్సి వస్తోందని అనుకునేదాన్ని. అందుకే ఇంటికి వచ్చే ప్రజా సంఘాల వాళ్లతో మాట్లాడేదాన్ని కాదు. నా ఈ ప్రవర్తనతో అమ్మను ఎక్కువగానే బాధ పెట్టానని తరువాత తెలుసుకున్నాను.

నాన్నను ఫొటోలో చూడడం తప్ప ప్రత్యక్ష్యంగా చూసిన గుర్తులేదు. నాన్న అని పేపరు మీద రాయడం తప్ప‌ ప్రత్యక్ష్యంగా పిలిచినట్టు గుర్తులేదు. ఎవరైనా తమ చిన్నతనంలో విషయాలు చెబుతుంటే... నాకూ అలాంటి సంఘటనలు గుర్తుంటే కనీసం నాన్న జ్ఞాపకాలైనా మిగిలేవనిపిస్తుంది.

ఏ ఇంటికి వెళ్లినా ఆ ఇంట్లో మహిళలతో నాన్న మాట్లాడేవాడని చెప్తారు. నాన్న గురించి వారి మాటల్లో చిన్నప్పుడంతా నైతిక విలువలు, రాజకీయాలు విడదీయలేనివని ఆచరించి చూపించాడనిపిస్తుంది. ఆయనలాంటి వారి నుంచి ముఖ్యంగా నేర్చుకోవల్సింది 20 ఏళ్లు గడిచినా... నన్ను కలిసిన వారంతా నాన్న గురించి తమ జ్ఞాపకాలు పంచుకుంటుంటారు. ఇప్పటికీ తన పుట్టిన ఊరు చిన తాండ్రపాడులో ప్రతి సంవత్సరం నవంబర్ 29న ప్రజలు నివాళులర్పిస్తుంటారు. నాన్న పేరుతో ʹపురుషోత్తం యూత్ ఫెడరేషన్ʹను స్థాపించి ఊరు బాగుకోసం పోరాడుతున్నారు. చిన్న అన్యాయాన్నైనా ప్రశ్నించే వాళ్లు, దానికి ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ల హక్కుల గొంతుకకు నిజమైన వారసులు.

పుస్తకం ఆలోచన విత్తనంగా ఉన్నప్పటి మంచి శేషయ్య అంకుల్ పుస్త‌కం కోసం పనిచేశారు.
కానీ పుస్తకం చేతికి వచ్చేసరికి ఆయన మనతో లేరు. హక్కుల కోసం, ఉద్యమ ప్రయోజనాల కోసం వారి జీవితాల్ని, ప్రాణాలను ఫణంగా పెట్టి అమరులైన వారెందరో ఉన్నారు. నాలాగా తండ్రికి దూరమై, భర్తకు, కొడుకుకు దూరమైన వారెందరో ఉన్నారు. అమరుల త్యాగాలకు, మీ తెగింపుకూ నా రెడ్ సెల్యూట్.

(పౌరహక్కుల సంఘం నాయకుడు అమరుడు పురుషోత్తం 20వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రిలీజ్ కాబోతున్న ʹఅతడొక ధిక్కారంʹ పుస్తకంలోంచి...)

Keywords : purushotham, CLC, Swetcha
(2021-01-24 07:50:36)No. of visitors : 456

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
more..


నాన్న