వీవీతో ములాఖాత్ - 1
(అనారోగ్యంతో ముంబై నానావతి ఆస్పత్రిలో ఉన్న విప్లవ రచయిత వరవరరావును కలిసిన సీ.వనజ తన ఫేస్ బుక్ టైం లైన్ పై పెట్టిన పోస్ట్)
ఆరోగ్యం అప్ డేట్
బొంబాయి నానావతి లో ఉన్న వీవీని రెండు రోజులు వరుసగా రెండు 15 నిమిషాలు కలిసే అవకాశం వచ్చింది.
2018 లో ఇంటి నుంచి వెళ్ళినప్పుడు చూసిన వీవీకి ఈ వీవీకి అసలు పోలికే లేదు. చిక్కిశల్యమయి ఉన్నారు. అసలే చిన్నమనిషి. అందులో 18 కిలోలు తగ్గితే ఎలా ఉంటారు? మనిషి నీరసంగా ఉన్నారు కానీ మాటలు ఉత్సాహంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత తెలుగు చదివే అవకాశం ( హాస్పిటల్ లో తెలుగుపుస్తకాలు ఇవ్వనిచ్చారు) తెలుగులో అందులో దగ్గరి వాళ్ళతో మాట్లాడే అవకాశం రెండేళ్ళ తర్వాత రావటంతో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. దానివల్ల బీపీ కూడా ఫ్లక్చుయేట్ అయింది.
నిన్న బుధవారం నేను కలవడానికి కొంచెం ముందు బాత్ రూంలో మళ్ళీ పడిపోయి తలకు దెబ్బ తగిలింది. చిన్నదే. దాదాపు మూడు నెలలపైన ఉన్న కాథటర్ తీసెయ్యటం వల్ల ప్రతి గంటకు బాత్ రూంకి వెళ్ళవలసి వస్తుందట. కుటుంబం నుంచి అటెండెంట్ ను ఇవ్వలేదు. కాపలాగా ఉన్న పోలీసు అటెండెంట్ పని చెయ్యడు. ప్రతిసారీ నర్స్‌ను పిలవడానికి ఇబ్బంది పడి ఒక్కరే బాత్రూం కి వెళ్తే ఇది జరిగింది. దెబ్బ తగలటంతో ఆయన మంచం దిగకుండా చుట్టూ రెయిలింగ్ ఎరెక్ట్ చేసి బెల్ పెట్టారు. బెల్ కొడితే స్టాఫ్ వస్తారని.
కానీ ఈ శక్తిలేక పడిపోవడం అన్నది ఇప్పటికి ఎన్నిసార్లో జరిగింది. మూడు నెలల క్రితం జూలై14-15 న జేజే లో పడితే తలకు కుట్లు కూడా పడ్డాయి. కాని దానికి ముందు జైల్లో కూడా అనేక సార్లు పడి దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఏప్రిల్ నుంచే ఆయన అనారోగ్యం పాలయారు. అప్పటికే ఉన్న ఆరోగ్యసమస్యలకు తోడు విపరీతంగా సోడియం లెవెల్స్ పడిపోయి న్యూరలాజికల్ సమస్యలు రావటంతో పదే పదే పడిపోయేవారట. ముఖ్యంగా బాత్ రూం కి వెళ్ళినప్పడల్లా. ఆ కాలంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నా కావాలనే జైల్ సూపరింటెండ్ రిపోర్ట్ చేయలేదట. అతను ఆర్ ఎస్ ఎస్ మనిషి. మహారాష్ట్రలో బయటా వివిధ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళ వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఆయనా అదే చేశాడు. స్టాన్ స్వామి నుంచి జైలుకు రాగానే సిప్పర్ లాగేసుకున్న మనిషి ఆయనే. సహ ఖైదీలు పదే పదే వీవీ అనారోగ్యం గురించి చెప్తున్నారని అసలు బారక్ వైపే రావడం మానేశాడట. విషయం బయటకి తెలిసి నానా గొడవ జరిగి జూలైలో హాస్పిటల్ కు తరలించకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించను కూడా లేం.
ఇప్పుడు కూడా నానావతిలో చెప్తున్నదదే. మెడికల్ గా మేం చెయ్యగలిగింది చేశాం. మిగిలింది పోషణ, కేర్ టేకింగ్ మాత్రమే అంటున్నారు. జైల్లో అదెలా కుదురుతుంది అన్న ప్రశ్నకు వాళ్ళ దగ్గర జవాబు లేదు. అది జరగటం సాధ్యం కాకనే మళ్ళీ మళ్ళీ సిక్ అవుతున్నారు. ఆయనకు ఇప్పుడు కావలసింది కేర్ అండ్ నర్సింగ్. మెడికల్ గా అంతా ఒకే అని డిశ్చార్జ్ చేసి పంపితే జెలులో మళ్ళీ ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పటివరకూ వెర్నన్, అరుణ్ ఆయన్ను చూసుకుంటున్నారు. కానీ లోపల పరిమితులకు మించి వాళ్ళు కూడా ఏం చేయగలరు? ఆయన నార్మల్ కావాలంటే ఇంటికి రావాలి. అది మనకూ వాళ్లకూ తెలుసు. అందుకే వాళ్ళు రానివ్వరు. ఖైదీల పట్ల మండేలా రూల్స్, దేశం పెట్టిన సంతకాలూ కాగితాలకే పరిమితం.
మరో వైపు ఎందుకు నా ఒక్కడికే ఇవన్నీ. నాలా చాలామంది బాధపడుతున్నారు. జైళ్ళలో చనిపోతున్నారు కూడా. వాళ్ళకు దొరకని హెల్ప్ నాకే ఎందుకు అని విసుక్కుంటున్నారు వీవీ. స్టాన్ స్వామి గురించీ సాయిబాబా గురించీ మాట్లాడారు. వాళ్ళకోసం ఏమైనా చెయ్యాలన్నారు. రెండు జతలకి మించి బట్టలు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. బట్టలు తీసుకుని పోతే కొత్తవి వద్దని ఒక్క పాత పైజామా షర్టు తీసుకున్నారు. తన దగ్గర ఉన్న వాటిలోంచి ఒక జత ఇచ్చేశారు. జైలులో అందరికీ రెండు జతలే నాకెందుకు మూడో జత అన్నారు. మూడో అండర్ వేర్ తీసుకోవటానికి కూడా ఇష్ట పడలేదు. ఎముకల పోగులా ఉన్న ఆయనను హగ్ చేసుకుని వచ్చేస్తుంటే దుంఖం ఆగలేదు.
ఇంత దుఖం మనకే. కానీ ఆయన స్పిరిటెడ్ గా ఉన్నారు.
- సీ.వనజ
Keywords : varavararao, virasam, bk16, mumbai, nanavathi hospital
(2021-01-14 11:00:10)
No. of visitors : 293
Suggested Posts
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |
| కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు... |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
|
| అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
|
| షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ
|
| దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |
| బీహార్ లో వేలాది మంది రైతుల ర్యాలీ - పోలీసుల దాడి |
| తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ పొలంపనుల్లో... |
more..