ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం


ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం

కర్నాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లా మహాలింగాపూర్‌ టౌన్ బీజేపీ నాయకురాలు‌, మహాలింగాపూర్‌ టౌన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చాందిని నాయక్ పై ఆమె పార్టీకే చెందిన‌ ఎమ్మెల్యే సిద్దూ సవధి తన మద్దతుదారులతో కలిసి దాడి చేయగా ఆమెకు గర్భస్రావం జరిగింది. ఈ మేరకు ఆమె ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసింది.

గత నెల 9న మహాలింగాపూర్‌ టౌన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌కి సంబంధించి ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి తన మద్దతుదారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. చాందిని నాయక్‌ ఓటు వేయడానకి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గర్భవతి అయిన చాందిని నాయక్‌ కింద పడిపోయింది. దాంతో ఆమెకు గర్భస్రావం అయినట్లుగా తెలిసింది.

దీనిపై చాందిని నాయక్‌, ఆమె భర్త నగేష్‌ నాయక్‌.. మరో బీజేపీ లీడర్‌ సాయంతో స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎమ్మెల్యే సిద్దూ సవధి మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాందిని నాయక్‌ మాట్లాడుతూ.. ʹఎమ్మెల్యే రౌడీయిజం చేశారు. నన్ను కిందపడేశారు. ప్రజాప్రతినిధి అయ్యుండి.. ఓ మహిళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం ఏంటి?.. ఇలాంటి నాయకులు ఉంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడతారు.. ప్రధాని ʹబేటీ బచావో.. బేటీ పడావోʹ అంటూ నినాదాలు చేస్తారు.. ఎమ్మెల్యేలు మాత్రం మహిళలు పట్ల ఇలా దారుణంగా ప్రవర్తిస్తారుʹ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బ్రిజేష్ కలప్ప ఈ వివాదంపై స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు., ʹబీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి గర్భవతి అయిన కౌన్సిలర్ చాందిని నాయక్ మీద దాడి చేసిన వీడియోలను మేం టీవీ చూసి చాలా భయపడ్డాము. ఎమ్మెల్యే క్రూరత్వం వల్ల ఆమెకు గర్భస్రావం అ‍య్యింది. బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలదా?!ʹ అంటూ సవాలు చేశారు.

కాగా ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే సవధి స్పందించారు. చాందిని నాయక్‌ తనపై చేసినవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ ఖండించారు. ʹʹచాందిని నాయక్‌కు సంబంధించిన ఆస్పత్రి రికార్డులు సేకరించాను. ఆమెకు 6 సంవత్సరాల క్రితం ట్యూబెక్టమీ అయ్యిందని తెలిసింది. ఒక రోజులో నేను ఈ నివేదికను మీడియాకు విడుదల చేస్తానుʹ అన్నారు. ఆమె కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని.. ఆమెకు ఎలాంటి గర్భస్రావం జరగలేదని ఆసుపత్రి అధికారులు తనకు తెలియజేశారని సవధి తెలిపారు.

Keywords : karnataka, Chandini Nayak Suffers Miscarriage After Allegedly Pushed By MLA Siddu Savadi
(2021-01-23 14:49:57)No. of visitors : 188

Suggested Posts


ʹఐలవ్ ముస్లిమ్స్ʹ అన్నందుకు ఓ అమ్మాయిని వేధించి, వేధించి చంపేసిన మ‌తోన్మాదులు...బీజేపీ నేత అరెస్టు

కర్ణాటకలోని చిక్‌మగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు మతోన్మాదులు ఓ అమ్మాయిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అందుకు కారణం ఆ అమ్మాయి సరదాగా ʹఐ లవ్‌ ముస్లిమ్స్‌ʹ అని వాట్సప్‌లో మెసేజ్ చేయడమే.

Support the struggle for human dignity and livelihood .

ix months back onwards 577 Adivasi families had legally occupied government land in siddapura near virajpet and constructed hutments in order to escape the bonded wage labour in the coffee estate....

న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?

ʹఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు బాధితులు, సాక్షులైన మహిళలను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం

War and Peace in the Western Ghats

The last two weeks have been the most traumatic in my life. At one go, these two weeks have shown how various forms of violence operate: the shrinking democratic space, the betrayal by the so-called mentors of our age, a government that has no control over the police and, above all, what domestic violence can do. Feminism declares

స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాదిపై బీజేపీ దుర్మార్గ దాడి !

తమకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్న బీజేపీ నాయకులు.. స్వతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారినీ వదలడం లేదు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించిన‌

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
more..


ఎమ్మెల్యే