20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ʹ పోయి వస్తాం ʹ
శ్రీకాకుళం సెట్ బ్యాక్ నుంచి తేరుకున్న
జగిత్యాల
దేశమంతా తానై
విరిగిన పిల్లనగ్రోవి నుంచీ
గెరాల్లా స్థావరాల
పోరాట గానాన్ని వినిపిస్తున్నది
కొత్త గట్టు నుంచి మెట్టు మెట్టుగా
ఆంధ్ర దండకారణ్య బీహార్ లను
తన ప్రవాహ చొరవతో నిర్మించిన
మానేరు
నాగేటి చాళ్లలో
గంగా కావేరులై ప్రవహిస్తున్నది
చుట్టూ వాగే కాని
చూపులో దిగంతాలు నింపుకున్న
తెలంగాణ కడివెండి
క్షితిజరేఖలా స్థిరంగా
వీడ్కోలు కాదు
ప్రజావీరులకు స్వాగతం పలుకుతున్నది
వరవరరావు
డిసెంబర్ 2 , 1999
భారత విప్లవోద్యమ చరిత్రలో ఓ నెత్తుటి జ్ఞాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనేక ముక్కలుగా ఉన్న అనేక విప్లవ గ్రూపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన గొప్ప విప్లవ కారులు... కామ్రేడ్ నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్, శీలం నరేష్ లు అమరులైన రోజు ఇది. 1999 డిశంబర్ 1 వతేదీన ఈ ముగ్గురిని బెంగళూరులో పట్టుకొని చిత్ర హింసలు పెట్టి చంపి హెలీకాప్టర్ లో తీసుకొచ్చి కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవుల్లో పడేశారు.

నల్లా ఆది రెడ్డి మొదటి తరం విప్లవ నాయకుడు. 1969 లో సాగిన ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మల్లోజుల కోటేశ్వర్ రావు (కిషన్ జీ), మరికొంత మంది సహచరులతో కలిసి పాల్గొన్న వాడు, నాయకత్వం వహించిన వాడు. పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన వాడు. ఎటువంటి సమస్యకైనా అత్యంత నైపుణ్యంతో పరిష్కారం చూయించగల దిట్ట అని పేరున్న వాడు. ఒక సారి అరెస్టయ్యి ఆదిలాబాద్ జైల్లో ఉన్నప్పుడు తనతో పాటే జైల్లో ఉన్న మరో సహచరుడి తో కలిసి చాక చక్యంగా తప్పించుకున్నాడు.
ముగ్గురు కూడా సున్నిత మనస్కులు. పోరాటంలో మాత్రం కసిగా పాల్గొనే వాళ్ళు. దేశంలోని అనేక విప్లవ గ్రూపులను ఒక్క తాటి పైకి తెచ్చేందుకు వాళ్ళు చేసిన కృషి అమోఘమైనదని , వాళ్ళు చనిపోవటం భారత విప్లవోధ్యమానికి తీరని లోటని అప్పటి పీపుల్స్ వార్ ప్రకటించింది. ప్రజల రక్షణకోసం, పార్టీ ఆత్మరక్షణ కోసం సైన్యం అవసరం ఉందని భావించిన పీపుల్స్ వార్ పార్టీ ఆ ముగ్గురు విప్లవకారుల వర్ధంతి సందర్భంగా 2000 డిశంబర్ 2 వ తేదీన పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ( పీజీఏ ) ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ప్రతి యేడు డిశంబర్ 2 వ తేదీ నుండి వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తోంది. 2004 సెప్టంబర్ 21 న దేశంలోనే అతి పెద్ద రెండు విప్లవ పార్టీలైన సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్, ఎంసీసీఐ లు ఐక్యమై సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన సందర్భంగా పీజీఏ ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) గా మార్చారు.
Keywords : nalla adi reddy, erram reddy santhosh, sheelam naresh, PLGA, Peoples war, Maoist Party
(2021-01-25 20:56:40)
No. of visitors : 398
Suggested Posts
| 20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !భారత విప్లవోద్యమ చరిత్రలో ఓ నెత్తుటి ఙాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనేక ముక్కలుగా ఉన్న అనేక విప్లవ గ్రూపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన గొప్ప |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
| ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
|
| అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
| వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
|
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
|
| అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
|
more..