రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

రోజుకు

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

ఎముకలు కొరికే చలిలో ఎనిమిది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను కంగనా రనౌత్ దేశద్రోహులతో పోల్చింది. దేశ రాజధానిలో మరో షాహిన్ బాగ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి అవకాశం కల్పించవద్దంటూ విద్వేషాన్ని కక్కింది. ఆకలి, దప్పిక, చలిని తట్టుకుంటూ కఠిక నేలపై కాళ్లు ముడుచుకు నిద్రిస్తున్న కర్షకులను అద్దె మనుషులుగా అవహేళన చేసింది. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న .... ఓ వృద్ధురాలిని షాహీన్ బాగ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన బిల్కిస్ దాదీగా అసత్య ప్రచారానికి పూనుకుంది కంగన. టైమ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తించిన ఈమె 100 వంద రూపాయలకు వచ్చి రైతుల ఆందోళనలో కూర్చుంది అంటూ వ్యాఖ్యానించింది. కంగనా చేసిన ట్వీట్ పట్ల ప్రముఖ గాయకుడు దిల్జత్‌ దోసంజ్‌ తీవ్రంగా స్పందించారు. కంగన.. బిల్కిస్‌ బానుగా ట్వీట్‌ చేసిన ఈ మహిళ పేరు మహిందర్‌ కౌర్‌ అని పేర్కొన్నారు. కంగనా చెప్పేదల్లా వింటూ గుడ్డివాళ్లు కావద్దని సూచించారు.

మహీందర్‌ కౌర్‌ని ఉద్దేశించి వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అని ట్వీట్ చేసినందుకు హకమ్ సింగ్ అనే న్యాయవాది కంగనా రనౌత్ కు నోటీసులు పంపించారు. తన వ్యాఖ్యలపై వారంలోపు క్షమాపణ చెప్పక పోతే పరువు నష్టం దావా వేస్తామన్నారు. మరోవైపు.. షాహిన్ బాగ్ ఉద్యమానికి నేతృత్వం వహించిన బిల్కిస్ బాను... తాను ఢిల్లీలో జరుతున్న రైతుల ఆందోళనకు హాజరుకాలేదని స్పష్టం చేసింది. ʹఫ్యాక్ట్‌ చెక్‌ʹ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్‌ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు.

రైతులను అవమానిస్తూ, తనను బిల్కిస్ బానుగా ప్రచారం చేసిన కంగనపై మహీందర్ కౌర్ ఘాటుగా స్పందించింది. " బీబీ, నేను రైతును, మా పొలాల్లో రోజూ కూలీ 600 రూపాయలు. నీకు రోజుకు 700 రూపాయలు ఇస్తాను. నా పొలంలో పనిచెయ్యి. వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుంది" అని ధీటుగా జవాబిచ్చింది. నిజమే కదా... అన్నదాతను అవమానించే వాళ్లకు శ్రమ విలువ ఎలా తెలుస్తుంది. కార్పోరేట్ల కొమ్ముకాయడమే దేశభక్తి అనుకునే ఈ అమ్మాయికి రైతు కష్టమెలా తెలుస్తుంది.

Keywords : kangana ranout, bilkis dadi, mahendar kour,
(2024-04-13 13:36:34)



No. of visitors : 883

Suggested Posts


అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులు

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు.

తీవ్రమైన రైతుల ఉద్యమం ‍- రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్

ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ‌ కేసులు బనాయించి అరెస్టు చే

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రోజుకు