రైతుల ఉద్యమంలాంటిదే అక్కడా నడుస్తోంది - 4 రోజులుగా చలిలో వాళ్ళు రోడ్లమీదే ఉన్నారు
కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా లక్షలాదిమంది రైతులు ఉద్యమిస్తున్నారు. దాదాపు పది రోజులుగా వణికించే చలిలో ఢిల్లీ శివార్లలో కూర్చొని ఉన్నారు రైతులు. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమంపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఆదివాసులు దాదాపు ఇటువంటి ఉద్యమాన్నే ప్రారంభించారు. నాలుగు రోజులుగా ఆరు వేల మంది ఆదివాసులు రోడ్లను బ్లాక్ చేసి చలికి వణుకుతూ , ఎండలో మండుతూ కూర్చుని ఉన్నారు. కార్పోరేట్ కంపనీల కోసం రైతుల పొట్టగొడుతున్న ప్రభుత్వం అదే కార్పోరేట్ కంపనీల కోసం ఆదివాసులనూ నిరాశ్రయులను చేయబూనుకుంది. దానిపై బస్తర్ ఆదివాసులు రోడ్డెక్కారు.
బస్తర్ ఆదివాసీలు అడవిని, భూమిని కాపాడుకోడానికి ఐక్యమయ్యారు. అమదై బాక్సైట్ గని తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్నారు. బస్తర్ డివిజన్ నారాయణపూర్ జిల్లాలోని ధౌడై సమీపంలో దట్టమైన అడవుల మధ్య 6 వేలకు పైగా ఆదివాసీలు, మహిళలు, పురుషులు సాంప్రదాయ ఆయుధాలతో ధర్నా మొదలుపెట్టారు. చల్లటి చలిలో మూడు రోజులుగాఆరు వేల మంది ఆదివాసులు అక్కడే కూర్చున్నారు. అబుజ్మడ్ ప్రాంతంలోని ఛోటా డొంగర్ గ్రామం నుండి 6 వేల మందితో బయలుదేరిన ర్యాలీ 55 కి. మీ. నడిచి ధోడై అడవుల్లో ధర్నాపై కూర్చున్నారు. ధోడై సమీపంలోని రోడ్లన్నింటిని మూసి వేశారు. ఆ చుట్టు పక్కల అత్యవసర వాహనాలను తప్ప ఇంకేవాహనాన్ని కదలనివ్వడం లేదు ఆదివాసులు.
"మా డిమాండ్లు నెరవేరేదాకా, మేము అడవి నుండి బయటికి వెళ్లము. అంత మాత్రమే కాదు, డిసెంబర్ 17 వరకు ధర్నా చేయాలని నిర్ణయించుకుని. అవసరమయ్యే భోజన సామాగ్రిని తెచ్చుకున్నాం. గని తవ్వకం వల్ల మా నీరు, అటవీ, భూమికి భారీ నష్టం కలుగుతుంది. మేము మా భూమిని దేవుడిలా చూస్తాం. ప్రైవేటు సంస్థ జోక్యం చేసుకుంటే మా ప్రాంతం సురక్షితంగా ఉండదు. మా డిమాండ్లు నెరవేరేదాకా వేలాది సంఖ్యలో నిరసన తెలియచేస్తాము. రాస్తా రోకో జరుపుతాం. మేము ముందుకు వెళ్తాము. " అని సర్వ ఆదివాసీ సమాజ్ అధ్యక్షుడు బీసల్ నాగ్ చెప్పారు.

అవసరమైన సేవలను మినహాయించి, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల కదలికను తాము ఆపివేశామని వారు తెలిపారు. అలాగే, వారపు సంతను కూడా పూర్తిగా మూసేశారు. రహదారిని మూసివేసారు. అయితే అటుగా వచ్చిన అంబులెన్స్ కు మాత్రం వెంటనే దారి కల్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో బస్తర్ డివిజన్లో ఏడు జిల్లాల ఆదివాసీలు పాల్గొంటున్నారు. ఆ ప్రాత గ్రామాల నుండి ఆరుగురు ఆదివాసులను పోలీసులు అరెస్టు చేశారు. వారు నక్స్లైట్లని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆదివాసులు ఆగ్రహంగా ఉన్నారు. ఆదివాసులందరూ తమ గ్రామాలకు తిరిగి వెళ్ళాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాళ్ళు ససేమిరా అంటున్నారు. వాళ్ళతోపాటు ఆదివాసులు దాదాపు 15 రోజులకు సరిపడ ఆహార పదార్థాలు వెంట తెచ్చుకున్నారు.

నారాయణపూర్ జిల్లాలోని అమదై గనిని నిక్కో కంపెనీకి లీజుకు ఇచ్చారు. నిక్కో సంస్థ త్వరలో గని తవ్వకాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. అందువల్ల ఈ ప్రాంతానికి కలిగే నష్టాన్ని గుర్తించిన ఆదివాసీలు ఈ విధంగా ఉద్యమాన్ని చేపట్టారు
ఆదివాసీల ఆందోళన ఆపడానికి తహశీల్దార్, తాలూకా ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారులు రాగా వాళ్ళతో మాట్లాడడానికి ఆదివాసీలు తిరస్కరించారు. తమతో మాట్లాడటానికి ప్రభుత్వ ప్రతినిధి రాకపోతే తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు అంటున్నారు. గనులను నిక్కో కంపెనీకి ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, నక్సలైట్ల పేరుతో అరెస్టు చేసిన 6 గురు యువకులను వెంటనే విడుదల చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ డిమాండ్స్ నెరవేరేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు.
Keywords : chattis garh, adivasi, farmers, mining, bauxite
(2021-01-14 22:18:53)
No. of visitors : 476
Suggested Posts
| హెచ్ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| ప్రజలపై పారామిలిటరీ, డిఆర్జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్భద్రతా దళాల సిబ్బంది గ్రామస్తులను వేధిస్తున్నారని సిపిఐ-మావోయిస్టు కిష్టారామ్ ఏరియా కమిటీ ఆరోపించింది. ఏరియా కమిటీ తొలిసారిగా వీడియో, ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. |
| సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణచత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు. |
| విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా అడవి ప్రాంతంలో, భద్రతా దళాల క్యాంపుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం బుర్కాపాల్. ఈ గ్రామానికి వెళ్తే తమ పనులలో నిమగ్నమై వున్న మహిళలు లేదా వడిసెలతో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. కొంతమంది పురుషులు కూడా కనపడవచ్చు కానీ వారు బయటి వారితో మాట్లాడడానికి భయపడతారు. |
| మా జీవితాన్ని,సంస్కృతిని నాశనం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన 9 మంది సర్పంచ్ లు
వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. |
| హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు. |
| పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
మా జీవితాలను నాశనం చేసే పోలీసులు క్యాంపులు అవసరం లేదు. మాకు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీలు కావాలిʹ అంటూ అక్కడ గుమి కూడిన వందలాది మంది ఆదివాసులు నినదిస్తున్నారు. |
| బాలికల గృహంలో పోలీసుల హింసాకాండ,న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టుపై PUCL ప్రకటన
ʹఅప్నా ఘర్ʹ (మా ఇల్లు) బాలికల గృహం సిబ్బంది మీద దౌర్జన్యం చేసి, అక్కడ నివసిస్తున్న హెచ్ఐవి పాజిటివ్ బాలికలను బలవంతంగా అపహరించుకు పోయిన సంఘటనకు బాధ్యులెవరో తెలుసుకోడానికి ప్రయత్నం చేసిన మా సంస్థ సభ్యురాలు, న్యాయవాది ప్రియాంక శుక్లాను 17.08.2020 న బిలాస్పూర్ పోలీసులు దారుణంగా హింసించి అరెస్టు చేయడాన్ని పియుసిఎల్ తీవ్రం |
| పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో వందలాది మంది ఆదివాసీలు పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలియచేసారు. మూడు జిల్లాల ఆదివాసీలు సాంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించారు. |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
|
| అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
|
| షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ
|
| దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |
| బీహార్ లో వేలాది మంది రైతుల ర్యాలీ - పోలీసుల దాడి |
| తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ పొలంపనుల్లో... |
more..