ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు


ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఈ

పై ఫోటో మీరు చూసే ఉంటారు. దేశవ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన ఆ ఫోటో తీసింది ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (పిటిఐ) కోసం పనిచేస్తున్న ఫోటో జర్నలిస్ట్‌ రవి చౌదరి. కేంద్రం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల , రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దాదాపు పది రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిస్ందే. ఢిల్లీకి వెళ్తున్న వేలాది రైతులపై నవంబర్ 26, 27 తేదీల్లో పోలీసులు దుర్మార్గమైన దాడికి తెగబడ్డారు. వాటర్ కెనాన్లతో, టియర్ గ్యా గోళాలతో, లాఠీలతో రైతులపై దాడికి దిగారు పోలీసులు. ఆ సమయంలో ఓ వృద్ద రైతును ఓ పోలీసు కొడుతుండగా రవి చౌదరి ఫోటో తీశాడు.

ఆ ఫోటో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసి ప్రభుత్వంపై విరుచుకపడ్డాడు. సోషల్ మీడియాలో లక్షలాది మంది నెటిజనులు ఆఫోటోను షేర్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. ఆ వాహనంపై స్పష్టంగా ʹభారత్ సర్కార్ ʹ అని రాసి ఉందని ఆయన అన్నాడు. ఈ విషయంపై మురద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఫోటో జర్నలిస్టు రవి చౌదరి తెలిపారు.

ఆయన తనపై దాడి జరిగిన విషయాన్ని, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించని విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ను యూపీ పోలీసులు, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లకు ట్యాగ్ చేశాడు. నేనిప్పుడు ఏం చేయాలో చెప్పండి అని రవి చౌదరి ప్రశ్నించాడు.

గతంలో కూడా రవి చౌదరి తీసిన ఫోటోలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. హత్రాస్‌లో ఒక దళిత బాలికపై అత్యాచారం, హత్య జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంఘటనా స్థలానికి వెళ్తున్న సమయంలో పోలీసులు ఆమెను అడ్డుకోవడం ఆమె కుర్తాను పట్టుకొని లాగడం, ఆమెను తోసేయడం జరిగింది. కుర్తాను పోలీసులు పట్టుకున్న ఫోటో అప్పుడు రవి చౌదరి తీశాడు. ఆ ఫోటో కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

2018 లో మరో ఫోటో కూడా దే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2018లో రైతుల నిరసన ప్రదర్శనపై పోలీసులు దాడి చేయగా దోతీ కట్టుకున్న ఓ వృద్దుడు చేతిలో కర్రతో ఎనిమిది మంది పోలీసులను నిలవరించిన ఫోటో కూడా రవి చౌదరి తీసిందే.

సోషల్ మీడియాలో తనపై దాడికి సంబంధించి ఆయన పెట్టిన పోస్ట్ కు అనేక‌ మంది నెటిజనులు స్పంధించారు. రవి చౌదరికి మద్దతుగా నిలిచారు. డిజిపి మరియు ఇతర ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని మరియు అవసరమైతే న్యాయ మార్గాలను కూడా అనుసరించాలని చౌదరిని కోరారు. అయితే ఫోటో జర్నలిస్టు రవి చౌదరికి సరైన న్యాయంలభిస్తుందని మనం ఆశించవచ్చా ?

(freepressjournal.in సౌజన్యంతో)

Keywords : farmers, delhi, uttarapradesh, photo journalist, Ravi Choudhary, PTI, PTI photojournalist, who clicked iconic ʹKisan v Jawanʹ photo, allegedly attacked by men in ʹsarkariʹ vehicle
(2022-06-28 12:33:10)No. of visitors : 1376

Suggested Posts


అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులు

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు.

దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ

he Central Committee of our Party firstly conveys its revolutionary greetings to the Indian peasantry that is fighting non-compromisingly and with a strong will against the central government to achieve their

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


ఈ