నిరసనల్లో పాల్గొన్న రైతులకు 50 లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని నోటీసులు


నిరసనల్లో పాల్గొన్న రైతులకు 50 లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని నోటీసులు

నిరసనల్లో

ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే ఆ హక్కును ఉత్తరప్రదేశ్ యోగీ సర్కారు గుర్తించ నిరాకరిస్తున్నది. కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తీవ్ర ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో యూపీలో కూడా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే యూపీ సర్కారు మాత్రం నిరసనల్లో పాల్గొంటున్న రైతులపై కత్తిగట్టింది.

రైతు సంఘాల నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ వారిని 50 లక్షల రూపాయలు వ్యక్తిగత బాండ్లను సమర్పించాలని సంబల్ జిల్లా లోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నోటీసులు పంపించాడు. ప్రధానంగా భారతీయ కిసాన్ యూనియన్ (అస్లీ) ఆఫీసు బేరర్లు ఆరుగురు నాయకులకు ఒక్కొక్కరికి రూ .50 లక్షలకు నోటీసులు పంపారు. మరో ఆరుగురికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల బాండ్లను కోరుతూ ఇలాంటి నోటీసులు పంపారు. సిఆర్‌పిసి సెక్షన్ 111 కింద డిసెంబర్ 12, 13 తేదీల్లో ఇవి జారీ చేయబడ్డాయి.

అయితే రైతు నాయకులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. తాము ఆ బాండులను ఇవ్వడం కన్నా జైలుకు పోవడానికి సిద్దంగా ఉన్నామంటున్నారు.

ʹʹమాది శాంతి యుతమైన నిరసన. రైతుల నిరసనలకు పాలకులు ఎందుకు భయపడుతున్నారు ? 50 లక్షలు బాండ్ అడుగుతున్నారు మేమైనా ఉగ్రవాదులమా ? మా దగ్గర అంత డబ్బు ఉండదని అధికారులకు తెలుసు.ʹʹ అని బికెయు (అస్లీ) జిల్లా అధ్యక్షుడు రాజ్‌పాల్ సింగ్ యాదవ్ అన్నారు. ఈయనకు కూడా 50 లక్షల బాండు కోరుతూ నోటీసులు వచ్చాయి.

రైతు నాయకులు ఎక్కువగా చందౌసి మరియు సింగ్పూర్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళు నవంబర్ 26 నుండి నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసన మొదటి రోజున, సంభాల్ లోని ఒక చౌక్ వద్ద దాదాపు 400 మంది నిరసన ప్రదర్శన‌ నిర్వహించారు. ఇక అప్పటి నుండి, నిరసనలు జరగకుండా పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని నాయకులు తెలిపారు.

"ఈ నోటీసులు ఇవ్వడానికి ముందు, మా కదలికలను ట్రాక్ చేయడానికి పోలీసులు మా గ్రామాలను చుట్టుముట్టారు. మేము గెరావ్ లేదా ప్రదర్శన కోసం పిలుపు ఇచ్చినప్పుడల్లా, పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయడానికి మా ఇళ్లకు వస్తున్నారు. మేము నవంబర్ 28 న ఒక్క‌ రోజు మాత్రమే ఢిల్లీకి వెళ్ళగలిగాము. పోలీసుల వల్ల మేము ఇళ్ళు వదిలి పెట్టి పొలాల్లో నిద్రించాల్సి వస్తున్నది. ʹఅని BKU (అస్లీ) మరో నాయకుడు సంజీవ్ గాంధీ చెప్పారు.

.
"మొత్తం దేశంలో నిరసనలు జరుగుతున్నాయి, కాని 50 లక్షల రూపాయలు కట్టాలంటూ రైతులను బెదిరించిన సంఘటన ఎక్కడా జరగలేదు.ఇది పూర్తిగా రైతులను వేధించడమే ʹ అని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ నాయకుడు రాజ్‌వీర్ సింగ్ అన్నారు.

ఇక సంభల్ ఎస్‌డిఎం దీపేంద్ర యాదవ్ జారీ చేసిన నోటీసులో ఏముందంటే... ఢిల్లీలో జరుగుతున్న సంఘటనలు మరియు ఇతర రైతుల‌ ఆందోళనల నేపథ్యంలో, ఆరుగురు వ్యక్తులు గ్రామ గ్రామానికి వెళ్లి తప్పుడు సమాచారంతో రైతులను ప్రేరేపిస్తున్నారు. ఇది శాంతి విచ్ఛిన్నానికి దారితీస్తుంది . ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్ యొక్క నివేదికతో మేము పూర్తిగా సంతృప్తి చెందాము. ఒక సంవత్సరం పాటు శాంతిని నెలకొల్పడానికి రైతులు 50 లక్షల రూపాయల గ్యారెంటీ ఎందుకు ఇవ్వకూడదో కారణం చెప్పాలని ఈ నోటీసు ద్వారా సూచించబడింది.ʹʹ

దీనిపై స్పందించాల్సిందిగా సంభల్ ఎస్‌డిఎం దీపేంద్ర యాదవ్ ను కోరుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చేసిన ఫోన్ కాల్స్‌కు ఆయన‌ స్పందించలేదు. "నోటీసులు విధానంలో భాగం మరియు నిరసనలలో చురుకుగా పాల్గొన్న కొద్దిమందికి మాత్రమే జారీ చేయబడ్డాయి. ఆ వ్యక్తులను ఉటంకిస్తూ ఒక నివేదిక అధికారులకు పంపబడింది. ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగించే ఎటువంటి కార్యకలాపాలకూ పాల్పడకుండా వారిని అరికట్టడానికి భారీ మొత్తాన్ని అభ్యర్థించడం విధానపరమైనది. శాంతియుత నిరసనలతో మాకు సమస్య లేదు. ʹ అని సర్కిల్ ఆఫీసర్ కుమార్ అన్నారు.

ఇక 50 లక్షల బాండ్ అనేది క్లెరికల్ మిస్టేక్ అని పోలీసులు చెబుతున్నారు. "నేను ఎస్‌డిఎమ్‌తో మాట్లాడాను. ఈ లోపం సరిదిద్ది మళ్ళీ తాజా నోటీసులు వస్తాయి" అని సంబల్ ఎస్పీ చక్రేష్ మిశ్రా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. "ఎస్డిఎమ్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. అతను తిరిగి వచ్చాక రూ .50 వేల బాండ్ జారీ చేయటానికి చూస్తాము. ఎందుకంటే అంతకుముందు క్లెరికల్ లోపం" అని సంభల్ సర్కిల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సింగ్ అన్నారు.

అయితే బాండ్ 50 లక్షలా 50 వేలా అనేది సమస్య కాదని అసలు సమస్య పాలకులు పాల్పడుతున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలని రైతులు అంటున్నారు. భ‌యపెట్టి రైతులను ఉద్యమం నుండి వెనక్కి మళ్ళించడం సాధ్యంకాదనే విషయం వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారని బీకేయూ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

Keywords : uttarapradesh, farmers protest, police,
(2021-01-15 09:05:13)No. of visitors : 156

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్
బీహార్ లో వేలాది మంది రైతుల‌ ర్యాలీ - పోలీసుల దాడి
తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ‌ పొలంపనుల్లో...
more..


నిరసనల్లో