ʹకశ్మీర్ ఆగ్రహ కారణాలుʹ ... కశ్మీర్ పై ʹమలుపుʹ మరో పుస్తకం


ʹకశ్మీర్ ఆగ్రహ కారణాలుʹ ... కశ్మీర్ పై ʹమలుపుʹ మరో పుస్తకం

ʹకశ్మీర్

కశ్మీర్ గురించి కశ్మీరీల గురించి పాలకులు చేసే ప్రచారమే మన్ అమెదళ్ళలో తిష్టవేసే ప్రమాదం ఉన్న చోట అసలు కశ్మీర్ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ అసంత్రుప్తికి ఆగ్రహానికి కారణాలేంటి అనేది భారతీయులు తెలుసుకోవడం అవసరం. కశ్మీర్ గురించి మనమేమనుకుంటున్నామనేదానికన్నా కశ్మీరీలు ఏమనుకుంటున్నారు అనేదానికే ప్రాధాన్యముండాలి. అందుకే కశ్మీరీల ఆగ్రహం దుంఖం వాళ్ళ మాటల్లో మనదగ్గరికి తీసుకవచ్చేందుకు మలుపు ప్రచురణలు ఈ మధ్య కాలంలో చాలా కృషిచేసింది. ఇప్పుడు మళ్ళీ మరో పుస్తకం మనముందుకు తెస్తోంది. కశ్మీర్ కల్లోలం విషయంలో సాధికారత ఉన్న జర్నలిస్టు గౌహర్‌ గిలానీ రాసిన ʹKashmir: Rage and Reasonʹ అనే పుస్తకాన్ని ʹకశ్మీర్ ఆగ్రహ కారణాలుʹ పేరుతో తెలుగులో తీసుకవచ్చారు మలుపు ప్రచురణ కర్తలు. దీనిని తెలుగులోకి అనువాదం చేసింది రచయిత రమా సుందరి . ఈ పుస్తకానికి ముందు మాట లండన్ కు చెందిన ‌ ప్రఖ్యాత విద్యావేత్త, రచయిత, చరిత్రకారుడు డా. ఆండ్రూ వైట్‌హెడ్ రాశారు. ఆయన ముందు మాట మీ కోసం.....

కశ్మీర్‌ సంక్షోభానికి ఒక పరిష్కారం
డా. ఆండ్రూ వైట్‌హెడ్‌

సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో, అత్యవసరంగా పరిష్కారం కావాల్సిన వాటిలో కశ్మీర్‌ సంక్షోభం ఒకటి. సంక్లిష్టమైన కశ్మీర్‌ విషయాన్ని అర్థం చేసుకోకపోవటం కూడా ఈ సవాళ్లలో ఒకటి. 2019 ఆగస్టు 5న కశ్మీర్‌ ప్రత్యేకహోదాను రద్దు చేయటం, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా దిగజార్చటం, సామూహిక అరెస్టులు చేయటం, ఇవన్నీ చేయటానికి భద్రతా కట్టడులను విధించటం -కశ్మీర్‌ లోయను వ్యధలలోకి, ఇంకాస్త సంక్షోభంలోనికి దించటానికి ఉపయోగపడ్డాయి. భారతదేశంలో అత్యంత కల్లోలిత ప్రాంతం అయిన కశ్మీర్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకొనే విషయంలో పట్టు దొరకాలంటే కశ్మీరీలు చెప్పేది వినటమే అన్నిటికంటే సరైన పద్దతి. తనదైన ప్రత్యేక ముద్ర ఉండి, ఎంతో అనుభవం ఉన్న వ్యాఖ్యాత, జర్నలిస్టు గౌహర్‌ గిలానీకి కశ్మీర్‌ కల్లోలం విషయంలో సాధికారత వుంది. ఆ కల్లోలం గురించి ఆయన నిజాయితీగా, ఆవేశకావేషాలకతీతంగా మన ముందుంచాడు.

ఇంతకుముందు బయటవాళ్లు చెప్పిన కథనాలను కశ్మీరీలు తమ సొంత కథనాలుగా ఇప్పుడు ఎలా తిరిగి చెబుతున్నారో, శక్తివంతమైన భాష్యంతో గౌహర్‌ గిలానీ సమగ్రంగా వివరిస్తున్నాడు. ఈ రకమైన భాష్యానికి గిలానీ పుస్తకమే ఒక మైలురాయి. కశ్మీరీలు ఏమి భావిస్తున్నారో, వత్తిడి ఎక్కువైన చోట బతకటం ఎలా ఉంటుందో తెలియచేయటానికి గిలానీ తన గొంతుకను ఇస్తున్నాడు. తన అనుభవంతో, తాను చేసిన ఇంటర్వ్యూలతో, తను రాసిన కథనాలతో, కశ్మీరీలు అంత ఆగ్రహంగా ఉండటాన్ని వివరించటానికి అవసరమైన పదునైన వివరణలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. గిలానీ స్పష్టంగా, నిష్పక్షపాతంగా ఉన్నాడు. బుర్హాన్‌ వనిని చంపటం దగ్గర నుండి వచ్చిన ప్రతిఫలనాలు, కశ్మీరీ పండితుల ఫిర్యాదులు, కశ్మీరీ లోయను ఉచ్చులో పడేసిన ఆగ్రహం, హింసల వ్యక్తీకరణ కోసం సాహిత్యం, కవిత్వం, కథలలో చోటు చేసుకొన్న మార్పులు -గిలానీ పుస్తకం ఈ విషయాలనన్నింటినీ తడుముతుంది.

శాంతి స్థాపన, స్థిరత్వం తిరిగిపొందటానికి కశ్మీర్‌ లోయకు వచ్చిన అవకాశాలు ఎలా పోయాయో ఈ పుస్తకం బయటకు తెస్తుంది. అస్పష్టమైన, పక్షపాతమైన కథనాలకు సారధ్యం వహిస్తూ భారతదేశపు మీడియా సమస్యను ఎలా తీవ్రం చేస్తుందో చెప్పేవరకు ఈ పుస్తకం వెళ్లింది. రెండు మహా శక్తివంతమైన దేశాల మధ్య చిక్కుకొని పోయామని కశ్మీర్‌లో ఎంతోమంది భావిస్తున్నారని గిలానీ వివరిస్తాడు. ప్రపంచంలో ఎక్కువభాగానికి భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్‌ కేవలం ఒక సరిహద్దు సమస్య. కానీ చాలామంది కశ్మీరీలకు తుపాకి నీడ నుండి తప్పించుకొని తన భవిష్యత్తుని నిర్ణయించుకొనే అధికారం; ఆత్మగౌరవ, పరిష్కార దశగా చర్యలు తీసుకోవటం కొరకు జరుగుతున్న -ఒక లోతైన అన్వేషణ ఇది. సంప్రదింపులు మళ్లీ పునర్వ్యవస్థీకరించబడి, ప్రపంచంలోనే సుదీర్ఘకాలం నడుస్తున్న భౌగోళిక రాజకీయ తప్పుడు విధానాలకు పరిష్కారం కోసం -ఢిల్లీ, ఇస్లామాబాద్‌, శ్రీనగర్‌లకు అవసరమైన విధివిధానాలను గిలానీ కనిపెట్టాడు.

నేను దాదాపు పావు శతాబ్ధం కశ్మీర్‌కు ప్రయాణాలు చేశాను. అక్కడ వార్తలను బయట ప్రపంచానికి తెలియచేసాను. న్యాయమైన శాంతి అవకాశాల గురించి ఎప్పుడూ ఆశావాహంగానే ఉండేవాడిని. కశ్మీర్‌ లోయలో ఇప్పుడు హింసా స్థాయి 1990ల కంటే తక్కువగా ఉండొచ్చు, భద్రతా దళాల ఉనికి అంతగా వ్యాప్తి చెంది ఉండకపోవచ్చు. కానీ నేను కలిసిన కశ్మీరీలకు కోపం, అసంత ప్తి చాలా ఎక్కువ అయ్యాయి. భారతదేశపు అభిప్రాయ రూపకర్తలకు ఇది ఒక హెచ్చరిక అవ్వాలి. కశ్మీర్‌ లోయను లాక్‌డౌన్‌ చేయటం పరిష్కారం కాదు. ఈ చర్య కేవలం కశ్మీరీ ఉద్యమాన్ని కొత్తదారులు వెతుక్కునేటట్లు చేస్తుంది.

కశ్మీర్‌ వివాదం ఎప్పటి నుండో కొనసాగుతున్నప్పటికీ, దాని రూపురేఖలు మాత్రమే మారుతూ వస్తున్నాయి. యువ కశ్మీరీల వైఖరులు, వాళ్లు ఉపయోగించే ప్రతిఘటనా భాషా -పరిణామం చెందుతున్నాయి. కశ్మీర్‌ విషయంగా భారతదేశానికి ఒక బాధ్యత ఉంది. దాన్ని గౌరవించటంలో ఆ దేశం పరాజయం పొందింది. మంచి పరిపాలన, సామాజిక ఆర్థిక అభివ ద్ధి, కశ్మీరీలు గొంతు విప్పి మాట్లాడటానికి అనుమతి, ఆ భావ వ్యక్తీకరణకు ఒక వేదిక -ఇవన్నీ అందచేయటం కశ్మీర్‌ విషయంగా భారతదేశానికున్న బాధ్యతలు. కశ్మీరీలు చెప్పాలని అనుకొన్న విషయాలు భారతదేశంలో మిగతా ప్రాంతానికి అన్నిసార్లూ సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. కానీ అలా వినటం, అర్థం చేసుకోవటం లాంటి బాధ్యతలు ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనవి.

లండన్‌

జూన్‌ 2020

(డా. ఆండ్రూ వైట్‌హెడ్‌ ప్రఖ్యాత విద్యావేత్త, రచయిత, చరిత్రకారుడు. ఎ మిషన్‌ ఇన్‌ కశ్మీర్‌ అండ్‌ ద లైవ్స్‌ ఆఫ్‌ ఫ్రెడా: ద పోలిటికల్‌, స్పిరిట్యువల్‌ అండ్‌ పర్సనల్‌ జర్నీస్‌ ఆఫ్‌ ఫ్రెడా బేడి అనే పుస్తక రచయిత. ఆయన గతంలో బీబీసీలో పని చేశారు. లండన్‌లో ఉంటారు)

నోట్:
ఈ పుస్తకాలు లభించు చోటు: ఆంధ్రప్రదేశ్ లో విశాలాంధ్ర బుక్ హౌజ్, ప్రజాశక్తి,
అనేక బు క్ స్టాల్.‌
తెలంగాణ లో నవతెలంగాణ,నవచేతన,నవోదయ బుక్ హౌజ్

Keywords : kashmir, Kashmir: Rage and Reason, gowhar geelani
(2021-01-23 19:49:53)No. of visitors : 160

Suggested Posts


పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
more..


ʹకశ్మీర్