రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. దేశ విదేశాల్లో రైతు ఉద్యమానికి మద్దతుగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు రైతు ఉద్యమానిక రాజకీయ ఖైదీలు సైతం మద్దతును ప్రకటించారు. ఎల్గార్ పరిషద్ బీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీలుగా ఉన్న సామజిక కార్యకర్తలు రైతు ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. తలోజా జైలు నుంచి మహేష్ రౌత్, సుధీర్ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్, ఆనంద్ తేల్ తుమ్డే, రోనా విల్సన్, హనీ బాబు, సాగర్ గోర్ఖే, రమేష్ గైకోర్, అరుణ్ ఫెరేరా, వెర్నన్ గోంజాల్వెస్, స్టాన్ స్వామీ, గౌతమ్ నవలాఖ రైతు ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించారు. తలోజా జైల్లో డిసెంబర్ 23న ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. తలోజా జైలు నుంచి పంపించిన సందేశం పూర్తి పాఠం.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అమరులైన రైతులకు మా నివాళి. వాళ్ల అమరత్వం ఉద్యమాన్ని మరింత దృడంగా మలుస్తుందన్న విశ్వాసముంది.
జైలు నిర్బంధంలో ఉన్న మేము ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనే అవకాశంలేనందున ఒక రోజు నిరాహార దీక్ష ద్వారా మా సంఘీభావాన్ని ప్రకటించాలనుకున్నాము. మీరు లేవనెత్తిన డిమాండ్లు నూటికి నూరు శాతం న్యాయమైనవి. కేంద్రం ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకురావడం ద్వారా కార్పోరేట్లకు రైతులను బానిసలుగా మార్చేందుకు సిద్ధమైంది. ఈ చట్టాల సాయంతో రైతుల నుంచి భూములను లాక్కోవడమే అసలు ఎజెండా. తద్వారా అంబానీ, అదానీలకు రైతులను సేవకులుగా మార్చాలనుకుంటోంది. సమాజం కోసం రైతు తన సర్వస్వాన్ని వెచ్చించిన నేల ఇది. మీరు ఆరంభించిన ఈ ప్రజా ఉద్యమం చారిత్రకమైనదే కాదు, ప్రభుత్వానికి తన వాస్తవ స్థితిని గుర్తింపజేస్తుంది కూడా.
ప్రస్తుత ప్రభుత్వం, దాన్ని నడిపించే ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ ప్రజాస్వామానికి వ్యతిరేకం. తమ కులతత్వ ఎజెండాకు అడ్డుగా నిలిచే ఐక్యత, సోదరభావం, సమానత్వాలకు అవి వ్యతిరేకం. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుచేసేవారంటే వాటికి భయం. అందుకే ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేవాళ్లపై తప్పుడు ప్రచారం చేస్తాయి. తద్వారా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ అసహ్యకరమైన పద్దతిని అనుసరించడం ద్వారా వాళ్ళు ప్రజలపై తీవ్రవాదులు, దేశద్రోహులు, విచ్చిన్నకర శక్తులు లాంటి ముద్రలు వేస్తుంటారు. గడిచిన ఆరేడు సంవత్సరాల్లో ఇలాంటి ప్రచారం చేయడంలో సంఘ్ పరివార్ శక్తులు సఫలీకృతమయ్యాయి. కానీ... రైతు ఆందోళనల ముందు వారి పాచికలు పారలేదు. ఇప్పుడు వారిలో భయం తాలుకు వణుకును గమనించవచ్చు.
ప్రజాస్వామ్య శక్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న కాలంలో మీరు స్ఫూర్తిదాయకమైన పోరాటానికి శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో రైతు ఉద్యమం వెలుగు దివిటీగా మారుతుంది. మీరు సంఘ్ పరివార్ శక్తుల, మోదీ ప్రభుత్వ, దాని మంత్రులతో పాటు గోదీ మీడియాను కూడా ఓడించారు. వాటి కుట్రను ప్రజల ముందు బట్టబయలు చేశారు. పెట్టుబడిదారుల సేవలో మునిగిపోయిన మీడియా, ప్రభుత్వ నిజస్వరూపాలు బట్టబయలయ్యాయి. వాళ్లు ప్రజల పట్ల జవాబుదారీ తనాన్ని విస్మరించారు. రైతులపై బాష్ఫవాయు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించడమే కాక మతం పేరుతో రైతులను విభజించాలని చూసింది ప్రభుత్వం.
మరో వైపు దేశవాసుల చెమట, నెత్తురుతో నిర్మించబడిన ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కానుకలుగా సమర్పిస్తోంది ప్రభుత్వం. ఒకవైపు, పెట్టుబడిదారులకు రుణాలు ఇస్తూ పన్నులు మాఫీ చేస్తూ మరోవైపు సామాన్యులపై పన్నుల భారం పెంచుతోంది. దేశమంతా కోవిడ్ 19తో బాధపడుతుంటే, వలస కూలీలు వేల కిలోమీటర్లు నడిచివెళ్లేలా చేశారు ఈ పాలకులు. అదే సమయంలో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు ఒనగూర్చే దారులను అన్వేషించారు. వారికోసం లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటించింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని సామాన్యుడి నుంచే బలవంతంగా రాబడుతుంది కూడా. రైతులు, కార్మికులు తమ కఠోర శ్రమతో ఈ దేశాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్ని విక్రయానికి పెట్టారు ఈ పాలకులు. నిజానికి వాళ్లే అసలైన జాతి వ్యతిరేకులు, ఉగ్రవాదులు.
రైతు ఉద్యమానికి మద్దతుగా మేము చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో అనారోగ్య కారణాల వల్ల స్టాన్ స్వామీ, గౌతమ్ నవలాఖా పాల్గొన కూడదని నిర్ణయించాం. నిజానికి వారు నిరాహార దీక్షలో పాల్గొనడానికి సుముఖంగా ఉన్నప్పటికీ మా అభిప్రాయాలను గౌరవించారు. అదే సమయంలో నైతికంగా వారు ఈ ఆందొళనకు సంపూర్ణ మద్దుతునిస్తున్నారు.
రైతుల ఐక్యత, పోరాట స్ఫూర్తి దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మేము వారి పోరాటంలో పూర్తిగా భాగం. రైతులు చేస్తున్న ఈ పోరాటంలో దేశ ప్రజలంతా భాగమవ్వాలని రైతుల గొంతుకకు మరింత శక్తినివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
- మహేష్ రౌత్, సుధీర్ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్, ఆనంద్ తేల్ తుమ్డే, రోనా విల్సన్, హనీ బాబు, సాగర్ గోర్ఖే, రమేష్ గైకోర్, అరుణ్ ఫెరేరా, వెర్నన్ గోంజాల్వెస్, స్టాన్ స్వామీ, గౌతమ్ నవలాఖ
(తలోజా జైలు నుంచి)
Keywords : farmers protest, BK16, Taloja jail, Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movement
(2021-01-25 01:07:22)
No. of visitors : 190
Suggested Posts
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |
| మృత్యు శయ్యపై ఉన్న వరవర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టువరవరరావు మృత్యుముఖంలో చావుబతుకుల్లో మంచంపై పడిఉన్నాడు. అతనికి తగు చికిత్స అత్యవసరం. |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movementActivists-Intellectuals detained in the Elgar Parishad-Bhima Koregaon case, to join farmers in their struggle by observing day long symbolic hunger
strike. |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరెఆరు సంవత్సరాలుగా UAPA కేసులో విచారణ ఖైదీగా పూణే జైల్లో ఉన్న కామ్రేడ్ కంచన్ నానావరె జనవరి 24న మరణించారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన 38 సంవత్సరాల, ఆదివాసీ కామ్రేడ్ కంచన్ నానవారే మావోయిస్టు ఉద్యమంలో పాల్గొందని ఆరోపిస్తూ 2014లో |