ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపించిన రైతులపై హత్యాయత్నం కేసులు


ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపించిన రైతులపై హత్యాయత్నం కేసులు

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులపోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒకవైపు ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు రెండున్నర లక్షల మంది రైతులు 29 రోజులుగా రోడ్లపైనా ఉండగా మరో వైపు రాష్ట్రాల్లో కూడా ఉద్యమం తీవ్రం చేశారు రైతులు.

కాగా హర్యాణా ముఖ్యమంత్రికి నల్ల జెండాలతో నిరసన తెలిపిన రైతులపై హత్యాయత్నం కేసు బనాయించారు పోలీసులు. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించడానికి మంగళవారం నాడు హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంబాలాకు వచ్చారు.

అగ్రసేన్ చౌక్ వద్దకు చేరుకోగానే వేలాది మంది రైతులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అడ్డంపడి నల్ల జెండాలు చూపించారు. ముఖ్యమంత్రికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ దశలో ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందుకు వెళ్ళడమే గగనమైపోయింది. చివరకు సీఎం కాన్వాయ్ వెనక్కి మళ్ళి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా పోలీసులు రైతులపై తీవ్రంగా లాఠీచార్జ్ చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులు 13 మంది రైతులపై హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడిన కేసులు నమోదు చేశారు.

కాగా రైతులపై అబద్దపు కేసులు బనాయించడం పట్ల భారతీయ‌ కిసాన్ యూనియన్ అంబాలా జిల్లా అధ్యక్షుడు మల్కిత్ సింగ్ మండిపడ్డారు. "రైతులు నిరసన తెలపడానికి వెళ్ళారు ఎవ్వ‌రినీ చంపడానికి కాదు. రైతులు ఎప్పుడు ఆందోళనలు చేసినా పోలీసులు మాపై హత్యాయత్నం ఆరోపణలే చేస్తుంటారుʹʹ అని మల్కిత్ సింగ్ ఆరోపించారు.

ʹʹఅయితే ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడల‌ ద్వారా రైతుల గొంతును అణచివేయలేదు. కొన్నిసార్లు, వారు రైతులను కాంగ్రెస్ సభ్యులుగా ముద్ర వేస్తారు, మరొక సందర్భంలో, ఆందోళన చేస్తున్న‌ రైతులు ఇతర ప్రతిపక్ష పార్టీలతో సంబంధం కలిగి ఉన్నారని చెబుతారు. కానీ మేము కేవలం రైతులం. రైతుల కోసం మాట్లాడే రాజకీయ నాయకులను మాత్రమే గ్రామాల్లోకి అనుమతించేలా గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. రైతు వ్యతిరేక నాయకులను గ్రామాల్లోకి అనుమతించబోంʹʹఅన్నారాయన.

Keywords : farmers protest, haryana, manohar lal khattar, Black Flags,Haryana Chief Ministerʹs Convoy Turns Around As Farmers Show Black Flags
(2021-01-15 10:01:03)



No. of visitors : 158

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

ʹముందు ఖాలిస్తానీ అన్నారు..తర్వాత పాకిస్తానీ అన్నారు..ఇప్పుడు మావోవాదీ అంటున్నారుʹ

కేంద్రం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఉద్యమం 18వ రోజుకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం‍) జైపూర్, ఢిల్లీ రహదారిపై మార్చ్ నిర్వహించి ఆ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించిన రైతులు ఆ మేరకు వేలాది మంది బయలుదేరారు. రాజస్తాన్ నుండి, దక్షిణ హర్యాణా నుండి వేలాది వాహనాల్లో రైతులు బయలు దేరారు. ఆ రోడ్డ

రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌

రైతుల చట్టబద్ధమైన, శాంతియుత నిరసనలను ప్రభుత్వం అణచివేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ జాతీయ మహిళా సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశాయి. పోరాడుతున్న రైతులు, రైతు సంస్థల నాయకులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, విపత్తు సమయంలో అమల్లోకి వచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు.

తీవ్రమైన రైతుల ఉద్యమం ‍- రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్

ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ‌ కేసులు బనాయించి అరెస్టు చే

బీజేపీ సర్కార్ పై రైతుల పోరు ఉధృతం - డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఉధృతంగా సాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు ఒక వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు రైతు అసంఘాల మధ్య చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Search Engine

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్
బీహార్ లో వేలాది మంది రైతుల‌ ర్యాలీ - పోలీసుల దాడి
తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ‌ పొలంపనుల్లో...
more..


ముఖ్యమంత్రికి