దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్


దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్

దొర

(వీక్షణం జనవరి 2021 సంచికలో సంపాదకులు ఎన్ వేణు గోపాల్ రాసిన సంపాదకీయ వ్యాఖ్య )

రైతుల భూములు గుంజుకోని కంపెనీలకు కట్టబెట్టుటానికి, రైతులు ఏమి పండిచ్చాల్నో, ఏమి పండిచ్చొద్దో కంపెనీలు చెప్పుటానికి, తిండిగింజలు గుమ్ముల్ల దాసుకొని కరువు పుట్టిచ్చి పిరంగ అమ్ముకోవటానికి కంపెనీలకు సౌలత్ జెయ్యటానికి ఢిల్లి సర్కారు ఖానూన్లు జేసింది. ఆ ఖానూన్లకు ఖిలాఫ్ గ దేశం దేశమంత ఒక్క దిక్కయితున్నది. ఆ ఖానూన్ల మీద భైస్ జరిగెటప్పుడు దొర నేను భీ ఖిలాఫే అన్నడు. గప్పుడె పట్నంల ఓట్ల పండుగొచ్చింది. దొరకూ పువ్వు గుర్తోళ్లకూ పెద్ద లడాయి అయితానట్టు కనబడ్డది. ఎహె గదంత ఉల్లెక్కాల, నువ్వు కొట్టినట్టు జెయ్యి, నేను ఏడ్చినట్టు జేత్త అని శాత్రం జెప్పినట్టు గది దోస్తానె అని దోస్తులన్నరు గని నేను నమ్మలె. ఇగ ఖానూన్ అయిపొయ్యి, గాడ సిక్కులోల్లు, వేరెటోల్లు ఎగుసందార్లందరు ధర్నా జేసుడు మొదలు బెట్టంగనె దొర గుడ గాలి ఎట్టెట్టనో ఉందిరో అనుకున్నడు. గాలి ఎటుదిక్కు వోతె గటు దిక్కె మనం గద. ఖానూన్లకు ఖిలాఫ్ గ దేశమంత బంద్ అంటె దొర గుడ ఔ నిచ్చమే, బంద్ జెయ్యాలె అన్నడు. పాపం శాన రోజులకు చిన్నదొర రోడ్డు మీద గూసునె. గులాబి జెండ బట్టుకోని పట్నమంత గాయి గాయి జేసిరి. ఢిల్లి సర్కారు తోటి, పువ్వు గుర్తోల్ల తోటి యుద్ధమే అని దొర లడాయి గీత గీసె. అబ్బో జోరుగున్నదిరో కత అనుకుంటి. కని ఇండ్ల ఏదో ఇక్మతుంటది, దొర మాదండి మనిషి, గంత అల్కటోడు గాదు అని సోంచాయిస్తనే ఉన్న. ఇగ రెండొద్దులు గాంగనె దొర ఢిల్లికి పాయె. ఆడ ఇద్దరు లీడల్ర ముంగట తల్కాయొంచుకోని నిలబడె. కావలిచ్చుకునె. శాలువ గప్పె. ఇదేందిరో గిట్లొచ్చింది కత. కొండంత రాగం దీసి అని సామెత జెప్పినట్టు లడాయి లడాయి అనుకుంట కత్తి దీస్కోని ఉరికి, ఆడికి పొయి ఒరల నుంచి సర్రుమని తీశెటాలకు గండ్ల కత్తి లేకపాయెనా, పువ్వే ఉండెనా అని ఇచ్చిత్ర పడ్డ. ఢిల్లి నుంచి గాలి మోటల్ర పట్నం వచ్చి దొర సీద ఎర్రవల్లికి పాయె. కోరంటో గీరంటో ఏదో అంటరు గద, గత్తర రాకుంట. గది గావచ్చులే, రెండు వారాలు గాంగనె ఇంట్లకెల్లి ఎల్లుతడు, మల్ల కత్తి దూస్తడు, అవ్వల్ దర్జ లడాయి జేస్తడు. ఇగ ఢిల్లి తోని ఆర్ పార్. సర్దార్ పాపన్న మల్ల పుట్టిండు సూడు అనుకున్న. రెండు వారాలయింది. ఇగ దొర ఇంట్లనుంచి ఎల్తాండు, పట్నం వస్తాండు, అగ్బారోల్లతోని మాట్లాడ్తాండు అంటె మస్తు సంబురపడితి. నేను గుడ దొర ఎన్క నిలబడి లడాయిల దిగుదునా, కత్తి పట్టుకుందునా, టుపాకి పట్టుకుందునా అని మన్సుల తల్లడం బిల్లడం అయితి. ఇగ ఏం జెప్పుదు కత! ఢిల్లి జేసిన ఖానూన్లు అవ్వల్ దర్జ ఖానూన్లు. గీడ తెలంగాణల గుడ గవ్వి ఎంటనె అమల్ల బెడ్త అంట జెప్పుకొచ్చె దొర. లడాయి యాడ బాయెనో, తిట్లు దిగబారబోసుడు యాడ బాయెనో, అచ్చం మోడి మాట్లాడినట్టు, అమిత్షా మాట్లాడినట్టు మాట్లాడబట్టె దొర. గింత ఉల్టపల్ట ఎట్లాయె. అయినా నమ్మినోని పిచ్చి గాని దొర ఎన్నడన్న పువ్వు గుర్తుకు ఖిలాఫున్నడా, నాకు దెల్వకడుగుత. నన్ను మించిన ఇందువున్నడా అన్నోడేనాయె, చంద్రబాబును మించి కంపెనీలకు సాతిచ్చిటోడేనాయె. అన్నిటికన్న బరాబర్ సాటుగ ఇద్దరే కూసున్నప్పుడు అమిత్షా ఏం కేసు కాయిదాలు దీసిండో, ఎప్పుడు గిరఫ్తార్ జేత్తనని బెదిరిచ్చిండో. పాపం, దొర ఉట్టిగనే ఉల్టా పల్టా అయితడా, ఎంత మోపయిందో...

- ఎన్. వేణు గోపాల్

Keywords : farmers protest, bjp, trs, kcr , n.venugopal, veekshanam
(2021-05-04 23:27:42)No. of visitors : 279

Suggested Posts


మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ అని బ్

కొమురం భీం వర్ధంతి ఎన్నడు ? అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ?

మిత్రులారా, నిన్న కొమురం భీం ʹవర్ధంతి సందర్భంగాʹ (ఒక పత్రిక అయితే ʹజయంతిʹ అని కూడ రాసింది!) రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన సభలు, సమావేశాలు, శ్రద్ధాంజలి ప్రకటనల వార్తలు చూస్తుంటే మనం మన పొరపాట్లను సవరించుకోవడానికి సిద్ధంగా లేమని తెలిసివచ్చి జాలీ నవ్వూ వచ్చాయి.....

Search Engine

మహానుభావా, దయచేసి దయచేయండి...ప్రధానికి అరుంధతీ రాయ్ విజ్ఞప్తి
మన ఈ పరిస్థితికి ఎవరిని నిందిద్దాం ?
షట్ అప్.. గెట్ అవుట్.. జర్నలిస్టులపై నోరు పారేసుకున్న బండి సంజయ్
సుధా భరద్వాజ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?
జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి - యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు
నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం... చీకట్లను చీల్చుకొని మళ్ళీ జనం మధ్యకు వస్తాం - విరసం
కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ - ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్
Professor Hargopal wrote a letter to KCR - demanding the lifting of the ban on 16 mass organizations
COVID19 : ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి - మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు
ఆస్పత్రిలో నా భర్తను చిత్ర హింసలు పెడుతున్నారు... ఆయనను జైలుకు తరలించండి: సీజేఐకి జర్నలిస్టు కప్పన్ భార్య విన్నపం
ఆక్సీజన్ కొరత పై రూమర్స్ ప్రచారం చేస్తే ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం
16 సంఘాల మీద నిషేధంపై ప్రజా సంఘాల ప్రెస్ మీట్ వీడియో
ʹతెలంగాణలో ప్రజా సంఘాలపై నిషేధం ఎమర్జన్సీని గుర్తుకు తెస్తున్నదిʹ
ʹప్రజా సంఘాలపై నిషేధం కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టʹ
ʹమావోయిస్టు ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజా సంఘాలపై నిషేధం విధించడం దుర్మార్గంʹ
తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థి సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలి - AISF
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాల పై పెట్టిన నిషేధాన్ని ఎత్తి వేయాలి :ఎస్.ఎఫ్..ఐ
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం - న్యూ డెమాక్రసీ
పౌరహక్కుల సంఘానికి నాయకుణ్ణవుతా అన్నవాడే ఆ సంఘాన్ని నిషేధించడం అనైతికం
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం
ఆదివాసీ ప్రాంతాలపై బాంబు దాడుల నేపథ్యంలో శాంతి కమిటీకి సీనియర్ జర్నలిస్టు రాజీనామా
పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల
థూ.......
మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌
more..


దొర