రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్


రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్

రైతుల

హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ‌ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పట్టణ ప్రాంతాలైనప్పటికీ రైతులు చేస్తున్న పోరాట ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

సోనేపట్, అంబాలా మేయర్ పీఠాలను అధికార బీజేపీ కూటమి చేజార్చుకుంది. అలాగే హిస్సార్ జిల్లా ఉకలానా, రేవారీ పరిధిలోని ధారూహెరాలను బీజేపీ కోల్పోయింది. ఈ రెండు స్థానాలూ జేజేపీ నేత డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాకు కంచుకోటలు కావడం గమనార్హం.

హరియాణా హోమ్ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గం అంబాలాలో బీజేపీ ఓటమి ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల్లో బీజేపీ ఓటమి పాలైందని తెలిసిన అనంతరం ధర్నాల్లో ఉన్న రైతులు మిఠాయిలు పంచుకుని, ఆనందంతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అంబాలాలో జనచేతన పార్టీకి చెందిన శక్తి రాణి శర్మ 800 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో ఆమె మేయర్ కాబోతున్నారు. జనచేతన పార్టీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ భార్య రాణి శర్మ.

తొలిసారి హరియాణాలో ప్రత్యక్ష విధానంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సోనేపట్‌లో కాంగ్రెస్‌కు చెందిన మేయర్ అభ్యర్థి లలిత్ బాత్రా 14,000 ఓట్లతో విజయం సాధించారు. ʹʹసోనిపట్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం రైతులు నిరసనలు తెలుపుతున్న సింఘూ సరిహద్దుల పక్కనే ఇది ఉందన్న సంగతి తెలిసిందేʹʹ అని కాంగ్రెస్ పార్టీ నేత శ్రీవాత్సవ ట్వీట్ చేశారు.

అయితే, పంచకుల మేయర్ పదవి మాత్రం అతికష్టంతో బీజేపీ దక్కించుకుంది. ఇక్కడ కుల్ భూషణ్ గోయల్ విజయం సాధించారు. మొత్తం ఏడు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అంబాలాలో 20 సీట్లకు గాను అధికార బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలవడం గమనార్హం. అంబాలాలో బీజేపీ ఎనిమిది, జనచేతన పార్టీ ఏడు, కాంగ్రెస్ మూడు, హరియాణా డెమొక్రాటిక్ ఫ్రంట్ మూడు స్థానాల్లో విజయం సాధించాయి.

సోనెపట్‌లో మొత్తం 20 స్థానాలుండగా బీజేపీ 10, కాంగ్రెస్ 9, స్వతంత్రులు ఒకచోట గెలిచారు. ఇక, పంచకులలో బీజేపీ, కాంగ్రెస్ చెరో తొమ్మిది చొప్పున గెలుపొందాయి. ధర్హేరా, సప్లా, ఉకలానాలో స్వతంత్ర అభ్యర్థులు మేయర్లు‌గా గెలిచించారు.

Keywords : haryana, farmers protest, municipal elections, Amid farm protests, jolt to BJP-JJP in Haryana civic polls
(2021-01-25 19:03:16)No. of visitors : 170

Suggested Posts


మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక

అనేక రాష్ట్రాల నుండి మహిళా రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి సిద్దమవుతున్నారు. ట్రాక్టర్లర్యాలీలో తామే ముందుండబోతున్నామని ప్రకటించారు మహిళా రైతులు. ఇ‍ందుకోసం అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నారు.

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
more..


రైతుల