రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు


రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

రైతాంగ

కేంధ్ర ప్రభుత్వం తీసుక వచ్చిన 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాదపూ 38 రోజులుగా దేశంలో రైతాంగ చేస్తున్న పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఆంధ్రా ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ మీడియాకు విడుదల చేసిన‌ ప్రకటన....

భారతదేశ ఆరిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత తీవ్రమైన‌ వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది 1960లోప్రవేశపెట్టబడిన హరిత విప్లవం ఈ సంక్షోభానికి నాంది పలికింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిన కాంగ్రెస్ తోపాటు వివిధ ప్రాంతీయ పార్టీలు అనుసరించిన సామ్రాజ్యవాద అనుకూల విధానాలనే మోడీ ప్రభుత్వం నేడు మరింత వేగంగా, క్రూరంగా అమలు చేయటం వల్లనే ఈ వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్ర స్థాయికి చేరుకున్న ది.

1991లో దేశంలో ప్రవేశ పెట్టబడిన నూతన ఆర్థిక‌ విధానాలు (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ) కార్పోరేటు, మార్కెట్ శక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పాయి. 1995 లో ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) ఏర్పడిన తర్వాత దానితో భారత దళారీ పాలకులు కుదుర్చుకున్న ఒప్పందాల వలన ప్రభుత్వ రంగ ఆజమాయిషీ గల దేశ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థానంలో దేశ, విదేశీ కార్పోరేటు సంస్థల ఆజమాయిషీ ముందుకొచ్చింది. WTO పై ఆధిపత్యం ఉన్న అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు విధించిన షరతులకు తల ఒగ్గి దేశంలో వ్యవసాయ రంగానికి రాను రానూ రయితీలను తగ్గించేస్తున్నారు. మరో వైపు ఎరువుల ధరలు, నీటి పన్ను, కరెంటు రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. అందుకు తగ్గట్టు పంటల రేట్లు మాత్రం పెరగడం లేదు.

ఈ నేపథ్యంలో WTO నిబందనలకు అనుగుణంగా వ్యవ‌సాయాన్ని కార్పోరేటీకరణ చేసే పనిలో మోడీ ప్రభుత్వ నిమగ్నమైంది. దేశంలోని మొత్తం వ్యవసాయాన్ని కార్పోరేట్ల పర‍ం చేసి రైతులను తమ భూముల్లోనే కూలీలుగా మార్చే కుట్రకు తెరతీసింది. 3 వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను తమ భూములనుండి బేదఖలు చేసి అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు సిద్దమయ్యింది.

కేంద్ర ప్రభుత్వం పాలపడుతున్న కుట్రను గ్రహించిన దేశ రైతాంగం ప్రస్తుతం అలుపెరగని పోరాటం చేస్తోంది. రైతాంగం చేస్తోన్న ఈ పోరాటానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తోంది. దాంతో మోడీ ప్రభుత్వం దుష్ప్రచారానికి తెరలేపింది.

బీజేపీ, ఆరెస్సెస్ వాటి ఐటీ సెల్ లు రైతులపై సోషల్ మీడియాలో మీడియాలో దుర్మార్గమైన అబద్దపు ప్రచారానికి తెగించాయి. రైతుల ఉద్యమంలో చైనా, పాకిస్తాన్ హస్తమున్నదని, ఉగ్రవాదులున్నారని..ఇలా రకరకాల ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయని రైతులు పోరాటాన్ని ముందుకు నడిపించడమే కాక, దేశంలోని అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో కూడా విజయం సాధించారు.

ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల దాడులను ఎదుర్కొంటూ రైతులు చేస్తున్న సమరశీల పోరాటానికి మా పార్టీ AOBSZC సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. ఆత్మహత్యలు, బలిదానాలతో ఇప్పటి వరకు ప్రాణాలర్పించిన 40 మందికి పైగా రైతులకు నివాళులర్పిస్తున్నాము. వారి కుటుంబసభ్యులకు, బందు మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

ప్రియమైన రైతులారా ! ప్రజలారా!

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

సామ్రాజ్య‌వాదానికి దాస్యం చేస్తున్న భారత బడా బూర్జునా, భూస్వామ్య‌ వర్గాలను , వారు సంరక్షిస్తున్న అర్థ వ‌లస, అర్థ‌ భూస్యామ్య వ్యవస్థ‌ను కూలదోసి దేశంలో ధీర్ఘకాల ప్రజాయుద్ద పంథాలో వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం తప్ప ఈ వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి వేరే దారి లేదు.

దున్నేవారికే భూమి, విప్లవ ప్రజా కమిటీలకే సర్వాధికారాలు లభించే వరకు, నూతన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. రైతాంగం ఎన్ని ఆటు పోట్లు, ఆటంకాలు, ఎగుడు దిగుళ్ళు ఎదురైనా నూతన ప్రజాస్వామిక భారత దేశాన్ని స్థాపించడంలో భాగంగా తమ విప్లవ ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకునే వైపు దృఢంగా ముందుకు సాగాలని కోరుతున్నాం.

విప్లవాభినందనలతో
గణేష్,
కార్యదర్శి,
ఆంధ్రా ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC)

CPI మావోయిస్టు


Keywords : cpi maoist, farmers, struggle,
(2021-01-25 22:25:04)No. of visitors : 574

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

ʹముందు ఖాలిస్తానీ అన్నారు..తర్వాత పాకిస్తానీ అన్నారు..ఇప్పుడు మావోవాదీ అంటున్నారుʹ

కేంద్రం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఉద్యమం 18వ రోజుకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం‍) జైపూర్, ఢిల్లీ రహదారిపై మార్చ్ నిర్వహించి ఆ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించిన రైతులు ఆ మేరకు వేలాది మంది బయలుదేరారు. రాజస్తాన్ నుండి, దక్షిణ హర్యాణా నుండి వేలాది వాహనాల్లో రైతులు బయలు దేరారు. ఆ రోడ్డ

రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌

రైతుల చట్టబద్ధమైన, శాంతియుత నిరసనలను ప్రభుత్వం అణచివేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ జాతీయ మహిళా సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశాయి. పోరాడుతున్న రైతులు, రైతు సంస్థల నాయకులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, విపత్తు సమయంలో అమల్లోకి వచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు.

బీజేపీ సర్కార్ పై రైతుల పోరు ఉధృతం - డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఉధృతంగా సాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు ఒక వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు రైతు అసంఘాల మధ్య చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

తీవ్రమైన రైతుల ఉద్యమం ‍- రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్

ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ‌ కేసులు బనాయించి అరెస్టు చే

తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ‌ పొలంపనుల్లో...

ఫోటోలో ఉన్న బాలిక పేరు ప్రియ. ఆమెకు 11 ఏళ్ళ వయస్సు. మగపిల్లలే వ్యవసాయం చేస్తారనే పితృస్వామిక‌ భావజాలాన్ని బద్దలు కొడుతూ ఈ బాలిక అద్భుతంగా పొలం పనులు చేస్తోంది. ఈమె తండ్రి సతీష్ కుమార్ ఉద్యమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళాడు. దాంతో పంట చెడిపోకుండా ప్రియ రంగంలోకి దిగింది.

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
more..


రైతాంగ