మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక


మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక

‌కేంద్రం తీసుకవచ్చిన కార్పోరేట్ అనుకూల రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో దేశ రైతాంగం చేస్తున్న ఉద్యమం తీవ్రమవుతోంది. ప్రభుత్వంతో 40 రైతు సంఘాలు ఏడు సార్లు జరిపిన చర్చల్లో ఏమీ తేలకపోగా ప్రభుత్వం తన కార్పోరేట్ అనుకూల విధానాల నుండి వెనక్కి తగ్గడానికి ససేమిరా అనడంతో రైతు సంఘాలు తమ పోరాటాన్ని ఉదృతం చేయడానికి నిర్ణయించాయి.

జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోకి ట్రాక్టర్ మార్చ్ నిర్వహించడానికి నిర్ణయించిన రైతు సంఘాలు దానికి తగ్గ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. అనేక రాష్ట్రాల నుండి మహిళా రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి సిద్దమవుతున్నారు. ట్రాక్టర్లర్యాలీలో తామే ముందుండబోతున్నామని ప్రకటించారు మహిళా రైతులు. ఇ‍ందుకోసం అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నారు.

హర్యాణా రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభించింది. జింద్-పాటియాలా జాతీయ రహదారిలోని ఖట్కర్ టోల్ ప్లాజా వద్ద‌ సోమవారం జింద్ జిల్లాకు చెందిన మహిళల‌ కోసం శిక్షణ శిభిర‍ం ప్రారంభమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల మహిళలు ట్రాక్టర్లు నడపడానికి మహిళలు శిక్షణ పొందుతున్నారు. పితృస్వామ్య హర్యానాలో ఇది నిజంగా గొప్ప మార్పు మార్పు. జనవరి 26 న మహిళలు ట్రాక్టర్లు నడుపుతూ రాజధానిలోకి వెళ్లడం ద్వారా దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అదే విధంగా రైతు కుటుంబాలు మొత్తం ఈ ఉద్యమంలో ఉన్నాయని దేశానికి చాటబోతున్నారు.

అయితే ఈ మహిళల్లో చాలా మందికి ట్రాక్టర్ నడపడం వచ్చు. తమ వ్యవసాయ పనుల కోసం వాళ్ళు అనేక సార్లు ట్రాక్టర్ నడిపి ఉన్నారు. అయితే నేషనల్ హైవేలపై ట్రాక్టర్ నడపడం మాత్రం వాళ్ళకు కొంత కొత్త. అదే ఇప్పుడు ఆ మహిళా రైతులు నేర్చుకుంటున్నారు. అయితే మహిళలకు శిక్షణనివ్వడం చాలా సులువుగా ఉండని వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటున్నారని ఓ శిక్షకుడు మీడియాకు చేప్పాడు.

టోల్ ప్లాజాలో జరిగే శిక్షణా సమావేశాలకు జిల్లాకు చెందిన వందలాది మంది మహిళలు హాజరవుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సన్నాహాలు జరుగుతున్నాయని సఫా ఖేరి గ్రామానికి చెందిన సిక్కిం నైన్ అనే మహిళ తెలిపారు. ʹఇది ప్రభుత్వానికి మేము చూపిస్తున్న ట్రైలర్ మాత్రమే. ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనడానికి మేము మా ట్రాక్టర్లను ఎర్ర కోటకు తీసుకువెళతాము. ఇది చారిత్రక సంఘటన అవుతుంది ʹ అని 38 ఏళ్ల నైన్ అన్నారు.

"మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది. మేము వెనకడుగు వేయబోం, మమ్మల్ని తేలికగా తీసుకోకండి. ఇది రెండవ స్వాతంత్య్ర‌ యుద్ధం. మేము ఈ రోజు పోరాడకపోతే, భవిష్యత్ తరాలకు మేము ఏం సమాధానం చెప్పాలి? ʹ అని ప్రశ్నించింది నైన్

తనను తాను ʹఖట్కర్ గావ్ హై, రాజ్‌పాల్ కి ఘర్వాలి హన్, సరోజ్ నామ్ హై (నా గ్రామం ఖాట్కర్, నా భర్త రాజ్‌పాలా, నాపేరు సరోజ్ʹ అని పరిచయం చేసుకుంటూ 35 ఏళ్ల యువతి, ʹనేను ఒక రైతు బిడ్డను. ప్రభుత్వం ఇప్పటికే రైతులపై చాలా దారుణాలకు పాల్పడింది, కాని ఇక మేము దీనిని ఇక సహించము. ʹ అని చెప్పింది.

ఖాట్కర్, సఫా ఖేరి, బార్సోలా, పోక్రీ ఖేరి గ్రామాల నుండి మహిళలు శిక్షణ కోసం వస్తున్నారని రైతు విజేందర్ సింధు తెలిపారు. మహిళలు ఈ విధంగా ముందుకు రావడం ఇక్కడ చాలా పెద్ద విషయమే కానీ ఇది చాలా సహజమైనది అని వృద్ధ రైతు సత్బీర్ పెహ్ల్వాల్ అన్నాడు.

"మా బిడ్డలు కొందరు దేశ‌ సరిహద్దుల వద్ద పోరాడుతున్నారు, మరికొందరు బిడ్డలు జాతీయ రాజధానిని గెరావ్ చేశారు," అని పెహ్ల్వాల్ అన్నారు

రిపబ్లిక్ డే రోజు జవాన్లు చేసే పెరేడ్ లాగానే మా కిసాన్లు చేసే ట్రాక్టర్ పెరేడ్ ఉంటుందని ఖాప్ నాయకుడు ఆజాద్ సింగ్ పాల్వాన్ అన్నాడు

Keywords : farmers protest, delhi, tractors rally, ʹDaughters of farmersʹ on tractors headed for Delhi
(2021-01-25 01:05:23)No. of visitors : 233

Suggested Posts


రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్

హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ‌ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దె

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
more..


మహిళా