ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్


ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్

ఏపీలో

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల వైపు నిలబడి మాట్లాడుతున్న వారి అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ రోజు కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ అరెస్టుతో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. రాజ్యాంగ వ్యతిరేకమైన యూఏపీఏ చట్టాన్ని మోపుతూ ఏపీ పాలకులు అక్రమ అరెస్టులు సాగిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 27న‌ అమరుల బంధు మిత్రుల సంఘం అధ్యక్షురాలు బొప్పూడి అంజమ్మ
అదే రోజు చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరి అరెస్టులతో ప్రారంభమైన ఈ అరెస్టుల పరంపర ఈ రోజు(జనవరి6) దుడ్డు ప్రభాకర్ అరెస్టుతో కొనసాగుతున్నది. ఈరోజు ఉదయం 8 గంటలకు విజయవాడలోని తన ఇంటి నుండి పిడుగురాళ్ల పోలీసులమని చెప్పి వచ్చిన కొందరు ఆయనను తీసుకెళ్ళారు. ఇంట్లో పుస్తకాలు , ఇతర వస్తువులు కూడా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను వెంట రానివ్వలేదు.

ఈ అరెస్టును ఏపీ, తెలంగాణలకు చెందిన ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని పలు సంఘాలు డిమా‍ండ్ చేశాయి.

ʹఉపాʹ రద్దు పోరాట కమిటీ ప్రకటన‌

కులానిర్ములానా పోరాట సమితి (KNPS) రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ అక్రమ అరెస్టును ఖండించండి.

పౌర హక్కుల సంఘం
నెల్లూరు జిల్లా కమిటీ,
మరియు ప్రజా సంఘాలు

కుల నిర్మూలనా పోరాట సమితి(KNPS) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ గారిని ఈరోజు ఉదయం 8 గంటలకు విజయవాడలోని తమ ఇంటి నుండి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.పిడుగురాళ్ల పోలిసులమని చెప్పి, ఏదో కేస్ ఉందని చెప్పి తీసుకెళ్లారు.కుటుంబ సభ్యులను వెంట రానివ్వలేదు ఇంట్లో పుస్తకాలు , ఇతర వస్తువులు కూడా తీసుకెళ్లారు. దీన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.

గత నెల రోజులుగా AP లో జగన్ ప్రభుత్వం ప్రజాసంఘాల నాయకులను టార్గెట్ చేసి ఇప్పటికి 10మందిని అరెస్ట్ చేసింది. ఉపా లాంటి నల్ల చట్టాలను ప్రయోగించి దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో నిర్భందించడం ప్రజాస్వామ్యమా?

రాజన్న రాజ్యం అంటే ఇదేనా? వీరు ఎట్లా దేశద్రోహులో, వీరు చేసిన ద్రోహమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రజలపై నిర్భంధం ప్రయోగించి ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేసిన నియంతలు చరిత్రలో ఏమయ్యారో ఒక సారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపై ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ అక్రమ అరెస్తులను ఆపలని, అరెస్ట్ చేసిన వారందరిని బేషరతుగా విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇట్లు
ఓ. అబ్బాయి రెడ్డి (ఉపా రద్దు పోరాట కమిటీ )
ఎల్లంకి వెంకటేశ్వర్లు (పౌర హక్కుల సంఘం )
R. శివశంకర్ (OPDR)
M. బ్రహ్మం (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ )
V. సుధాకర్ (KNPS)
అర్జున్ బాలకృష్ణ (ASA)

దుడ్డు ప్రభాకర్ అక్రమ ఆరెస్టును ఖండిద్దాం !

కుల నిర్మూలనా పోరాట సమితి,తెలంగాణ

కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడి ,పిడికెడు ఆత్మగౌరవం కోసం అగ్రకుల మనువాదులతో కలబడుతున్న దళిత పీడిత కులాలకు అండగా నిలబడి , కుల నిర్మూలన కోసం పోరాడుతున్న దుడ్డు ప్రభాకర్ ను మళ్లీ అక్రమంగా , అన్యాయంగా అరెస్ట్ చేశారు. మనువాదులు , దోపిడీ వర్గాలు దళిత ,పీడిత కులాల మీద విచ్చలవిడిగా దాడులు చేస్తూ అత్యాచార హత్యలకు తెగబడుతున్నప్పుడు బాదితులకు అండగా KNPS నిలబడి పోరాడుతోంది. దోషులను శిక్షించమని బాధితులతో కలిసి ఉద్యమిస్తోంది. దోషులను అరెస్ట్ చేసి శిక్షించడం ఇష్టం లేని పాలకులు పోలీసులు ఇలా ప్రజాసంఘాల నేతలను అక్రమంగా నిర్బంధిస్తారు. జగన్ పాలనలో నేడు ఆంద్రప్రదేశ్ అంతటా అత్యాచార హత్యలు , భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. దేవాలయాల మీద దాడుల పేర దళిత క్రిస్టియన్స్ మీద వేధింపులు మొదలయ్యాయి.వీటన్నింటినీ KNPS ఆంద్రప్రదేశ్ కమిటీ ఖండిస్తూ న్యాయం కోసం పోరాడుతోంది. దోషులను శిక్షించి ప్రజలకు భరోసా ఇవ్వలేని జగన్ ఇలా ప్రజాసంఘాల నేతలను అరెస్ట్ చేసి అగ్రకుల దోపిడీదారులను సంతృప్తి పరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన దుడ్డు ప్రభాకర్ ప్రతి అరెస్ట్ వెనుక ఇవే కారణాలు ఉన్నాయి.పోలీసులు , ప్రభుత్వాలు ఏమి చెప్పినా కారణాలు మాత్రం KNPS ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పోరాడడమే అసలు కారణం. అందుకే మళ్లీ ఇలా అరెస్ట్ చేసి మనువాదులను తృప్తి పరచాలనీ జగన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇలా ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తున్న వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో కుక్కుతున్నారు.ఇది ఎంత మాత్రం ప్రజాస్వామికం కాదు. ఇది ప్రజలమీద దోపిడీని , పీడనలను , కుల హింసలను , లైంగిక హింసలను ప్రభుత్వం పట్టించుకొనట్టే అని అర్ధం చేసుకోవాలి. బాధితుల పక్షాన మాట్లాడే గొంతులను నులిమేస్తున్న పాలకులను ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎనాటికైనా పాలకులకు గుణపాఠం చెబుతారు కూడా. దేశంలో ప్రజాస్వామిక హక్కులను అమలు చెయ్యాలని ప్రజలంతా ఏకమై పాలకులను నిలదియ్యాలని దళిత ,గిరిజన, ఆదివాసీ, ప్రజాసంఘాలు , ప్రజాస్వామిక వాదులను కుల నిర్మూలనా పోరాట సమితి (KNPS) తెలంగాణ రాష్ట్ర కమిటీ తరుపున కోరుతున్నాం.
ప్రజా సంఘాల నేతల అరెస్టులను వెంటనే నిలిపివేయ్యాలి !!
అక్రమ నిర్బందాల్లో ఉన్న ప్రజా సంఘాల కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చెయ్యాలి.

జయరాజు , రాష్ట్ర అధ్యక్షులు
అభినవ్ బూరం , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Keywords : duddu prabhakar, andhrapradesh, ys jagan, arrest, UAPA, BJP
(2021-04-06 06:36:29)No. of visitors : 251

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు
కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్
మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
more..


ఏపీలో