ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు


ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు

ఉత్తరప్రదేశ్ బదాయూలో గుడికి వెళ్ళిన 50 మహిళపై పూజారి, అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు దుర్మార్గంగా మాట్లాడింది. అత్యాచార బాధిత కుటుంబ సభ్యులను కలవడానికి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి బుధవారం బదాయూ వెళ్లారు. కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ʹʹఆమె ఎవరి నుంచైనా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు భావిస్తే.. బయట తిరిగే సమయాన్ని సరిగ్గా గుర్తు పెట్టుకోవాలి. ఆలస్యంగా బయటికి వెళ్లకుండా జగ్రత్త పడాలి. అలాంటి వ్యక్తి సాయంత్రం ఆలస్యంగా బయటికి వెళ్లకపోయినా, లేదంటే ఎవరైనా కుటుంబ సభ్యుల్ని వెంట తీసుకు వెళ్లినా ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేది. ఈ ఘటన జరిగి ఉండేది కాదుʹʹ అని అన్నారు.

చంద్రముఖి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా నెటిజనులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళే ఇలా మాట్లాడటమేంటని నెటిజనులు విమర్షలు గుప్పించారు. దీంతో అప్రమత్తమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ చంద్రముఖిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ʹʹఆమె (చంద్రముఖి) ఇలా ఎలా వ్యాఖ్యానించిందో అర్థం కావడం లేదు. ఏ సమయంలోనైనా ఎక్కడైనా తిరిగేందుకు మహిళకు సర్వాధికారాలు ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సమాజంతో పాటు మనకు ఉందిʹʹ అని రేఖా శర్మ ట్విట్టర్ లో ‌రాసుకొచ్చారు.

ఈ నెల మూడవ తేదీన సాయంత్రం బదాయూ జిల్లా మేవాలి గ్రామంలో 50 ఏళ్ళ అంగన్ వాడి మహిళ రోజూ వెళ్ళినట్టు గానే ఆ గ్రామంలో గుడికి వెళ్ళింది. ఒంటరిగా ఉన్న ఆమెపై గుడి పూజారి హంత్ బాబా సత్యనారాయణ, అతని అనుచరుడు వేద్ రాం, డ్రైవర్ జస్పాల్ లు అత్యాచారానికి ఒడి గట్టారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో ఆ ముగ్గురు దుర్మార్గులు ఆమెను దారుణంగా కొట్టారు. కాలు, పక్కటెముకలను విరగొట్టారు. ఆమె జననావయవంలో రాడ్డు జొప్పించి మరీ అఘాయిత్యానికి పాల్పడి చంపేశారు.

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితుల పక్షం ఉండాల్సిన అధికార గణ‍ం బాధితులనే దోషులను చేయడం బీజేపీ హయాంలో పెరిగిపోయింది. ఇదే రాష్ట్రంలోని హత్రాస్ లో 19 ఏళ్ళ యువతిని అత్యాచారం చేసి చంపేస్తే... ఆ యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసేశారని, గొంతుకూడా కోశారని, వెన్నెముక విరిగిపోయిందని ఆ బాలిక కుటుంబం చెప్పినప్పటికీ...వైద్యం చేసిన వైద్యులు కూడా ద్రువీకరించినప్పటికీ "బాధితురాలి నాలుక కత్తిరించే వార్త పూర్తిగా తప్పు, మేము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. ఆమె వెన్నెముక విరిగిపోయిందనేది కూడా అబద్దం. ఆమె మెడ ఎముకపై గాయాలు అయ్యాయి. అత్యాచారం జరిగినట్టు కూడా వైద్యులు కనుగొనలేదు. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై ఎలాంటి గాయాలు లేవుʹʹ అని హత్రాస్ జిల్లా ఎస్పీ విక్రంత్ వీర్ బహిరంగంగా ప్రకటించిన విషయం మనం మర్చిపోగలమా? ʹʹ ఈ మీడియా వాళ్లు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్తారు. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. స్టేట్‌మెంట్‌ను మార్చడం.. మార్చకపోవడం మీ ఇష్టం. కానీ మేం మార్చగలంʹʹ అని సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ లష్కర్ బెదిరించిన విషయం మర్చిపోగలమా ? హత్రాస్ లో బీజేపీ నాయకులైన ఠాకూర్లు నిందితులకు మద్దతుగా ఊరేగింపులు తీయడం, బాధిత కుటుంబాన్ని బెధిరించడం మర్చిపోతామా ? ఈ రోజు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్ర ముఖి మాటలను కూడా ఈ నేపథ్యంలో చూస్తే మనకు ఈ దేశంలో ఏం జరుగుతుందో స్పష్టంగా అర్దమవుతుంది.

Keywords : uttarapradesh, NCW Member Says ʹBadaun Gangrape Victim Shouldnʹt Have Gone Out Alone In Eveningʹ, NCW, Chandramukhi
(2021-04-11 07:58:56)No. of visitors : 1507

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

Search Engine

ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు
కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్
మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
more..


ఆమె