ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ


ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ

ఢిల్లీలో

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ఢిల్లీలో జరపతలపెట్టిన ట్రాక్టర్ పెరేడ్ కు పోలీసులు అనుమతినిచ్చారు. రైతులకు, ఢిల్లీ పోలీసులకు కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలకు ఈ రోజు తెరపడింది. జనవరి 26 న జరిగే రైతు ర్యాలీకి పోలీసులు ఎట్టకేలకు శనివారంనాడు ఓకే చెప్పారు. రైతులు తమ ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించి 100 కీలోమీటర్ల మేర పెరేడ్ చేయడానికి అనుమతి ఉన్నదని భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారీ) అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపారు.

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని రైతులు చాలా రోజుల క్రితమే నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దీనిపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ నిర్ణయం తీసుకునే అధికారం పోలీసులదే అని సుప్రీ చెప్పడంతో చివరకు పోలీసులు రైతులతో చర్చలు జరిపారు. ట్రాక్టర్ మార్చ్ ను ఢిల్లీ బైట నిర్వహించాలని పోలీసులు రైతులకు సూచించారు. అయితే రైతులు అందుకు అంగీకరించకపోవడంతో పోలీసులు దిగిరాక తప్పలేదు.

ట్రాక్టర్ పెరేడ్ లో ఎన్ని ట్రాక్టర్లు పాల్గొంటాయన్నది రైతులు తెలియజేయలేదు. అయితే పెరేడ్ రూట్ మ్యాప్ కు సంబంధించి ఈ రాత్రి రైతు సంఘాలు చర్చలు జరిపి రేపు పోలీసులకు తెలియజేస్తామని చెప్పారు రైతులు.

స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ...ʹʹజనవరి 26 న రైతుల ʹకిసాన్ గణ‌తంత్ర పరేడ్ʹ అధికారిక గణతంత్ర దినోత్సవ కార్యక్రమంపై దాని భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి ప్రభావం చూపదుʹʹ అని చెప్పారు.

"పరేడ్‌లో పాల్గొనే రైతులు క్రమశిక్షణ పాటించాలని, కమిటీ జారీ చేసిన సూచనలను తప్పకుండా పాటించాలని నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను" అని భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన గుర్నం సింగ్ చాదుని అన్నారు.

ఢిల్లీకి వివిధ సరిహద్దుల్లో 50 రోజులకు పైగా ఉన్న దాదాపు 2 లక్షలకు పైగా రైతులతో పాటు కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనడానికి అనేక రాష్ట్రాల నుండి మరింత మంది రైతులు వస్తున్నారు.
ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనడానికి ఈ రోజు 30,000 ట్రాక్టర్లు మరియు ట్రాలీలు ఖనౌరి (సంగ్రూర్, పంజాబ్) మరియు దబ్వాలి (సిర్సా జిల్లా, హర్యానాలో) నుండి బయలుదేరాయి ʹఅని భారతీయ‌ కిసాన్ యూనియన్ (ఏక్తా-ఉగ్రహాన్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ కోల్రికలన్ శనివారం అన్నారు. . ఈ రాత్రి వారు తిక్రీ సరిహద్దుకు చేరుకుంటారు.

తమ కవాతులో కనీసం 20 రాష్ట్రాల రైతుల ప్రాతినిధ్యం ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. జాతీయ జెండాను వాహనాల పైన ఉంచుతామని, ఏ రాజకీయ పార్టీ జెండాలను అనుమతించబోమని వారు ఇంతకు ముందే చెప్పారు. వారు తమ రిపబ్లిక్ డే ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా వివిధ రాష్ట్రాల పట్టిక ప్రదర్శించాలని యోచిస్తున్నారు.

Keywords : farmers protest, delhi, police, Delhi police gives nod to farmersʹ Republic Day tractor parade
(2021-02-24 08:52:21)No. of visitors : 204

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.

కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌

నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

Search Engine

మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగర‌న్ మంచ్ʹ మూక దాడి
Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital
జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య‌ డిమాండ్
ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR
రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన‌ పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ?
రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్
ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్
CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers
నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన‌ రైతు నాయకుడు
జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌
రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు
కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌
నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
more..


ఢిల్లీలో