వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె


వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె

వ్యవ‌స్థ

ఆరు సంవత్సరాలుగా UAPA కేసులో విచారణ ఖైదీగా పూణే జైల్లో ఉన్న‌ కామ్రేడ్ కంచన్ నానావరె జనవరి 24న మరణించారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన 38 సంవత్సరాల, ఆదివాసీ కామ్రేడ్ కంచన్ నానవారే మావోయిస్టు ఉద్యమంలో పాల్గొందని ఆరోపిస్తూ 2014లో ఆమె భర్త అరుణ్ బెల్కేతో పాటు అరెస్టు చేసి, చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నిరోధక) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెల్కే ప్రస్తుతం జైలులోనే వున్నారు.ఆమె పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతుండగా జైలుకు వెళ్ళిన తర్వాత మెదడు సంబంధిత వ్యాధులు కూడా వచ్చాయి. జనవరి 16 న ఆమెను పూణేలోని సాసూన్ ఆస్పత్రిలో చేర్చగా జనవరి 24న ఆమె మరణించారు.

ఆమె మెదడుకు శస్త్రచికిత్స జనవరి 16 న జరిగే వరకు జైలు అధికారులుకానీ ఆసుపత్రి అధికారులు కానీ తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె కుటుంబం, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

గత రెండేళ్ళలో, కంచన్, తన న్యాయవాది ద్వారా, సెషన్స్ కోర్టు, బొంబాయి హైకోర్టు రెండింటిలోనూ అనేక సందర్భాల్లో వేసిన బెయిల్ పిటిషన్లు ప్రతిసారీ తిరస్కరణకు గురయ్యాయి అని ఆమె న్యాయవాది పార్థ్ షా తెలిపారు. అక్టోబరులో, వైద్య కారణాలపై బొంబాయి హైకోర్టులో ఒక దరఖాస్తు వేసి, ఆమె క్షీణించిన ఆరోగ్య పరిస్థితి వివరించడంతో పాటు గుండె మార్పిడి కోసం వైద్యుల సిఫారసు లేఖను కోర్టు ముందు ఉంచారు. కానీ ఆ దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

ఆమె ఆరోగ్య పరిస్థితి, అత్యవసర వైద్య సంరక్షణ అవసరం గురించి అభిప్రాయాన్ని తెలపడానికి కోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. జీవన్మరణం లాంటి అత్యవసర విషయాన్ని వినడానికి కూడా నెలల తరబడి సమయాన్ని తీసుకున్నది కోర్టు. ఈ సమయంలో ఆమె కన్నుమూసింది.

కంచన్ మీద నమోదు చేసిన తొమ్మిది కేసులలో, ఇప్పటికే ఆరు కేసులలో ఆమె నిర్దోషిగా తీర్పులు వచ్చాయి. గడ్చిరోలి, పూణే , గోండియాలలో ఒక్కో కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఆమె మహారాష్ట్రలోని వివిధ‌ జైళ్లలో గడిపిన ఆరు సంవత్సరాలు విచారణ ఖైదీగానే వుండింది.

"బెల్కే కుటుంబానికి ఈ రోజు (జనవరి 24) ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఒక లేఖ వచ్చింది. ఆ తరువాత, ఆమె అనారోగ్యంతో మరణించిందని ఫోన్ వచ్చింది, ʹ అని లాయర్ షా చెప్పారు. కంచన్ మృతదేహాన్ని చంద్రపూర్ జిల్లాలోని బలార్షా నగరంలో వున్న బెల్కే కుటుంబం వద్దకు తరలించాలని న్యాయవాదుల బృందం కోర్టులో పిటిషన్ వేస్తోంది. మరణించిన తరువాతనైనా, ఆమె శరీరాన్ని యిస్తే అంతిమ క్రియలు చేయాలని కుటుంబం భావిస్తోంది.

కామ్రేడ్ కంచన్ 2004 లో విద్యార్థుల హక్కుల కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. దేశభక్తి యువ మంచ్ అనే సంస్థలో 2004 నుండి కంచన్ పని చేశారు. ఆ సంస్థలో కంచన్ , బెల్కే తదితర వందకు పైగా విద్యార్థులు సభ్యులుగా పని చేసామని ఆమెతో పాటు ఆ ఉద్యమంలో పని చేసిన అనురాధ సోనులే గుర్తుచేసుకున్నారు. సోనులేను కూడా కబీర్ కళా మంచ్ సాంస్కృతిక కార్యకర్తలతో పాటు ఇలాంటి ఆరోపణలతో 2011 లో మరొక కేసులో అరెస్టు చేశారు. ఆమె 2014 లో బెయిల్‌పై బయటకు వచ్చింది.

"మేము అనేక విద్యార్థుల ఆందోళనలలో పాల్గొన్నాము. రైతాంగ, ఆదివాసీ, దళిత వర్గాలకు సంబంధించిన అనేక సమస్యలకు వ్యతిరేకంగా గొంతెత్తాము. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ కంచన్ చాలా చురుకుగా పాల్గొనేది ʹ అని సోనులే జ్ఞాపకం చేసుకున్నారు. ఆ తరువాత ʹదేశభక్తి యువ మంచ్ʹ మావోయిస్టుల "ఫ్రంటల్ ఆర్గనైజేషన్" అని ఆరోపణతో బెల్కేతో పాటు కంచన్ 2008 లో మొదటిసారిగా అరెస్టు అయ్యారు. వీరిద్దరితో పాటు మరో డజనుకు పైగా ఇతర విద్యార్థులపై కూడా ఈ ప్రాంతంలో నక్సల్ కార్యకలాపాల్లో పాల్గొన్నారని UAPA కింద కేసులు పెట్టారు. ఏడు నెలల పాటు జైలులో ఉన్నాక నిర్దోషులుగా విడుదలయ్యారు.

కంచన్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలియడంతో సాసూన్ ఆసుపత్రికి వెళ్ళింది సోనులే. కానీ కంచన్ ను చూడటానికి అనుమతి యివ్వలేదు కాని శస్త్రచికిత్స గురించిన సమాచారం ఇచ్చారు. తలనొప్పి అని ఫిర్యాదు చేస్తోందని, మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్ ఆమెకు చెప్పారు. అయితే పూణేకు చెందిన మరో న్యాయవాది గాయత్రి కాంబ్లేకు కంచన్‌ను చూడటానికి అనుమతి లభించింది.

శస్త్రచికిత్స తర్వాత కంచన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కంచన్ ను కలవడానికి బెల్కేకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కాని జైలు అధికారులు వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయన చూసే లోపలే ఆమె కన్నుమూశారని న్యాయవాదులు ఆరోపించారు.

గత ఏడాది మార్చిలో, దేశంలో COVID-19 వ్యాప్తి చెందిన వెంటనే, ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 11,000 మందికి పైగా ఖైదీలను విడుదల చేస్తానని హామీ ఇచ్చింది. అయితే కొంతమంది ఖైదీలను విడుదల చేసి, మరింతమందిని జైల్లో అదనంగా చేర్చింది.

MCOCA, PMLA, MPID, NDPS, UAPA వంటి ప్రత్యేక చట్టాల (ఐపిసి కాకుండా) కింద తీవ్రమైన ఆర్థిక నేరాలు / బ్యాంక్ మోసాలు, నేరాలకు పాల్పడిన విచారణ ఖైదీలను విడుదల చేయడానికి వీలు లేదని మహారాష్ట్ర హోం శాఖ ఏకపక్షంగా నిర్ణయించింది. ఆ విధంగా యుఎపిఎ కింద విచారణ ఎదుర్కొంటున్న ఖైదీగా కంచన్ బెయిల్‌పై విడుదల కాలేదు. ఆమె తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు.

ఈ దేశంలో ఏ నేరాలు చేయకుండానే, అసమ్మతి గొంతులు వినిపిస్తున్నందుకు వేలాది మంది విచారణ ఖైదీలుగా ఏళ్ళకు ఏళ్ళు జైళ్ళలో మగ్గిపోతుండటం విషాదమైతే విచారణలో ఉండగానే కొందరు మరణించడం ఈ వ్యవస్థ దుర్మార్గానికి పరాకాష్ట.

Keywords : maharashtra,Kanchan Nanaware, chandrapur, pune jail, Awaiting Trial for Six years, UAPA Prisoner Dies While in Custody
(2021-02-24 08:54:00)No. of visitors : 329

Suggested Posts


కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు

వరవరరావు మృత్యుముఖంలో చావుబ‌తుకుల్లో మంచంపై ప‌డిఉన్నాడు. అతనికి త‌గు చికిత్స అత్య‌వ‌స‌రం.

భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు.

Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movement

Activists-Intellectuals detained in the Elgar Parishad-Bhima Koregaon case, to join farmers in their struggle by observing day long symbolic hunger strike.

రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అమరులైన రైతులకు మా నివాళి. వాళ్ల అమరత్వం ఉద్యమాన్ని మరింత దృడంగా మలుస్తుందన్న విశ్వాసముంది.

Search Engine

మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగర‌న్ మంచ్ʹ మూక దాడి
Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital
జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య‌ డిమాండ్
ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR
రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన‌ పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ?
రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్
ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్
CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers
నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన‌ రైతు నాయకుడు
జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌
రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు
కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌
నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
more..


వ్యవ‌స్థ