ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
కేంద్రం తీసుకవచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో భాగంగా రైతులు ఈ రోజు ఎర్ర కోట వద్దకు చేరుకొని జెండా ఎగరేయడంపై బీజేపీ నాయకులు, ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన పలు టీవీ ఛానళ్ళు అబద్దపు ప్రాచారానికి తెగబడ్డారు. రైతులు జాతీయ జెండాను దించేసి ఖాలిస్తాన్ జెండా ఎగురవేశారని తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. ఈ వాదన చేసిన వాళ్ళలో బిజెపి ఢిల్లీ ప్రతినిధి హరీష్ ఖురానా, వరుణ్ గాంధీ పార్లమెంటరీ కార్యదర్శి ఇషితా యాదవ్, బిజెపి మద్దతుదారులు దివ్య కుమార్ సోతి, విక్రాంత్ కుమార్, సుమిత్ కడెల్, సుమిత్ కడెల్, సుమీత్ ఠక్కర్, అనురాగ్ దీక్షిత్, షెఫాలి వైశ్య ఉన్నారు. టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ లాంటి పలు ఛానళ్ళు కూడా ఇదే ప్రచ్చారాన్ని చేశాయి.
నిజానికి అక్కడ జరిగిందేమిటి ? ఎర్ర కోటపై ఉన్న త్రివర్ణపతాకాన్ని రైతులు దించేశారా? ఖాలిస్తాన్ జెండాను ఎగరవేశారా ? అన్న ప్రశ్నలతో ఫాక్ట్ చెక్ చేసిన ది వైర్, ది క్విట్ తదితర వెబ్ సైట్ లు అవన్నీ అబద్దాలని తేల్చి చెప్పాయి. ఆ సైట్ లు చెప్పిన వివరాల ప్రకారం ఎర్ర కోటపై ఉన్న మూడు రంగుల జెండాను రైతులు అసలు ముట్టుకోలేదు. దాని దగ్గరికి కూడా రైతులు వెళ్ళలేదు. జాతీయ జెండా కన్నా తక్కువ ఎత్తులో బైట ఖాళీగా ఉన్న ఓ పోల్ కు వాళ్ళు తమ జెండాను ఎగరేశారు. రైతులు ఎగరేసిన జెండా కూడా ఖాలిస్తాన్ జెండా అన్నది పచ్చి అబద్దం. అది సిక్కు మతానికి చెందిన జెండా.
ఇక ఫాక్ట్-చెక్ ఏం చెబుతోంది ?
1. భారతీయ జెండాను మార్చలేదు లేదా తీసివేయలేదు
నిరసనకారులు ఖాళీ పోల్ పై జెండాను ఎగురవేశారు. వారు భారత జెండాను తీసివేయలేదు . ఖలీస్తాన్ జెండాను ఎగురవేయలేదు. ఆ విషయాన్ని ధృవీకరించే అనేక వీడియోలు బైటికి వచ్చాయి.
2. నిరసనకారులు ఎగురవేసిన జెండా ఖలీస్తాన్ జెండా కాదు
నిరసన తెలిపిన రైతులు ఎగురవేసిన జెండాలు నిషన్ సాహిబ్ లేదా సిక్కు మత జెండాలు.
ʹపసుపు లేదా కుంకుమ ఖండాతో త్రిభుజాకార జెండాలు - రెండు కత్తులు - సిక్కు జెండాలు. అవి ఖలీస్తాన్ జెండాలు కావు ʹఅని పంజాబ్ రచయిత జర్నీస్ త్రూ ఫాల్ట్ లైన్స్ రచయిత అమన్‌దీప్ సంధు అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, ʹపాలన మార్పుకు చిహ్నంగా ఒక జెండాను ఎగురవేసినప్పుడు, మునుపటి జెండాను దించి, కొత్త జెండాను విప్పారు. ఈ సందర్భంలో భారతదేశం యొక్క జెండా అయిన త్రివర్ణా పతాకాన్ని ఆందోళనకారులు ముట్టుకోలేదు. సిక్కు జెండాను ఎగురవేయడం అంటే ఈ దేశ ప్రజలైన సిక్కులు తమ గుర్తింపును కూడా నొక్కిచెప్పాలని కోరుకున్నారు. వారు కూడా ఈ దేశ ప్రజలుగా లెక్కించబడాలని కోరుకుంటారు. ʹ
జర్నలిస్ట్ హర్తోష్ సింగ్ బాల్ కూడా...అది ఖలీస్తాన్ జెండా కాకుండా సిక్కు మత జెండా అని ట్వీట్ చేశారు.
ప్రభుత్వం నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా పంజాబ్ పట్టికలో సిక్కు జెండాలు కూడా కనిపిస్తాయి. ఇది ఈ సంవత్సరం కూడా ప్రదర్శించబడింది.
Keywords : farmers protest, delhi, Fact-Check: Flags Hoisted at Red Fort Neither Replaced Tricolour, Nor Promoted Khalistan
(2021-02-24 20:30:24)
No. of visitors : 269
Suggested Posts
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది. |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు. |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి. |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది. |