నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !


నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !

నిన్న

(గురు ప్రీత్ వాసి అనే రచయిత రాసిన ఈ ఆర్టికల్ ఎన్.వేణుగోపాల్ తెలుగులోకి అనువదించారు)

(రైతుల నిరసన ఆందోళన మొదలైన రోజు నుంచీ ఆ రైతులతో పాటు ఉన్న గురుప్రీత్ వాసి అనే మిత్రుడు తన వాల్ మీద నిన్న రాత్రి రాసిన ఆగ్రహ ప్రకటన తెలుగు చేసి మీతో పంచుకోవాలనిపించింది. -ఎన్.వేణుగోపాల్)

భారతదేశం అనే భావనలో నాకు విశ్వాసం ఉంది.
నేను భారతీయుణ్నని గర్వంగా చెప్పుకుంటాను.
హింస అనే ఆలోచననే నేను వ్యతిరేకిస్తాను
నేను గాంధీ అభిమానిని.
నాకు ఢిల్లీ అంటే ప్రేమ. మన జాతీయ పర్వదినాలను నేను ప్రేమిస్తాను.
ఇదంతా ఇంత ప్రత్యేకంగా ఎవరికైనా చెప్పవలసిన అవసరం రాకుంటే బాగుండుననుకుంటాను.
కాని ఇవాళ్టి రోజు ఎటువంటిదంటే, ఒక శాంతియుతమైన నిరసన ప్రదర్శన శత్రుపూరితంగా మారి నేను అనుమానితుడిగా మారిపోయాననిపిస్తున్నది. రెండు నెలలుగా మన సరిహద్దుల మీద కుతకుత ఉడుకుతున్న వేదననూ, అసంతృప్తినీ చూడకుండా మనం కళ్లు మూసుకున్నాం. ఇవాళ అది పెటిల్లున ఉబికివస్తే, ఇదేదో అనూహ్యంగా, ఆఘాతం జరిగినట్టు ప్రతి ఒక్కరూ కనుబొమలు ఎగరేస్తున్నారు. దవడ కండరాలు బిగించుకుంటున్నారు.
మరి ఏం జరుగుతుందని మీరు ఆశించారు?
ఎర్రకోట దిగ్బంధనాన్ని ఛేదించుకుని వెళ్లకుండా కొన్ని వందల మంది ఆగంతకులను ఇరవై వేల మంది సాయుధ బలగాలు, మహా ఘనత వహించిన పోలీసు దళాలు, అల్లర్లను అణచివేసే ప్రత్యేక బలగాలు, కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఆపలేకపోయాయని అనుకుంటున్నారా?
ఆ చక్రబంధాన్ని బద్దలు కొట్టి రైతులు లోపలికి ప్రవేశిస్తుంటే మహా కర్కోటకుడైన మన హోం మంత్రి ధ్యానముద్రలో మునిగి ఉన్నాడనుకుంటున్నారా?
ట్రాక్టర్ల ఊరేగింపును ఆపమని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన అదే పోలీసులు, కొద్ది రోజుల్లోనే హఠాత్తుగా, అతి సులభంగా, ʹఉదారంగాʹ ఆ దరఖాస్తును ఉపసంహరించుకుని అనుమతి ప్రసాదించారు.
ఇది రైతుల నిరసన ప్రదర్శనలను భగ్నం చేయడానికి జరిగిన అత్యంత భయానకమైన కుట్ర అనీ పన్నాగమనీ మీకు అనిపించడం లేదా?
గత రాత్రి నేను సింఘులో ఉన్నాను. అధికారులకూ, నలబై రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చాకూ మధ్య ఒప్పందం కుదిరిన ట్రాక్టర్ ఊరేగింపు మార్గాన్ని తాము అనుసరించబోమని, సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వామి కాని ఒక రైతుల బృందం హఠాత్తుగా ప్రకటించింది.
భారతీయ జనతా పార్టీ తొత్తుగా అందరికీ తెలిసిన దీప్ సిద్ధు హఠాత్తుగా వేదిక మీదికి వచ్చి, రైతుల నిరసనలకు భంగకరంగా వేర్పాటువాదం మీద రెచ్చగొట్టే ఉద్రేకపూరిత ఉపన్యాసం ఇచ్చాడు.
దానికి వందలాది మందిమి సాక్షులుగా ఉన్నాం. ఈ ప్రమాదకరమైన మలుపు ఏ ముప్పు తీసుకురాబోతుందో అంచనావేస్తూ మేమంతా కంటిమీద రెప్ప వాలకుండా రాత్రి గడిపాం. నాకైతే ఊపిరి ఆడలేదు.
ఇవాళ ఉదయం, రైతుల ఊరేగింపు మధ్యాహ్నం ప్రారంభం కావాలని అనుకున్నాం. కాని ʹకార్యాచరణ తెల్లవారు జామునే మొదలవుతుందిʹ అని ఒక పత్రికావిలేఖరికి లోపలి నుంచి సమాచారం అందిందని నాతో పాటు ఉన్న వ్యక్తి రాత్రే నాకు చెప్పారు.
ఆమెకు ఈ సంగతి ఎలా తెలిసింది అని నేను ఆలోచించాను.
ఈ ʹలోపలి నుంచిʹ అందిన సమాచారం ప్రకారమే, సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వామి కాని ఒక రైతు బృందం ఉదయం ఎనిమిది గంటలకే సరిహద్దు దగ్గరికి చేరింది. సరిగ్గా ఆ సమయానికే ఖాళీ డిటిసి బస్సులు వ్యూహాత్మకంగా తెచ్చి అడ్డంగా పెట్టారు. అంటే ఆ బస్సులను ధ్వంసం చేసినా, తొలగించినా ʹప్రభుత్వ ఆస్తులʹ విధ్వంసం అనే వార్త చాల సులభంగా కెమెరాలకు ఎక్కే అవకాశం ఏర్పడిందన్నమాట. అమ్ముడు పోయిన టివి మీడియా మొత్తమూ ఈ దృశ్యాలను నిరంతరాయంగా చూపుతూ వచ్చాయి. వారు అంత కచ్చితంగా ఆ సమయానికి అక్కడికి చేరగలిగారన్నమాట.
సరిగ్గా సినిమాల్లో జరిగినట్టుగా బిజెపి తొత్తు దీప్ సిద్ధూ నాయకత్వంలోని గుంపుకు ఎర్రకోట భవనం లోపలికి వెళ్లే అవకాశమూ దక్కింది. అది కూడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండే రిపబ్లిక్ డే రోజున!!
గుంపులుగా గుంపులుగా పోలీసులూ, సాయుధ పారా మిలిటరీ బలగాలూ ఎర్రకోట గోడల మీది నుంచి అగ్గిపుల్లల లాగ కిందికి పడిపోయారు!
ఇదంతా ఉన్నది ఉన్నట్టు నమ్మేంత అమాయకులమా, వెర్రివాళ్లమా మనం? ఇదేమైనా నెట్ ఫ్లిక్స్ వాళ్లు తీస్తున్న సినిమానా? భద్రతా బలగాల చెయ్యి లేకుండా ఇటువంటి ఘటన జరుగుతుందని మీరు ఊహించగలరా?
ఆ తర్వాత ఒక మత జెండా (నిషాన్ సాహిబ్) ను ఎర్రకోట మీద ఒక స్తంభానికి కట్టారు. తద్వారా రైతులందరూ ఖలిస్తాన్ మద్దతుదారులే అని చూపదలచుకున్నారు. అంటే రెండు నెలలుగా ప్రభుత్వం నమ్మించడానికి ఎంతో కష్టపడుతున్న అబద్ధాన్ని నిజం చేసేశారు.
ఇంత పెంట మీ కళ్లలో, చెవుల్లో, నోట్లో కుక్కుతుంటే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా, థూ...
విషాదం ఏమంటే, సంయుక్త కిసాన్ మోర్చాలోని నలభై సభ్య సంఘాలూ అమాయకంగా తమకూ ప్రభుత్వానికీ ఒప్పందం కుదిరిన మార్గం మీద తమ ట్రాక్టర్ ఊరేగింపును అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికే ప్రారంభించాయి. కొద్ది మంది స్నేహితులతో కలిసి ఈ ట్రాక్టర్ల ఊరేగింపుతో పాటు కొన్ని గంటల పాటు నేనూ సాగాను. ఢిల్లీ ప్రజానీకం ఈ ఊరేగింపు మీద పూల రెక్కలు జల్లుతూ ఉండింది. ఈ అధికారిక ఊరేగింపును ఒక్కటంటే ఒక్క జాతీయ చానల్ కూడ చూపలేదు. సంయుక్త కిసాన్ మోర్చా చానల్ లో చూపుతున్న ఈ ఊరేగింపు దృశ్యాలను దేశమంతా చూడకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మకంగా ఇంటర్నెట్ ఆపేశారు.
ఇప్పుడు ఫేస్ బుక్ లో పురుగులు తమ గూళ్లలోంచి బైటికి కదులుతూ ʹహింస జరిగినందుకు అభినందనలుʹ అంటూ నాకు సందేశాలు పంపుతున్నారు! మీ సందేశాలను మీరే తీసుకుని ఎక్కడ చెక్కుకోవలసి ఉందో అక్కడ చెక్కుకోండి. రిపబ్లిక్ డే అనేది మీ తాతగారి పెళ్లిరోజేమీ కాదు. అది నాదీ నీదీ మనదీ ఈ దేశస్తులందరిదీ.
దూరదూరాల నుంచి వచ్చిన అమాయకులైన, సాదాసీదా రైతులను, తమ ట్రాక్టర్లను అలంకరించుకొని వచ్చిన రైతులను, తమ సొంత ఊరేగింపు కోసం కొత్త దుస్తులు ధరించి వచ్చిన రైతులను, మీ కలుషిత రాజకీయాలకు పావులుగా వాడుకున్నారని చూస్తే మనసు చివుక్కుమంటున్నది. మన 72వ రిపబ్లిక్ డే పవిత్రత మీద మీ దుర్మార్గ రాజకీయాల మరకలు చూసి నొప్పి కలుగుతున్నది.
మీరు అసలు నేరస్తులు. వాళ్లు కాదు.

- ‍గురుప్రీత్ వాసి
(తెలుగు అనువాదం ఎన్.వేణుగోపాల్)

Keywords : farmers protest, delhi, republic day,
(2021-07-25 14:00:26)No. of visitors : 382

Suggested Posts


మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక

అనేక రాష్ట్రాల నుండి మహిళా రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి సిద్దమవుతున్నారు. ట్రాక్టర్లర్యాలీలో తామే ముందుండబోతున్నామని ప్రకటించారు మహిళా రైతులు. ఇ‍ందుకోసం అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నారు.

రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్

హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ‌ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దె

Search Engine

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ
ప్రతి మనిషి జేబులో పోలీసు!
బాలికలపై సామూహిక అత్యాచారం - బాధితులదే తప్పన్న గోవా ముఖ్యమంత్రి
kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI
పెగసస్ వ్యవహారం: పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరగకుండా అడ్డుకున్న‌ బీజేపీ
చరిత్రాకాశంలో ధ్రువనక్షత్రం
Learn From Charu Mazumdar! -Communist Workers Front, Canada
ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI
Naxalbari: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
పోలీసుల దుర్మార్గం - యువకుడి ఆత్మహత్య‌
సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !
ఢిల్లీలో సోమవారం మహిళా రైతుల ప్రదర్శన‌
UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు
పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు సహాయం చేయండి -మావోయిస్టు పార్టీ పిలుపు
భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు
దేశ రాజధానిలో రేపు రైతు పార్లమెంటు - అనుమతి ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం
మోడీని విమర్షించినందుకు జర్నలిస్టును ఉద్యోగం నుండి తీసేసిన టీవీ ఛానల్
రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!
అమ్రాబాద్ చెంచులపై ఫారెస్టు అధికారుల దాడులు - పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ‌
UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి
ఒక వైపు ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు... మరో వైపు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు
more..


నిన్న