కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌


కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌

కుట్రలను

రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో 32 రైతు సంఘాలు ఈ రోజు బల్బీర్ సింగ్ రాజేవాల్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన రైతు పెరేడ్ కు అపూర్వ స్పందన కనబర్చిన రైతులకు హృదయపూర్వక ప్రశంసలు తెలియజేశారు. నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా తమ స్తావరాలను ఏర్పాటు చేసుకున్న కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, మరి కొంతమంది కలిసి చేసిన దుర్మార్గమైన‌ కుట్ర ఇది అని కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. వారు రెండు నెలలుగా పోరాడుతున్న తమలో భాగస్తులు కాదని మోర్చా తెలిపింది.

సంయుక్త కిసాన్ మోర్చా విడుదల చేసిన ప్రకటన ఇంకా ఇలా ఉంది...

జనవరి 26 న రైతు సంస్థలు కిసాన్ పరేడ్ కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు, డీప్ సిద్ధు వంటి సామాజిక వ్యతిరేకులు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ తో కలిసి రైతుల ఆందోళనను పక్కదోవపట్టించే ప్రయత్నం చేశారు.ఈ కుట్రలో భాగంగానే ఆ సంస్థ మరియు ఇతర వ్యక్తులు రింగ్ రోడ్‌లో కవాతు చేస్తామని, ఎర్రకోటపై జెండాను విప్పుతామని ప్రకటించారు. ఆ కుట్రలో భాగంగానే షెడ్యూల్ కన్నా రెండు గంటల ముందు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ రింగ్ రోడ్‌లో కవాతు ప్రారంభించింది. శాంతియుత మరియు బలమైన రైతుల పోరాటాన్ని దెబ్బ‌గొట్టడానికి ఇది లోతుగా జరిగిన‌ కుట్ర. దీన్ని సమ్యుక్త‌ కిసాన్ మోర్చా సభ్యసంస్థలన్నీ తీవ్రంగా ఖండించాయి.

నిరసన వేదికలపై ఉండి శాంతియుత పోరాటం కొనసాగించాలని పోరాడుతున్న సంస్థలు రైతులకు విజ్ఞప్తి చేశాయి. ఈ ఆందోళనను కొనసాగించడానికి రైతు సంస్థలు సంకల్పించాయి. శాంతియుతంగా సాగుతున్న‌ రైతుల పోరాటాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సామాజిక వ్యతిరేకుల చర్యలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది.

ఈ శాంతియుత ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న‌ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను, ఇతర రైతు వ్యతిరేక శక్తులను ఉద్యమంలోకి అనుమతించకూడదని సంయుక్త కిసాన్ మోర్చాలోని అన్నిసంస్థలు సంకల్పించాయి. నిన్నటి సంఘటనలు రైతు వ్యతిరేక శక్తులను స్పష్టంగా బహిర్గతం చేశాయి.భవిష్యత్ కార్యక్రమాన్ని వివరించడానికి 32 సంస్థల అత్యవసర సమావేశం త్వరలో జరగనుంది.

జారీ చేసినవారు:
బల్బీర్ సింగ్ రాజేవాల్
జగ్జీత్ సింగ్ దల్లెవాల్
డాక్టర్ దర్శన్ పాల్
మరియు ఇతర రైతు నాయకులు.

Keywords : farmers protest, delhi, singhu, tikri, samyukta kisan morcha,
(2021-06-24 03:02:05)



No. of visitors : 473

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

Search Engine

పోరాటం నుండి నేను వెనక్కి వచ్చాను... హరిభూషణ్ ప్రజల కోసం నిలబడ్డాడు -ఎమ్మెల్యే సీతక్క‌
Addaguduru custodial death: దళిత మహిళ లాకప్ డెత్ పై న్యాయ విచారణకు ఆదేశించిన హైకోర్టు
హరిభూషణ్ తో ఒకరోజు....
హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై ఐదేళ్లు...
ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం
ʹనాన్నకు న్యాయం దొరుకుతుందనే ఆశ అడుగంటుతోందిʹ
ʹమన్‌రేగాʹ లో కులపర, మనువాద సలహాలు
అడ్డగూడూరు లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి - POW
కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌
సిల్గర్ పోలీసు క్యాంపు ముందు వేల మందితో కొనసాగుతున్న నిరసన - జూన్ 27-29న‌ భారీ ర్యాలీకి ప్రణాళిక‌
ఈ హత్యలను మీరెందుకు ప్రశ్నించడం లేదు? - పద్మకుమారి
ఒకవైపు ʹసిల్గరిʹ పోరాటం...మరో వైపు ʹనహరిʹ పోలీసు క్యాంపు ఎత్తివేయాలంటూ దంతెవాడలో భారీ ర్యాలీ
Chattisgarh: కాల్పులకు నిరసనగా ఆదివాసుల భారీ ర్యాలీ... ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి - పోలీసులపై చర్యలకు డిమాండ్
అభయ్ పేరిట విడుదలైన ప్రకటనకు జంపన్న జవాబు
సందె గంగన్న అమర్ రహే ‍- పోరుదారిలో నేలకొరిగిన కన్న బిడ్డను గుండెకద్దుకొని కన్నీటి సంద్రమైన గుంపుల ‍
బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం
శనివార‍ం సందె గంగయ్య అంత్య క్రియలు: మా అన్నది బూటకపు ఎన్ కౌంటర్... సందె గంగయ్య సోదరుడు
మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌
Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పౌరహక్కుల సంఘం నేతలు... ప్రజా సంఘాల‌పై నిషేధం ఎత్తివేయాలని విఙప్తి
Etala Rajendar :ఈటల రాజేందర్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ - సందె గంగయ్యతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి !
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు బ్రాహ్మణిజం వ్యతిరేకం అన్నందుకు నటుడిపై కేసు
more..


కుట్రలను