రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు


రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు

రైతులను

ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద నిరసనల్లో ఉన్న రైతులను పోలీసులు బలవంతంగా ఖాళిచేయించడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. అక్కడ రైతులకు ప్రాథమిక సదుపాయాలను తొలిగించడాన్ని మోర్చా నిరసించింది. ఒకవైపు పోలీసుల దుర్మార్గపు చర్యలపై రైతులు రైతు నాయకులైన రాకేష్ తికాయత్, తాజీందర్ విర్క్, కేకే రాగేష్ లు శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి ప్రాయోజిత వ్యక్తులు కొందరు ప్రభుత్వ సహకారంతో అక్కడికి వచ్చి రైతు ఉద్యమంపై విషం చిమ్ముతూ ప్రదర్శన నిర్వహించారు. అయితే వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోవద్దని రైతులకు నాయకులు సూచించారు. శాంతియుతంగా ఉండాలని కోరారు. రైతుల ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి నాయకులు ప్రజలకు వివరించారు. పాల్వాల్ వద్ద నిరసనకారులను తొలగించడమే కాక అక్కడ పోలీసులు స్థానికులను రెచ్చగొట్టి రైతులమీదికి పంపడంపై సంయుక్త మోర్చా మండిపడింది.

సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ఇంకా ఇలా ఉంది...

రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి, అణిచివేయడానికి ప్రభుత్వ చేయరాని ప్రయత్నాలు చేస్తోంది. అన్ని సరిహద్దుల్లో భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించింది. దీన్ని బట్టి రైతుల ఉద్యమం వల్ల ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్దమవుతోంది. ఈ ఉద్యమాన్ని ʹహింసాత్మకంగాʹ చూపించాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాని ఉద్యమం శాంతియుతంగా ఉండేలా చూడడానికి సమ్యూక్తా కిసాన్ మోర్చా ఏకగ్రీవ విధానాన్ని కలిగి ఉన్నాది.

ఢిల్లీ పోలీసులు పంపిన నోటీసులకు మేమేమీ బెదిరిపోవడం లేదు. దీనిపై త్వరలోనే స్పందిస్తాము. జనవరి 26 నాటి సంఘటనలకు సంయుక్త కిసాన్ మోర్చా బాధ్యత లేకపోయినా మోర్చాపై అబాండాలు వేయడం ద్వారా బిజెపి ప్రభుత్వం తన రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ ఉద్యమాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.

రైతులను మత పరంగా, రాష్ట్రాల పరంగా విభజించడానికి ప్రభుత్వం దాని అనుయాయులైన విభజన శక్తులు చేస్తున్న దుర్మార్గపు ప్రయత్నాలకు వ్యతిరేకంగా, ఉద్యమిస్తున్న‌ రైతుల మధ్య ఐక్యతా భావాన్ని బలోపేతం చేయడానికి ఈ రోజు, సింగు బోర్డర్ వద్ద రైతు సంఘం నాయకులు సద్భావన యాత్రను చేపట్టారు. ఈ యాత్ర మన త్రివర్ణ పతాకాన్ని అత్యంత ఎత్తులో ఉంచింది. దేశభక్తి మరియు జాతీయవాదం కొంతమంది వ్యక్తుల స్వంతం కాదు. రైతుల ఇళ్ళలో నుండి వచ్చి ఈ దేశం కోసం పోరాడుతున్న, ఈ దేశానికి రక్షణ కల్పిస్తున్న భారతదేశ జవాన్లకు ఎంత దేశభక్తి ఉన్నదో అలాగే ఈ దేశ‌ రైతులు అంతే దేశభక్తి కలిగి ఉన్నారు.

సింగూ సరిహద్దు నిరసన స్థలంలో సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సద్భవనా యాత్రలో బల్బీర్ సింగ్ రాజేవాల్, జగ్జీత్ సింగ్ దల్లెవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చాదుని, జగ్మోహన్ సింగ్, జంగ్బీర్ సింగ్, రజిందర్ సింగ్, అమర్జీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున‌ పోలీసులు మరియు భద్రతా దళాలను చూసి భయపడాల్సిన అవసరం లేదని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులందరికీ సందేశం ఇచ్చారు. టిక్రి సరిహద్దులో కవాతులు నిర్వహించడం ద్వారా రైతుల ఐక్యత, దేశభక్తిని చూపించారు. కవాతులకు బుటా సింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ నాయకత్వం వహించారు.

ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 171 మంది రైతులు అమరవీరులయ్యారు, అమరవీరులైన రైతులకు మా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాము. మహారాష్ట్ర నుండి ఢిల్లీకి నిరసన తెలపడానికి వచ్చిన ఆదివాసీ మహిళా రైతు సీతాబాయి తద్వి మరణం మాకు దిగ్బ్రాంతిని కలిగించింది. లోక్ సంఘర్ష్ మోర్చా చేసిన అనేక పోరాటాలలో 56 ఏళ్ల సీతాబాయి ముందంజలో ఉన్నారు. ఆమె త్యాగం వృథా కాదు. చాలా మంది ఆందోళనకారులు కూడా అనారోగ్యంతో ఉన్నారు, గాయపడ్డారు. ఇవన్నీ ప్రభుత్వ అహం వల్ల జరుగుతున్నవి.

జనవరి 26 న జరిగిన కిసాన్ పరేడ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పాల్గొన్నారు మరియు ఈ ఉద్యమం కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని, ఇది దేశవ్యాప్త ప్రజా ఉద్యమం అని నిరూపించారు. పంజాబ్, హర్యానా మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా ఐక్యంగా ఉందని మేము పూర్తి విశ్వాసంతో చెబుతున్నాము. ఢిల్లీకి చేరుకున్న రైతులకు లంగర్ మరియు అన్ని సౌకర్యాలను అందించడం కొనసాగించాలని మేము సామాజిక సంస్థలను కోరుతున్నాము.

నిజమైన నేరస్థులపై చర్యలు తీసుకునే బదులు, శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారి వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతియుత నిరసనకారులందరినీ వెంటనే, బేషరతుగా విడుదల చేయాలని సమ్యూక్త కిసాన్ మోర్చా కోరుతున్నది. దీప్ సిద్దూ వంటి సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోర్చా డిమాండ్ చేసింది.

డాక్టర్ దర్శన్ పాల్
సంయుక్త కిసాన్ మోర్చా

Keywords : farmers protest, delhi, police, samyukta kisan morcha, press statement,
(2021-07-28 21:03:06)No. of visitors : 251

Suggested Posts


ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

Search Engine

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ
ప్రతి మనిషి జేబులో పోలీసు!
బాలికలపై సామూహిక అత్యాచారం - బాధితులదే తప్పన్న గోవా ముఖ్యమంత్రి
kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI
పెగసస్ వ్యవహారం: పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరగకుండా అడ్డుకున్న‌ బీజేపీ
చరిత్రాకాశంలో ధ్రువనక్షత్రం
Learn From Charu Mazumdar! -Communist Workers Front, Canada
ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI
Naxalbari: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
పోలీసుల దుర్మార్గం - యువకుడి ఆత్మహత్య‌
సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !
ఢిల్లీలో సోమవారం మహిళా రైతుల ప్రదర్శన‌
UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు
పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు సహాయం చేయండి -మావోయిస్టు పార్టీ పిలుపు
భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు
దేశ రాజధానిలో రేపు రైతు పార్లమెంటు - అనుమతి ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం
మోడీని విమర్షించినందుకు జర్నలిస్టును ఉద్యోగం నుండి తీసేసిన టీవీ ఛానల్
రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!
అమ్రాబాద్ చెంచులపై ఫారెస్టు అధికారుల దాడులు - పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ‌
UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి
ఒక వైపు ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు... మరో వైపు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు
more..


రైతులను