జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌


జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌

జనవరి

జనవరి 30 న రాష్ట్రవ్యాప్తంగా నిరహార దీక్షలు చేపట్టాలని ఆల్ ఇండియా కిసాన్ సఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. అహింసాయుతమైన ఉద్యమానికి కట్టుబడి ఉంటామని తెలుపుతూ, జనవరి 30వ తేదీ గాంధీ వర్ధంతి రోజున, సామూహికంగాను, వ్యక్తిగతంగానూ, నిరాహార దీక్ష చేపట్టాలని, దీనిలో రైతు సంఘాల కార్యకర్తలు, రైతు ఉద్యమాన్ని సమర్థిస్తున్న ప్రజలందరూ పాల్గొనాలని ఏ.ఐ.కె.ఎస్.సి.సి. తెలంగాణా కోరింది

ఆల్ ఇండియా కిసాన్ సఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ తెలంగాణ శాఖ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....

ఏ.ఐ.కె.ఎస్.సి.సి తెలంగాణా, జనవరి 28, 2021

అహింసాయుతమైన రైతు ఉద్యమాన్ని డిమాండ్లు సాధించేంత వరకు కొనసాగిస్తాము: ఏ.ఐ.కె.ఎస్.సి.సి.

జనవరి 30, గాంధీ వర్ధంతి రోజున సామూహిక, వ్యక్తిగత నిరాహార దీక్షకు పిలుపు

జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన కిసాన్ పెరేడ్ కార్యక్రమాల తర్వాత ఏ.ఐ.కె.ఎస్.సి.సి. రైతు సంఘాల కూటమి తాము అహింసాయుతమైన ఉద్యమానికి కట్టుబడి ఉన్నామని, ఈ రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని ప్రకటించింది.
ఈ సందర్భముగా మూడు ముఖ్యమైన విషయాలను ప్రజల దృష్టికి తీసుకు వస్తున్నాము:

1. ఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగిన హింసాత్మక సంఘటనలు, రెడ్ ఫోర్ట్ వద్ద అవాంఛనీయ సంఘటనలను ఏ.ఐ.కె.ఎస్.సి.సి. తీవ్రంగా ఖండించింది, వాటితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ ఘటనలు రైతు ఉద్యమానికి వ్యతిరేకమైన వ్యక్తులు చేసినవని, వాటిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోలీసులకు కూడా బాధ్యత ఉందని తెలుపుతూ, అదే విధంగా రైతులపై పోలీస్ బలగాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన తీరుని ఖండించింది.

ఢిల్లీలో జనవరి 26కు ముందే కొంత మంది విద్రోహకర వ్యక్తులు దీప్ సింధు, లాఖా సిధనా వంటి వారు (సంయుక్త కిసాన్ మోర్చాలో భాగం కానీ వారు) రైతు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రకటించిన రూట్ తాము పాటించబోమని, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్దకు పోతామని ప్రకటించడం జరిగింది. ఇది పోలీసుల దృష్టికి తీసుకు వచ్చినా, వారు నివారించడానికి తగిన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఈ వ్యక్తులు, వారి సంఘాలు పెరేడ్ లో కొంత భాగాన్ని హైజాక్ చేశారు, హింసాత్మక ఘటనలకు ఉసిగొలిపారు.

2. సంయుక్త కిసాన్ మోర్చా మరియు ఏ.ఐ.కె.ఎస్.సి.సి. భాగస్వామ్య సంఘాలు పెరేడ్ ను శాంతియుతంగా, ఆదర్శవంతంగా నిర్వహించాయి. ఢిల్లీ ప్రజలు పూలరేఖలు వెదజల్లుతూ రైతుల ట్రాక్టర్లకు స్వాగతం పలికారు. అంతే కాదు దేశవ్యాప్తంగా కూడా 500 పైగా చోట్ల కిసాన్ పెరేడ్ జరిగింది. హైదరాబాదులో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన జరపడమే కాక ఏ.ఐ.కె.ఎస్.సి.సి. ఆధ్వర్యములో తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 40 పైగా స్థలాలలో ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు రైతు ఉద్యమాన్ని బలపరచి పెరేడ్ లలో పాల్గొన్నారు.

3. మొన్న ఢిల్లీలో జరిగిన అవాంఛనీయ సంఘటనలకు స్పందనగా, తమ నైతిక బాధ్యత స్వీకరిస్తూ, రైతు ఉద్యమాన్ని మరింత జాగరూకత తో, అహింసాయుతంగా నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

4. అహింసాయుతమైన ఉద్యమానికి కట్టుబడి ఉంటామని తెలుపుతూ, జనవరి 30వ తేదీ గాంధీ వర్ధంతి రోజున, సామూహికంగాను, వ్యక్తిగతంగానూ, నిరాహార దీక్ష చేపట్టాలని, ఏ.ఐ.కె.ఎస్.సి.సి. తెలంగాణా పిలుపును ఇచ్చింది. దీనిలో రైతు సంఘాల కార్యకర్తలు, రైతు ఉద్యమాన్ని సమర్థిస్తున్న ప్రజలందరూ పాల్గొనాలని కోరుతున్నాము.

5. కొన్ని ఛానళ్లలో, సామాజిక మాధ్యమాలలో, ఏ.ఐ.కె.ఎస్.సి.సి. ప్రస్తుత రైతు ఉద్యమం నుండి విరమించుకుంటున్నదని వచ్చిన తప్పుడు సమాచారాన్ని మేము స్పష్టంగా ఖండిస్తున్నాము. నిర్దిష్టంగా, ఉత్తర్ ప్రదేశ్ రైతు సంఘం నాయకులు వి.ఎం.సింగ్ వ్యక్తిగతంగా చేసిన ప్రకటనతో ఏ.ఐ.కె.ఎస్.సి.సి. కి ఎటువంటి సంబంధం లేదు. రెండు నెలల క్రితమే, ఉమ్మడి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని దెబ్బ తీసే కార్యకలాపాలు చేపట్టినందున వి.ఎం.సింగ్ ను ఏ.ఐ.కె.ఎస్.సి.సి. కార్యవర్గం నుండి తొలగించడం జరిగింది.

మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సాధించుకునేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏ.ఐ.కె.ఎస్.సి.సి. నాయకులు ప్రకటించారు.

- ఏ.ఐ.కె.ఎస్.సి.సి. తెలంగాణా కన్వీనర్ల కమిటీ

మరింత సమాచారం కోసం:
విస్సా కిరణ్ కుమార్ (రైతు స్వరాజ్య వేదిక): పశ్య పద్మ (తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం): టి.సాగర్ (తెలంగాణా రైతు సంఘం): కన్నెగంటి రవి (తెలంగాణా రైతు జే.ఏ.సి.): రాయల చంద్రశేఖర్ (ఏ.ఐ.కె.ఎం.ఎస్.): ఉపేందర్ రెడ్డి: ; అచ్యుత రామారావు (అఖిల భారత రైతు కూలీ సంఘం):

Keywords : farmers protest, telangana, aikscc,
(2022-09-24 03:55:39)



No. of visitors : 415

Suggested Posts


అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులు

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

Search Engine

సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
more..


జనవరి